Crypto Trading: ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో ఇన్వెస్ట్ మెంట్లకు(Crypto Investments) భారీ ఆదరణ పొందుతున్నాయి. మన దేశంలో కూడా వీటిలో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. భారత క్రిప్టోకరెన్సీ మార్కెట్లను దృష్టిలో ఉంచుకొని.. అమెరికన్ క్రిప్టో ట్రేడింగ్ ప్లాట్‌ఫాం కాయిన్‌బేస్(Coin Base) కూడా భారత్‌లో ఏప్రిల్ 7 న ఎంట్రీ ఇచ్చింది. మన దేశ క్రిప్టో ఇన్వెస్టర్లు క్రిప్టో కాయిన్లను కొనేందుకు యూపీఐ పేమెంట్స్ ఆప్షన్స్‌ను కాయిన్‌బేస్ అందుబాటులోకి తెచ్చింది. మూడు రోజుల కిందటే ఈ ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చిన దిగ్గజం కాయిన్‌బేస్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. క్రిప్టోకరెన్సీలను యూపీఐ పేమెంట్స్ ద్వారా కొనుగోలుచేసే వెసులుబాటును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సదరు సంస్థ వెల్లడించింది. ఇతర పేమెంట్ ఆప్షన్స్‌ను వినియోగించి క్రిప్టోలను కొనుగోలు చేయాలని కాయిన్‌బేస్ ఇన్వెస్టర్లకు సూచించింది. గతంలో ప్రముఖ మొబైల్ ఫిన్‌టెక్ సంస్థ మొబిక్విక్ వ్యాలెట్ కూడా దిగ్గజ క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్స్‌తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. అయితే కొద్ది రోజుల్లోనే క్రిప్టో ట్రేడింగ్‌పై తీసుకున్న వ్యాపార నిర్ణయాన్ని మొబిక్విక్ ఉపసంహరించుకుంది.
ప్రపంచంలోని అతి పెద్ద క్రిప్టో ట్రేడింగ్ ప్లాట్‌ఫాం కాయిన్‌బేస్ ఏప్రిల్ 7 న బెంగళూరులో జరిగిన మెగా ఈవెంట్‌లో యూపీఐ ద్వారా క్రిప్టోకరెన్సీలను కొనుగోలుచేయవచ్చునని వెల్లడించింది. దీనిపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) అలర్ట్ అయ్యింది. కాయిన్‌బేస్ నిర్ణయంపై NPCI సీరియస్ కాగా, భారత్‌లో యూపీఐ పేమెంట్ల ద్వారా క్రిప్టో కరెన్సీలను కొనుగోలు చేసుకోవడాన్ని అనుమతించిన కంపెనీ నిర్ణయం ప్రస్తుతం రెగ్యులేటరీ పరిశీలనలో ఉందని NPCI తెలిపింది. ఈ వ్యవహారానికి సంబంధించి NPCI తాజాగా ఒక ప్రకటనను విడుదల చేసింది.
Statement by NPCI as on 7th April 2022. With reference to some recent media reports around the purchase of Cryptocurrencies using UPI, National Payments Corporation of India would like to clarify that we are not aware of any crypto exchange using UPI. Please see attached document pic.twitter.com/lGTcaSLKeC
— NPCI (@NPCI_NPCI) April 7, 2022
ఇవీ చదవండి..
Washing Machine: వాషింగ్ మిషన్ ఎక్కువ కాలం ఉపయోగించాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ డిపాజిటర్లకు శుభవార్త.. ఆ స్కీమ్ గడువును మరోసారి పెంపు..