Multibagger stock: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోవిడ్ -19 మహమ్మారితో బలహీనపడినప్పటికీ ఈ సంవత్సరం భారతీయ స్టాక్ మార్కెట్ అద్భుతమైన ర్యాలీని సాధించింది. రికార్డ్-బ్రేకింగ్ ర్యాలీలో అనేక స్టాక్‌లు మల్టీబ్యాగర్ రిటర్న్‌లను ఇచ్చాయి. పెద్ద సంఖ్యలో పెన్నీ స్టాక్‌లు కూడా ర్యాలీలో పాల్గొన్నాయి. ఎందుకంటే అలాంటి అనేక స్టాక్‌లు తమ వాటాదారులకు భారీ రాబడిని అందించాయి. అటువంటి పెన్నీ స్టాక్‌లో గుజరాత్ ఆధారిత టెక్స్‌టైల్ కంపెనీ ఒకటి. గత 3 సంవత్సరాలలో ఈ పెన్నీ టెక్స్‌టైల్ స్టాక్ BSEలో రూ.0.97 నుంచి రూ.194కి పెరిగింది. ఈ కాలంలో దాదాపు 19,900 శాతం పెరిగింది. మల్టీబ్యాగర్ స్టాక్ ఈ ఏడాది 1,000 శాతానికి పైగా పెరిగింది.
షేర్ ధర చరిత్ర
మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్ డిగ్జామ్ గత నెలలో రూ.66.60 నుంచి రూ.194 వరకు పెరిగింది. ఈ కాలంలో దాదాపు 90 శాతం పెరిగింది. గత 3 నెలల్లో ఈ మల్టీబ్యాగర్ స్టాక్ రూ.17.27 నుంచి రూ.194కి పెరిగింది. ఈ కాలంలో దాదాపు 1000 శాతం వరకు పెరిగింది. అదేవిధంగా గత ఒక సంవత్సరం కాలంలో ఈ పెన్నీ స్టాక్ రూ.3.98 నుంచి రూ.194కి చేరుకుంది. ఈ కాలంలో దాదాపు 4800 శాతం పెరుగుదలను నమోదు చేసింది. అదేవిధంగా గత మూడు సంవత్సరాల్లో ఈ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్ ధర రూ. 0.97 నుంచి రూ.194 వరకు పెరిగింది.
పెట్టుబడిపై ప్రభావం
ఈ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్‌లో ఒక పెట్టుబడిదారుడు ఒక నెల క్రితం రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే, దాని ఇప్పుడు రూ.1.90 లక్షలకు చేరేది. ఒక ఇన్వెస్టర్ 3 నెలల క్రితం ఈ స్టాక్‌లో రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే, దాని విలువు ఈరోజు రూ.11 లక్షలకు చేరి ఉండేది. ఒక పెట్టుబడిదారుడు ఒక సంవత్సరం క్రితం ఈ పెన్నీ స్టాక్‌లో రూ.1 లక్ష పెట్టుబడి పెడితే ఇప్పుడు దాని విలువ రూ. 49 లక్షలు అయింది. అలాగే, ఒక ఇన్వెస్టర్ 3 సంవత్సరాల క్రితం ఈ స్టాక్‌లో రూ1 లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే ఈరోజు దాని విలువు రూ. 2 కోట్లకు చేరేదియ.
Note: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పూర్తిగా నష్టభయంతో కూడుకున్నది. మల్టీబ్యాగర్ స్టాక్స్‌ని గుర్తించడానికి చాలా నైపుణ్యం కావాలి. పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం.
Read Also.. EPFO: పీఎఫ్ ఖాతా బదిలీ చేయాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..