Reliance Jio IPO: ముఖేష్‌ అంబానీ మాస్టర్‌ ప్లాన్‌.. జియో ఐపీఓకు రంగం సిద్ధం.. ఎప్పుడో తెలుసా?

Reliance Jio IPO: 479 మిలియన్ల సబ్ స్క్రైబర్లతో దేశంలోనే అతిపెద్ద టెలికం ప్రొవైడర్‌గా రిలయన్స్ జియో నిలిచింది. కాగా, నవంబర్ 4, సోమవారం ఇంట్రాడే ట్రేడ్‌లో రిలయన్స్ షేరు ధర 4 శాతం పడిపోయింది. మధ్యాహ్నం 3:20 గంటల ప్రాంతంలో

Reliance Jio IPO: ముఖేష్‌ అంబానీ మాస్టర్‌ ప్లాన్‌.. జియో ఐపీఓకు రంగం సిద్ధం.. ఎప్పుడో తెలుసా?

Updated on: Nov 04, 2024 | 7:16 PM

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో 2025లో పబ్లిక్‌ ఇష్యూ (Jio IPO)కు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 100 బిలియన్‌ డాలర్ల విలువతో మార్కెట్‌లోకి అడుగుపెట్టేందుకు జియో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. చాలా కాలం తర్వాత రిటైల్‌ యూనిట్‌కు చెందిన ఐపీవోను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. Jio IPO కోసం రిలయన్స్ అధికారికంగా ఎటువంటి తేదీలను ప్రకటించలేదు. 2019లో రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్ ఐదేళ్లలో పబ్లిక్‌కు వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నాయని ముఖేష్ అంబానీ ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు దాని గురించి ఎలాంటి ప్రస్తావన రాలేదు. దీంతో 2025లో జియో ఐపీఓకు వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఇక రిలయన్స్ రిటైల్ బిజినెస్‌లో అంతర్గతంగా ఉన్న సవాళ్లను పరిష్కరించాల్సి ఉందని, అటుపైనే ఐపీఓకు వెళుతుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.

ఇది కూడా చదవండి: ATM Card Charge: ఎస్‌బీఐ ఏటీఎం కార్డుపై ఎన్ని రకాల ఛార్జీలు విధిస్తారో తెలుసా?

479 మిలియన్ల సబ్ స్క్రైబర్లతో దేశంలోనే అతిపెద్ద టెలికం ప్రొవైడర్‌గా రిలయన్స్ జియో నిలిచింది. కాగా, నవంబర్ 4, సోమవారం ఇంట్రాడే ట్రేడ్‌లో రిలయన్స్ షేరు ధర 4 శాతం పడిపోయింది. మధ్యాహ్నం 3:20 గంటల ప్రాంతంలో స్టాక్ 2.96 శాతం తగ్గి రూ.1,299.40 వద్ద ట్రేడవుతోంది. గత ఏడాది నవంబర్ 10న 52 వారాల కనిష్ట స్థాయి రూ.1,149.08కి చేరగా, ఈ ఏడాది జూలై 8న బిఎస్‌ఇలో 52 వారాల గరిష్ట స్థాయి రూ.1,608.95కి చేరుకుంది.

ఇది కూడా చదవండి: PM Kisan Scheme: భార్యాభర్తలిద్దరూ పీఎం కిసాన్ ప్రయోజనం పొందవచ్చా? రూల్స్‌ ఏంటి?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి