అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తదితర ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో రిజిస్టర్ అయిన విక్రేతలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నిఘా ఉంచింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించి అక్రమ నగదు బదిలీ జరుగుతుందనే అనుమానంతో ఈడీ అధికారులు ఈ విక్రేతలను విచారిస్తున్నారు. బెంగళూరు, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈడీ అధికారులు దాడులు నిర్వహించినట్లు సీఎన్‌బీసీ టీవీ18 వెబ్‌సైట్ పేర్కొంది.
కొంతమంది విక్రేతలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మొదలైన ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగిస్తున్నారు. ఈ అమ్మకందారులు డబ్బును దాచడానికి ఈకామర్స్ విక్రయాలను దుర్వినియోగం చేస్తున్నారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో విచారణ జరుపుతోంది. భారతదేశంలో ఈకామర్స్ రంగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇక్కడ మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఈ కారణంగా అధికారుల నిఘా ఇకామర్స్ రంగంపై ఎక్కువగా ఉంది.
ఇది కూడా చదవండి: School Holidays: వారం రోజుల పాటు పాఠశాలలు బంద్.. కీలక నిర్ణయం తీసుకోనున్న ఆ ప్రభుత్వం!
ఇకామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు నిర్దిష్ట విక్రయదారులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే విధానాన్ని అనుసరిస్తున్నాయి. దీంతో పోటీకి అడ్డుకట్ట పడుతుందనే ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి కాంపిటీషన్ కమిటీ ఆఫ్ ఇండియా (సీసీఐ) విచారణ చేపట్టింది. విచారణలో ఈ ఆరోపణలు నిజమని తేలింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఇతర ఈకామర్స్ కంపెనీలు అప్రమత్తమయ్యాయి. ఇప్పుడు ఈ ప్లాట్‌ఫారమ్‌లను దుర్వినియోగం చేస్తున్న థర్డ్ పార్టీ విక్రేతలపై ED కన్ను పడింది. అదేవిధంగా పలు చోట్ల దాడులు నిర్వహిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Malware Attack: ఆండ్రాయిడ్ యూజర్లకు పెను ముప్పు.. మొబైళ్లలో మరో కొత్త మాల్వేర్!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి