
ప్రస్తుతం పండుగ సీజన్‌లో కార్ల కొనుగోళ్లు పతాక స్థాయిలో ఉంటాయి. అయితే వీరిని ఆకట్టుకోవడానికి కంపెనీలు కూడా ఎప్పటికప్పుడు కొత్త కార్లను రిలీజ్ చేస్తూ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఈవీ వాహానల హవా నడుస్తుండడంతో అన్ని కంపెనీల ఈవీ వెర్షన్‌లో తమ మోడల్స్‌ను లాంచ్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ కార్ల కంపెనీ హ్యూందాయ్ తన గేమ్-ఛేంజింగ్ ఎలక్ట్రిక్ వాహనం ఐయోనిక్ 5 ఎన్‌ను పరిచయం చేసింది. ఈ కారు కేవలం 18 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం వేగవంతమైన ఛార్జింగ్ సామర్థ్యంతో వస్తుంది. అలాగే 84 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ సెటప్ కచ్చితంగా ఈవీ వాహన ప్రియులను ఆకట్టుకుంటుంది. కాబట్టి హ్యూందాయ్ నుంచి వచ్చే ఈ కార్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
హ్యూందాయ్ ఐయోనిక్ 5 ఎన్ డ్యూయల్ మోటార్ సిస్టమ్‌తో రూపొందించారు. ఈ సొగసైన కారు 478 కేడబ్ల్యూ అద్భుతమైన పవర్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది. 8 స్పీడ్ డ్యూయల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్‌తో అమర్చిన ఐయోనిక్ 5 ఎన్ స్విఫ్ట్ యాక్సిలరేషన్‌ను కలిగి ఉంది. ముఖ్యంగా 3.25 సెకన్లలో 0 నుంచి 60 kmph వేగాన్ని అందుకుంటుంది. అద్భుతమైన డిజైన్‌తో పాటు ఆకర్షణీయమైన ఫ్రంట్ వ్యూతో వచ్చే ఈ కారు అందరినీ ఆకట్టుకుటుంది. హ్యూందాయ్ ఐయోనిక్5 ఎన్ ఇంటీరియర్ విషయానికి వస్తే యూసీబీ సీ పోర్ట్, వైర్‌లెస్ చార్జింగ్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, డిజిటల్ డిస్‌ప్లేతో సహా అత్యాధునిక సౌకర్యాలలతో వసతఉంది.
హ్యూందాయ్ ఐయోనిక్ 5 ఎన్ 50 కేడబ్ల్యూ ఛార్జర్‌ని ఉపయోగించి కేవలం ఒక గంటలో పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ కారు ఒకే వేరియంట్‌లో వచ్చినా మూడు విభిన్న రంగు ఎంపికల్లో వస్తుంది. 584 లీటర్ల బూట్ స్పేస్, ఒకే ఛార్జ్‌పై 631 కిమీల వరకు అందిస్తుంది. ఈ కారు లాంగ్ డ్రైవ్‌లకు సరైన ఎంపికను మార్కెట్ నిపుణుల పేర్కొంటున్నారు. అలాగే ఈ కారు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో ఆకట్టుకుంటుంది. 72.6 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో ఆధారంగా పని చేసే ఈ కారు వోల్వో ఎక్స్‌సీ 40 రీఛార్జ్‌తో పాటు కియా ఈవీ 6కు గట్టి పోటీనిస్తుంది. అయితే ఈ కారుకు సంబంధించిన లాంచ్ తేదీ, డెలివరీకి సంబంధించిన వివరాలు ఇప్పటికీ వెల్లడి కాలేదు. అలాగే ఈ కారు ధర కూడా కంపెనీ ఇంకా రివీల్ చేయలేదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..