డిసెంబర్ నెలలో ప్రముఖ బ్రాండ్లకు చెందిన వివిధ రకాల స్మార్ట్ ఫోన్లు విడుదల కానున్నాయి. నాణ్యమైన పనితీరు, బ్యాటరీ సామర్థ్యం, మెరుగైన సాఫ్ట్ వేర్ తో సాధారణ వినియోగంతో పాటు గేమింగ్ కోసం ప్రత్యేకంగా వీటిని రూపొందించారు. ఈ బెస్ట్ ఫోన్లలో ఒక దాన్ని ఎంపిక చేసుకోవడం మీకు సవాలే. డిసెంబర్ లో మార్కెట్ లోకి విడుదల కానున్న ఫోన్లపై స్మార్ట్ ఫోన్ లవర్స్‌కు ప్రత్యేక ఆసక్తి ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెలలో విడుదల కానున్న స్మార్ట్ ఫోన్స్‌పై ఓ లుక్కేద్దాం.
వీవో ఎక్స్ 200 సిరీస్ ఫోన్ డిసెంబర్ 12న విడుదల కానుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 9400 చిప్ సెట్, ప్రీమియం ఫొటోగ్రఫీ, డిస్ ప్లే టెక్నాలజీ దీని ప్రత్యేకతలు. వీవో ఎక్స్ 200, వీవో ఎక్స్ 200 ప్రో అనే డ్యూయల్ మోడల్ లో అందుబాటులోకి రానుంది. తక్కువ కాంతిలో కూడా స్పష్టమైన ఫొటోలు తీసుకునే కెమెరా సిస్టమ్ ఫీచర్లు దీనిలో ఉంటాయని భావిస్తున్నారు.
ఐక్యూ ఫోన్లలో బ్యాటరీ సామర్థ్యం చాలా మెరుగ్గా ఉంటుంది. డిసెంబర్ 3వ తేదీన విడుదల కానున్న ఐక్యూ 13లో కూడా 6000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. మల్టీ టాస్కింగ్, గేమింట్ కోసం క్వాల్కమ్ స్నాప్ డ్రాన్ 8 ఎలైట్ చిప్ సెట్ ఏర్పాటు చేశారు. సాధారణ వినియోగంతో పాటు గేమింగ్ కూడా చక్కగా పని చేస్తుంది.
గేమింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఆసస్ ఆర్వోజీ ఫోన్ 9 డిసెంబర్ రెండో భాగంలో విడుదల కానుంది. దీనిలో స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ చిప్ సెట్ ఏర్పాటు చేశారు. గేమింగ్ సమయంలో ఫోన్ వేడెక్కకుండా కోల్డ్ టెక్నాలజీ ఉంది. అంతరాయం లేని గేమింగ్ కోసం చాలా బాగుంటుంది. ప్రత్యేక మైన గేమింగ్ సెంట్రిక్ ఫీచర్లు ఏర్పాటు చేశారు.
వన్ ప్లస్ 13 ఫోన్ డిసెంబర్ చివరి వారంలో మార్కెట్ లో సందడి చేయనుంది. దీనిలో స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ చిప్ సెట్ ఏర్పాటు చేశారు. ఆక్సిజన్ ఓఎస్ ఆప్టిమైజేషన్లతో సాఫ్ట్ వేర్ పనితీరు బ్రహ్మాండంగా ఉంటుంది. అధిక రిఫ్రెష్ రేటు కలిగిన అమోలెడ్ డిస్ ప్లే ఉంటుందని భావిస్తున్నారు.
రెడ్ మీ 15 స్టార్ట్ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ చిప్ సెట్ అమర్చారు. పనితీరు చాలా మెరుగ్గా ఉంటుంది. నాణ్యమైన కెమెరా ఫీచర్లు, ఫ్లూయిడ్ పనితీరు కోసం ఆప్లిమైజ్ చేసిన ఎంఐయూఐ దీని ప్రత్యేకతలు. ధర కూడా అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. డిసెంబర్ నెల మధ్యలో ఈ ఫోన్ విడుదల కానుంది.
రియల్ మీ నోట్ 14లో అనేక స్పెసిఫికేషన్లను అప్ డేట్ చేశారు. ఈ ఫోన్ డిసెంబర్ 9న మార్కెట్ లోకి విడుదల కానుంది. దీనిలో 6200 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. 5జీ కనెక్టివిటీతో పాటు మెరుగైన కెమెరా ఫీచర్లు, ట్రిపుల్ మోడల్ లైనప్ తో ఆకట్టుకుంటుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ లా ఉండే అవకాశం ఉంది.
రియల్ మీ 14 సిరీస్ ఫోన్ డిసెంబర్ మధ్యలో మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంది. దీనిలో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, పాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ ఉంటుందని అంచనా. మధ్య తరగతి వినియోగదారులకు ఈ ఫోన్ అనుకూలంగా ఉంటుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
మోటోరోలా స్మార్ట్ ఫోన్లకు మార్కెట్ లో మంచి ఆదరణ లభిస్తోంది. ఆ కంపెనీ నుంచి విడుదల కానున్న జీ35పై అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ నెల మధ్యలో ఈ ఫోన్ విడుదల అవుతున్నారని భావిస్తున్నారు. మోటోరోలా ఫోన్లు మంచి కెమెరా, బ్యాటరీ ఫీచర్లతో ఆకట్టుకుంటాయి. ధర కూడా అందుబాటులో ఉంటుంది. కొత్త మోటో జీ35 కూడా అలాగే ఉంటుందని భావిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి