దేశీయ ఆటో మార్కెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు చూస్తోంది. వినియోగదారులను నుంచి కూడా మంచి డిమాండ్ వస్తోంది. దీంతో కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. వాటిల్లో దిగ్గజ కంపెనీల నుంచి చిన్న చిన్న స్టార్టప్ ల వరకూ ఉంటున్నాయి. ఇదే క్రమంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జర్మన్ కార్ మేకర్ బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. గత నెలలోనే దీనిని గ్లోబల్ వైడ్ గా లాంచ్ చేసిన బీఎండబ్ల్యూ ఇప్పుడు మన ఇండియాలోని రోడ్లపై రహస్యంగా పరీక్షించింది. ఈ బీఎండబ్ల్యూ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ పేరు బీఎండబ్ల్యూ సీఈ-02. ఇది చూడటానికి సాధారణ స్కూటర్ లుక్ లో లేదు. సరికొత్త డిజైన్, బైక్ ని పోలిన బాడీతో ఆసక్తికరంగా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పడు చూద్దాం..
బీఎండబ్ల్యూ సీఈ02 ఎలక్ట్రిక్ స్కూటర్ గత నెలలోనే ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లోకి విడుదలైంది. మన దేశంలో మాత్రం టీవీఎస్ సహకారంతో టీవీఎస్కు చెందిన మానుఫ్యాక్టరింగ్ యూనిట్లలో ఇది తయారవుతోంది. దీనిని రహస్యంగా మన దేశంలోని రోడ్లపై టెస్టింగ్ చేశారు. ఈ క్రమంలో కర్ణాటకలోని శృంగేరిలోని ఓ పార్కింగ్ ఏరియాలో ఈ స్కూటర్ అందరి కంట పడింది. ఇది చూడటానికి సాధారణ స్కూటర్ లుక్లో లేదు. ప్రత్యేక రూపం, లక్షణాలను కలిగి ఉంది.
బీఎండబ్ల్యూ కొత్త స్కూటర్ లో 3.5 అంగుళాల టీఎఫ్టీ స్క్రీన్ ఉంటుంది. బ్లూటూత్ కనెక్టివిటీ, ఎల్ఈడీ హెడ్ లైట్లు, యూఎస్డీ ఫ్రంట్ ఫోర్క్ అసెంబ్లీ, రైస్డ్ హ్యాండిల్ బార్, సింగిల్ పీస్ సాడిల్ వంటి ఉన్నాయి. ఇది డబుల్ లూప్ ట్యూబులర్ ఫ్రేమ్ తో తయారైంది. 14 అంగుళాల చక్రాలు, డిస్క్ బ్రేకులు ఉన్నాయి.
ఈ బీఎండబ్ల్యూ సీఈ 02 స్కూటర్ లో లిథియం ఐయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది 2కేడబ్ల్యూహెచ్ సామర్థ్యంతో ఉంటుంది. ఇది రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. సింగిల్ బ్యాటరీ ప్యాక్, డ్యూయల్ బ్యాటరీ ప్యాక్. సింగిల్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది. సింగిల్ చార్జ్ పై 45 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. అదే డ్యూయల్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ లో గరిష్టంగా గంటలకు 95కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది. ఇది సింగిల్ చార్జ్ పై 90 కిలోమీటర్ల రేంజ్ చేస్తుంది. చార్జింగ్ కోసం 0.9కిలోవాట్ల స్టాండర్డ్ చార్జ్, అలాగే 1.5కిలోవాట్ల ఫాస్ట్ చార్జర్ కూడా ఉంటుంది. సింగిల్ బ్యాటరీ వెర్షన్ లో బ్యాటరీ ఫుల్ చార్జ్ అవడానికి మూడు గంటల రెండు నిమిషాలు పడుతుంది. అలాగే డ్యూయల్ బ్యాటరీ వెర్షన్ లో ఐదు గంటల 12 నిమిషాలు చార్జ్ టైం తీసుకుంటుంది.
ఈ స్కూటర్లను మన దేశ రోడ్లపై టెస్టింగ్ చేస్తున్న నేపథ్యంలో త్వరలోనే ఇక్కడ కూడా బీఎండబ్ల్యూ వాటిని లాంచ్ చేసే అవకాశం ఉంది. అయితే దీని ధర ప్రీమియం రేంజ్ లో ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..