Mukesh Ambani: ఆసియాలోనే అత్యంత సంపన్నుల జాబితాలో ముఖేష్‌ అంబానీ.. మరి గౌతమ్‌ ఆదానీ ఏ స్థానంలో..

|

Oct 11, 2023 | 3:35 PM

భారతదేశంలో ధనవంతుల సంఖ్య దాదాపు 38 శాతం పెరిగింది. ఈ నివేదిక ప్రకారం.. దేశంలోని 1,319 మంది సంపన్నుల ఆస్తుల విలువ 1,000 కోట్లకు పైగా ఉంది. గడిచిన ఐదేళ్లలో సంపన్నుల సంపద మొత్తం 76 శాతానికి పైగా పెరిగింది. ఈ జాబితాలో శివ నాడార్ సంపద రూ.2,28,900 కోట్లు. జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం దేశంలో 259 మంది బిలియనీర్లు ఉన్నారు..

Mukesh Ambani: ఆసియాలోనే అత్యంత సంపన్నుల జాబితాలో ముఖేష్‌ అంబానీ.. మరి గౌతమ్‌ ఆదానీ ఏ స్థానంలో..
Harun India Rich List 2023
Follow us on

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ మళ్లీ ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. హురున్ ఇండియా రిచెస్ట్ లిస్ట్ 2023 ప్రకారం.. ఈ ఏడాది అదానీ గ్రూప్‌కు గట్టి దెబ్బ తగిలింది. నివేదికల ప్రకారం ముఖేష్ అంబానీ సంపద గణనీయంగా పెరిగింది. 2014లో ఆయన సంపద రూ.1,65,100 కోట్లు. ఇప్పుడు రూ.8,08,700 కోట్లుగా మారింది. ఇది నాలుగు రెట్లు పెరిగింది. భారతదేశంలో ధనవంతుల సంఖ్య దాదాపు 38 శాతం పెరిగింది.

ఈ నివేదిక ప్రకారం.. దేశంలోని 1,319 మంది సంపన్నుల ఆస్తుల విలువ 1,000 కోట్లకు పైగా ఉంది. గడిచిన ఐదేళ్లలో సంపన్నుల సంపద మొత్తం 76 శాతానికి పైగా పెరిగింది. ఈ జాబితాలో శివ నాడార్ సంపద రూ.2,28,900 కోట్లు. జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం దేశంలో 259 మంది బిలియనీర్లు ఉన్నారు.

గౌతమ్ అదానీకి సంపద ఎంత?

హురున్ ఇండియా డేటా ప్రకారం.. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. వారి సంపదలో భారీ క్షీణత ఉంది. అదానీ ఆస్తుల విలువ రూ.4,74,800 కోట్లు. 2,78,500 కోట్లతో సైరస్ పునావ్లా మూడో స్థానంలో ఉన్నారు.

హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023

1) ముఖేష్ అంబానీ- రూ. 808,700 కోట్లు
2) గౌతమ్ అదానీ- రూ. 474,800 కోట్లు
3) సైరస్ ఎస్ పూనావాలా- రూ. 2,78,500 కోట్లు
4) శివ్ నాడార్- రూ. 2,28,900 కోట్లు
5) గోపీచంద్ హిందూజా- రూ. 1,76,500 కోట్లు
6) దిలీప్ సంఘ్వీ – రూ. 1,64,300 కోట్లు
7) ఎల్‌ఎన్ మిట్టల్ మరియు కుటుంబం- రూ.1,62,300 కోట్లు
8) రాధాకిషన్ దమానీ- రూ. 1,43,900 కోట్లు
9) కుమార్ మంగళం బిర్లా- రూ. 1,25,600 కోట్లు
10) నీరజ్ బజాజ్- రూ. 1,20,700 కోట్లు

దేశంలో అత్యంత ధనవంతుల జాబితా

ఈ జాబితాలో శివ నాడార్ నాలుగో స్థానంలో ఉన్నారు. ఆయన నికర సంపద 2,28,900 కోట్లు. గోపీచంద్ హిందూజా, అతని కుటుంబం 1,76,500 కోట్ల సంపద కలిగి ఐదో స్థానంలో ఉన్నారు. 1,64,300 కోట్లతో దిలీప్ సంఘ్వీ ఆరో స్థానంలో ఉన్నారు. ఎల్‌ఎన్ మిట్టల్, కుటుంబం రూ.1,62,300 కోట్లతో ఏడో స్థానంలో ఉన్నారు. రాధాకిసన్ దమానీ, కుటుంబం రూ. 1,43,900 కోట్లతో ఎనిమిదో స్థానంలో ఉన్నారు. తర్వాతి స్థానంలో బిర్లా, బజాజ్ కుటుంబాలు ఉన్నాయి. అయితే దేశంలో రోజురోజుకు ధనవంతుల సంఖ్య పెరిగిపోతోంది. ఒకరిపై ఒ కరు పోటాపోటీగా తమ ఆస్తుల విలువలను పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో గౌతమ్ ఆదానీ ఆస్తులు విలువ పెరిగి ఒక్కసారిగి పడిపోయారు. తర్వాత మెల్లమెల్లగా పుంజుకున్నరు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి