Multibagger Stock: లక్ష రూపాయలు పెడితే ఆరు కోట్లు వచ్చాయి.. ఆ స్టాక్ ఏంటో తెలుసా..

|

Nov 22, 2021 | 8:02 AM

పెన్నీ స్టాక్‌లో పెట్టుబడి పెట్టడం అనేది రిస్క్‌తో కూడుకున్నది. ఎందుకంటే అలాంటి స్టాక్‌లు చాలా అస్థిరంగా ఉంటాయి. అయితే ఒక కంపెనీ బలమైన వ్యాపార నమూనా, స్థిరమైన మార్కెట్ ఫండమెంటల్స్‌ ఉంటే అది దీర్ఘకాలికంగా విజయవంతం అవుతుంది...

Multibagger Stock: లక్ష రూపాయలు పెడితే ఆరు కోట్లు వచ్చాయి.. ఆ స్టాక్ ఏంటో తెలుసా..
Stock Market Sensex
Follow us on

పెన్నీ స్టాక్‌లో పెట్టుబడి పెట్టడం అనేది రిస్క్‌తో కూడుకున్నది. ఎందుకంటే అలాంటి స్టాక్‌లు చాలా అస్థిరంగా ఉంటాయి. అయితే ఒక కంపెనీ బలమైన వ్యాపార నమూనా, స్థిరమైన మార్కెట్ ఫండమెంటల్స్‌ ఉంటే అది దీర్ఘకాలికంగా విజయవంతం అవుతుంది. స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారు ఒక స్టాక్‌ను ఎంచుకునేటప్పుడు వ్యాపార నమూనా, కంపెనీ యొక్క సాధ్యమయ్యే లాభదాయక సామర్థ్యాన్ని పరిశీలించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి కంపెనీలు మంచి లాభాలు పొందుతాయని చెబుతున్నారు. ఇలానే ఓ పెన్నీ స్టాక్ మల్టీ రిటర్న్స్ ఇచ్చింది.

ఆర్తి ఇండస్ట్రీస్ షేరు మదుపరులకు లాభాలు తెచ్చిపెట్టాయి. ఈ కెమికల్ స్టాక్ ఆ మల్టీబ్యాగర్ స్టాక్‌లలో ఒకటిగా నిలించింది.ఈ స్టాక్ 2001, నవంబర్ 28న ఎన్‎ఎస్ఈలో రూ.1.51 స్టాక్ ధర ఇప్పుడు అంటే 2021, నవంబర్ 18న ఒక్కో షేరు రూ. 972.20కి పెరిగింది. ఈ కాలంలో స్టాక్ విలువ దాదాపు 650 రెట్లు పెరిగింది. 2001లో పెన్నీ స్టాక్‎గా ఉన్న ఆర్తి ఇండస్ట్రీస్ షేర్ నేడు నాణ్యమైన స్మాల్ క్యాప్ స్టాక్‌గా మారింది.ఈ షేరు గత నెల రోజులుగా అమ్మకాల ఒత్తిడిలో ఉంది. గత ఒక నెలలో, ఆర్తి ఇండస్ట్రీస్ షేర్లు ఒక్కో షేరు స్థాయికి దాదాపు ₹1021 నుండి ₹972.20కి పడిపోయాయి. ఈ కాలంలో దాదాపు 5 శాతం నష్టపోయాయి.

గత 6 నెలల్లో ఆర్తి ఇండస్ట్రీస్ షేర్లు ఒక్కో షేరు దాదాపు ₹832 నుండి ₹972.20కి పెరిగాయి. ఈ కాలంలో దాదాపు 16 శాతం పెరుగుదలను నమోదు చేసింది. సంవత్సరానికి సంబంధించి, ఈ స్టాక్ దాదాపు రూ. 630 నుండి రూ. 972.20 పెరిగింది. దాని వాటాదారులకు దాదాపు 55 శాతం రాబడి అందించింది. గత ఒక సంవత్సరంలో ఈ కెమికల్ స్టాక్ రూ.567 నుండి రూ.972 పెరిగింది. దాని వాటాదారులకు దాదాపు 71 శాతం రాబడి తెచ్చి పెట్టింది. గత 5 సంవత్సరాలలో ఆర్తీ ఇండస్ట్రీస్ షేర్లు మల్టీబ్యాగర్ రాబడిని అందించాయి. ఈ షేరు చివరి ఐదు సంవత్సరాల్లో రూ.181.28 నుంచి రూ.972.20కి పెరిగింది. ఈ కాలంలో దాదాపు 435 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఈ స్టాక్‎లో 20 సంవత్సరాల క్రితం లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే ఇప్పుడు దాని విలువ రూ.6,43,70,860గా ఉంది. ఐదు సంవత్సరాల క్రితం రూ.100000 ఇన్వెస్ట్ చేస్తే దాని విలువ ప్రస్తుతం రూ.5,36,187గా ఉంది.

Read Also.. Stock Market: గతవారం నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..