
Mukesh Ambani Shirdi: భారతదేశంలోని అత్యంత ధనవంతుడు, ప్రపంచంలోని అగ్రశ్రేణి బిలియనీర్లలో ఒకరైన ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ షిర్డీలోని సాయి బాబాను దర్శించుకున్నారు. ఆయన పూజ, హారతిలో పాల్గొన్నారు. రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ కుమారుడు, రిలయన్స్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ ధూప హారతిలో పాల్గొన్నారు. అనంతరం బాబా సమాధి వద్ద శివరస్సు వంచి నమస్కరించారు. షిర్డీ సాయిబాబా మందిరానికి చేరుకున్న అనంత్ అంబానీ బాబా భక్తిలో పూర్తిగా మునిగిపోచారు. ధూపం, హారతి ఇచ్చిన తర్వాత సాయిబాబా సమాధి వద్ద ఆచారంగా నీలిరంగు వస్త్రాన్ని కూడా సమర్పించాడు.
శ్రీ సాయి బాబా సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోరక్ష గడిల్కర్ ఆయనకు స్వాగతం పలికారు. రిలయన్స్ బిజినెస్ గ్రూప్ తరపున అంబానీ సాయి దర్బార్‌కు రూ.5 కోట్ల విరాళాన్ని అందించారు. ఈ సందర్భంగా గడిల్కర్‌కు చెక్కును అందజేశారు.
ఇది కూడా చదవండి: Gold Price: మహిళలకు ఇది కదా కావాల్సింది.. బంగారం ధర భారీగా పతనం.. రూ.18 వేలు తగ్గిన వెండి
ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ తరచుగా లోతైన ఆధ్యాత్మిక ఆసక్తిని కనబరుస్తాడు. మతపరమైన ప్రదేశాలను సందర్శిస్తాడు. ఈ సంవత్సరం ఏప్రిల్ ప్రారంభంలో అనంత్ అంబానీ జామ్‌నగర్ నుండి ద్వారక వరకు ప్రతి రాత్రి 10-12 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేశారు. ఈ ప్రయాణంలో అతను దారిలో ఉన్న ప్రధాన దేవాలయాలను కూడా సందర్శించి పూజలు చేస్తున్నాడు. అనంత్ అంబానీ జంతువుల సంక్షేమం కోసం చేసిన కృషికి ఇటీవల ఒక ప్రధాన అంతర్జాతీయ గౌరవాన్ని అందుకున్నారు. అనంత్ అంబానీ జంతు భద్రత కోసం పనిచేసే వ్యక్తులకు ఇచ్చే బహుమతి అయిన గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డ్ ఫర్ యానిమల్ వెల్ఫేర్ తో సత్కరం పొందారు.
ఇది కూడా చదవండి: Jio Plan: కేవలం రూ.91రీఛార్జ్‌తో 28 రోజుల వ్యాలిడిటీ.. డేటా, కాలింగ్ అన్ని బెనిఫిట్స్!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి