Electricity: మీ ఇష్టం వచ్చినట్టు కరెంట్ వాడుకోండి.. ప్రజలను కోరిన ఆ దేశ ప్రధాని.. ఎందుకంటే..

|

Nov 17, 2021 | 10:13 AM

మనదేశంలో కరెంట్ పొదుపుగా వాడమని చెబుతారు.. కరెంట్ వినియోగం విషయంలో సాధారణంగా ఏ దేశమైన పొదుపుగా వనరులను వినియోగించుకోమని చెబుతుంది.

Electricity: మీ ఇష్టం వచ్చినట్టు  కరెంట్ వాడుకోండి.. ప్రజలను కోరిన ఆ దేశ ప్రధాని.. ఎందుకంటే..
Electricity
Follow us on

Electricity: మనదేశంలో కరెంట్ పొదుపుగా వాడమని చెబుతారు.. కరెంట్ వినియోగం విషయంలో సాధారణంగా ఏ దేశమైన పొదుపుగా వనరులను వినియోగించుకోమని చెబుతుంది. కానీ, అందుకు విరుద్ధంగా నేపాల్ ప్రభుత్వం మాత్రం తమ పౌరులను కరెంట్ వినియోగాన్ని పెంచమని కోరుతోంది. ఇది నిజం. స్వయంగా నేపాల్ ప్రధాన మంత్రి షేర్ బహదూర్ దేవుబా మంగళవారం అభివృద్ధి కార్యకలాపాల కోసం దేశీయ జలవిద్యుత్ వినియోగాన్ని పెంచాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. భారతదేశం నేపాల్ లో మిగులిన విద్యుత్‌ను పొందుతుందనే గ్యారెంటీ లేదని అన్నారు. నేపాల్ ఇండిపెండెంట్ పవర్ జనరేషన్ అసోసియేషన్ (IPPAN) 19వ – 20వ వార్షిక సాధారణ సమావేశాలను ఉద్దేశించి డ్యూబా మాట్లాడుతూ, అభివృద్ధి కార్యకలాపాలను వేగవంతం చేయడానికి అలాగే COP-26లో చేసిన హామీలను నెరవేర్చడానికి దేశంలో జలవిద్యుత్ శక్తిని పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు.

‘మన మిగులు విద్యుత్‌ను భారతదేశం కొనుగోలు చేస్తుందన్న గ్యారెంటీ లేదు కాబట్టి, మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించడం ద్వారా.. గ్యాస్ హీటర్‌లను ఎలక్ట్రిక్ స్టవ్‌లతో భర్తీ చేయడం ద్వారా దేశంలో జలవిద్యుత్ వినియోగాన్ని దేశీయంగా పెంచాలి’ అని దేవుబా అన్నారు. శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పిన నేపాల్ ప్రధాన మంత్రి ఈ రోజుల్లో మన దేశం వాతావరణ మార్పుల ప్రభావాలతో బాధపడుతోంది, ఎందుకంటే శీతాకాలంలో కూడా వరదలు, కొండచరియలు విరిగిపడతాయి. వాతావరణ మార్పులను నియంత్రించేందుకు దక్షిణాసియాలో నేపాల్ ప్రముఖ పాత్ర పోషించాలని అన్నారు.

నేపాల్ తన మిగులు విద్యుత్‌ను విక్రయించేందుకు అనుమతి ఇచ్చింది
అంతకుముందు, నెల ప్రారంభంలో, నేపాల్ తన మిగులు విద్యుత్‌ను పోటీ ధరలకు భారతదేశానికి విక్రయించనుందని వార్తలు వచ్చాయి. ఇండియన్ పవర్ ఎక్స్ఛేంజ్ మార్కెట్‌లో తమ విద్యుత్తు వ్యాపారం చేసుకోవడానికి పొరుగు దేశాన్ని భారత్ అనుమతించిందని మీడియా నివేదికలు తెలిపాయి. విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే ఎనర్జీ ఎక్స్ఛేంజ్ నేపాల్‌కు అనుమతి ఇచ్చింది. ఈ విషయంలో నేపాల్ వైపు నుంచి చాలా ప్రయత్నాలు జరిగాయి. నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (NEA) తన మిగులు విద్యుత్‌ను విక్రయించే స్థితికి చేరుకుందని చెప్పారు.

తొలి దశలో 39 మెగావాట్ల విద్యుత్‌ను ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడింగ్ చేసేందుకు అనుమతించారు. ఇందులో ఎన్‌ఇఎ యాజమాన్యంలోని త్రిశూలి జలవిద్యుత్ ప్రాజెక్ట్ ద్వారా 24 మెగావాట్లు అలాగే, దేవిఘాట్ పవర్ స్టేషన్‌లో 15 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి అయింది. భారతదేశం ఆమోదం పొందిన తర్వాత, రెండు దేశాల మధ్య విద్యుత్ వాణిజ్యం కొత్త దశలోకి ప్రవేశించిందని నేపాల్ ఇంధన, జలవనరులు, నీటిపారుదల మంత్రిత్వ శాఖను ఉటంకిస్తూ ఒక నివేదిక పేర్కొంది. నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఇప్పుడు తన విద్యుత్తును విక్రయించడానికి ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్‌లో ప్రతి రోజు వేలంలో పాల్గొనవచ్చని మంత్రిత్వ శాఖ సంయుక్త ప్రతినిధి గోకర్ణ రాజ్ పంథా తెలిపారు.

ఇవి కూడా చదవండి: Onion Face Pack: ఉల్లిపాయ ఫేస్‌ప్యాక్.. ఇలా చేస్తే తళుక్కుమనే అందం మీ సొంతం..

Thyroid Disease: మహిళలకు థైరాయిడ్‌ సమస్య ఉంటే పిల్లలు పుట్టరా..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..!

Parenting Tips: గుక్కపెట్టి ఏడిచే సమయంలో.. చిన్నారుల శరీరం నీలం రంగులోకి మారుతుందా.? దీనికి కారణమేంటో తెలుసా..