Money9: మరింత ఖరీదైనవిగా మారనున్న రుణాలు..! పెరగనున్న EMI భారం..

|

Jul 29, 2022 | 6:33 AM

ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో 75 బేసిస్ పాయింట్ల పెంపును ప్రకటించింది. ఫెడ్ పెంపు కారణంగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణాలను ఖరీదైనదిగా మార్చేందుకు ఒత్తిడి పెరుగుతోంది.

Money9: మరింత ఖరీదైనవిగా మారనున్న రుణాలు..! పెరగనున్న EMI భారం..
Home Loan
Follow us on

Loans to get expensive: అధిక ద్రవ్యోల్బణం ప్రభావంతో ప్రపంచంలోని చాలా దేశాలు కుదేలవుతున్నాయి. ఈ క్రమంలో ద్రవ్యోల్బణాన్ని పెద్ద సవాలుగా పరిగణిస్తూ.. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ మరోసారి వడ్డీ రేట్లను పెంచింది. బుధవారం రాత్రి, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో 75 బేసిస్ పాయింట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఫెడ్ పెంపు కారణంగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణాలను ఖరీదైనదిగా మార్చేందుకు ఒత్తిడి పెరుగుతోంది. పాలసీ రేట్లపై నిర్ణయం తీసుకునేందుకు ఆర్‌బీఐ వచ్చే వారం సమావేశం కానుంది. ఆర్‌బీఐ కూడా పాలసీ రేట్లను మార్చే అవకాశం ఉందని, దీంతో రుణాల వడ్డీ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.

US సెంట్రల్ బ్యాంక్ తరహాలో RBI నిర్ణయం తీసుకుంటే.. అప్పుడు, గృహ, కారు రుణాల EMI పెరుగుతుంది. అయితే, రెపో రేటు పెంపు ఎంత ఉంటుందనే దానిపై.. ఈఎంఐ పెంపు ఆధారపడి ఉంటుందని వ్యాపార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఖరీదైన రుణాలకు సంబంధించిన మరింత సమాచారం కోసం, ఈ లింక్ ద్వారా Money9 అప్లికేషన్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి:
https://onelink.to/gjbxhu

ఇవి కూడా చదవండి

మనీ9 అంటే ఏమిటి?
Money9 OTT యాప్.. ఇప్పుడు Google Play, iOSలో అందుబాటులో ఉంది. వ్యక్తిగత ఫైనాన్స్‌కు సంబంధించిన ప్రతి సమాచారం ఏడు భాషల్లో అందుబాటులో ఉంటుంది. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఆస్తి, పన్ను, ఆర్థిక విధానాలు మొదలైన వివరాలు దీనిలో సులభంగా తెలుసుకోవచ్చు. మీ వేతనం.. బడ్జెట్‌ను ప్రభావితం చేసే అంశాలు కూడా అందుబాటులో ఉంటాయి. కావున ఆలస్యం చేయకండి.. Money9 యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.. మీ ఆర్థిక అవగాహనను పెంచుకోండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..