
Women Shopping Tips: మహిళలు ఎక్కువగా ఇష్టపడేది బంగారం, చీరలు. పండగలు, ఇతర సమయాల్లో షాపింగ్‌లలో బిజీగా ఉంటారు. ఇంట్లో ఎన్ని బట్టలు ఉన్నప్పటికీ కొత్తవి కొనేందుకు ఆసక్తి చూపుతుంటారు. అయితే బట్టల షాపులు ఎక్కువగా మహిళలతో కిటకిటలాడుతుంటాయి. ప్రతి షాపింగ్ మాల్స్‌లో మహిళలే ఎక్కువగా దర్శనమిస్తుంటారు. మహిళలు తమ లైఫ్ స్టైల్ లో కొన్ని మార్పులను చేసుకోవడం ద్వారా ప్రతినెల డబ్బులను సేవ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మహిళలు దుస్తుల షాపింగ్ విషయంలో చాలా జాగ్రత్త పడుతుంటారు. అయితే దుస్తులను కొనుగోలు చేసే సమయంలో మీరు కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే కచ్చితంగా డబ్బు ఆదా చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: Gold Price: దిగి వస్తున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతో తెలుసా?
మార్కెట్లో రకరకాల దుస్తులు వస్తుంటాయి. ముఖ్యంగా మహిళలను ఆకట్టుకునేందుకు రకరకాల డిజైన్‌లతో కూడిన చీరలు వస్తుంటాయి. అటువంటి చీరలనే ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు మహిళలు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే దుస్తుల విషయంలో మహిళలు డబ్బులను భారీగా ఆదా చేసుకోవచ్చని చెబుతున్నారు ఆర్థిక వేత్తలు. మహిళలు దుస్తులు కొనుగోలు చేసే సమయంలో ఎప్పుడు కూడా ఒకటి, రెండు షాపులను సందర్శించి ధరలను చెక్ చేసుకోవడం మంచది. వివిధ షాపుల్లో అదే రకమైన డిజైన్ చీరలను పరిశీలిస్తే ధరల్లో కాస్త తేడా ఉంటుంది.
ఇది కూడా చదవండి: School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. 10, 11న పాఠశాలలకు సెలవు!
ఉదాహరణకు మీరు ఒక ప్రత్యేక తరహా పట్టుచీర ఒక పెద్ద షోరూం లో కొనుగోలు చేసినట్లయితే కనీసం రూ.5 వేలకుపైగా ఉంటుంది. అదే పట్టు చీరలు అదే డిజైన్ మరొక షాపులో ట్రై చేసినట్లయితే 2000 నుంచి 3000 రూపాయల మధ్యలో ఉంటుంది.ఇక అదే మీరు హోల్ సేల్ మార్కెట్లో అదే చీరలు కొనుగోలు చేసినట్లయితే 1000 రూపాయల నుంచి 1500 రూపాయల మధ్యలో లభిస్తుంది. క్వాలిటీలో పెద్దగా తేడా లేకపోయిన ధరల్లో మాత్రం చాలా తేడా ఉంటుంది. అందుకే మహిళలు దుస్తులు కొనుగోలు చేసే సమయంలో ఎప్పుడు కూడా ఒకే షాపులోకి వెళ్లకుండా రెండు, మూడు షాపులలో చెక్ చేసుకుని కొనుగోలు చేయడం మంచిది. దీని వల్ల డబ్బులను భారీగా ఆదా చేసుకోవచ్చు.
కొందరు మహిళలు చీరలు కొనుగోలు చేసే సమయంలో మరి తక్కువ ధరకు బేరం ఆడితే ఏమనుకుంటారోననే సందేహం ఉంటుంది. అలాంటి సమయంలో ఎలాంటి సందేహం లేకుండా తక్కువ ధరల్లోనే బేరం ఆడటం మంచిది. కొన్ని పెద్ద షాపింగ్ మాల్స్‌లో ఎమ్మార్పీ రేట్లు, అదే విధంగా బేరం ఆడేందుకు అవకాశం లేకుండా ఎమ్మార్పీ ధరలపై డిస్కౌంట్లను అందిస్తుంటారు. ఇతర షాపుల్లో అయితే బేరం ఆడేందుకు అవకాశం ఉంటుంది.నిజానికి దుస్తులు కొనుగోలు చేసే సమయంలో కచ్చితంగా బేరం ఆడడం అనేది తప్పనిసరి. సాధారణంగా చీరలు కానీ ఇతర దుస్తులను కానీ విగ్రహించే వ్యాపారులు తమ లాభాన్ని సుమారు 100 శాతంగా పెట్టుకుంటారు. అందుకే మీరు బేరం ఆడటంలో ఏ మాత్రం మొహమాట పడవద్దు. ఆఫర్ల మోజులో పడకుండా షాపింగ్ చేసే సమయంలో క్వాలిటీ తో పాటు ఆ చీరకు అంత ధర పెట్టవచ్చా లేదా అన్నది ఒకటికి రెండు షాపుల్లో చెక్ చేస్తే కానీ తెలియదు. ఏ షాపుల్లోకి వెళ్లినా బేరం ఆడటం తప్పినిసరి. ముఖ్యంగా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌లో కాకుండా ఇతర షాపుల్లో బేరం ఆడేందుకు అవకాశం ఉంటుంది.
ఒక హోల్ సేల్ మార్కెట్లో చీరలను కొనుగోలు చేసే సమయంలో కొన్ని ట్రిక్స్ ఉపయోగించడం చాలా ముఖ్యం. మీరు హైదరాబాద్‌లోని మదీనా వంటి ప్రాంతాల్లో హోల్సేల్ మార్కెట్లో చీరలను కొనుగోలు చేయాల్సి వస్తే మహిళలంతా కలిసి ఒక గ్రూపుగా వెళ్లి షాపింగ్ చేయడం మంచిది. ఇలా వెళ్లినట్లయితే డబ్బులను భారీగా ఆదా చేసుకోవచ్చు. అక్కడ హోల్‌సేల్ ధరలకే చీరలను కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది. ఈ మధ్యకాలంలో ఆన్‌లైన్ షాపింగ్‌లో భారీ డిస్కౌంట్లను చీరలు, ఇతర దుస్తులు లభిస్తున్నాయి. ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే తక్కువ ధరల్లోనే కొనుగోలు చేసుకోవచ్చు. ఇలాంటి సమయంలో కొన్ని ట్రిక్స్ పాటిస్తూ షాపింగ్ చేసినట్లయితే డబ్బులు భారీగా ఆదా చేసుకోవచ్చు. సుమారు ఏడాదికి కనీసం రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు డబ్బులను ఆదా చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: Jio Plans: జియోలో కేవలం రూ.150లోపే అద్భుతమైన ప్లాన్స్.. 28 రోజుల వ్యాలిడిటీ!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి