Budget 2024: తనఖా లేకుండా రూ. 20లక్షల రుణం.. యువ పారిశ్రామికవేత్తలకు బంపర్ ఆఫర్..

|

Jul 24, 2024 | 1:23 PM

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం చేస్తూ.. దేశంలో యువ పారిశ్రామిక వేత్తలను మరింత ప్రోత్సహించేందుకు ముద్ర లోన్ పరిధిని పెంచుతున్నట్లు చెప్పారు. తరుణ్ కేటగిరీ కింద గతంలో రుణాలను పొంది విజయవంతంగా తిరిగి చెల్లించిన వ్యాపారవేత్తలకు ముద్రా రుణాల పరిమితిని ప్రస్తుత రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచుతామని ఆమె తెలిపారు.

Budget 2024: తనఖా లేకుండా రూ. 20లక్షల రుణం.. యువ పారిశ్రామికవేత్తలకు బంపర్ ఆఫర్..
Mudra Loan
Follow us on

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. యువశక్తిని ప్రోత్సహించడంతో పాటు వారిని భావి పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంగా ప్రభుత్వం వివిధ రకాల ప్రోత్సాహకాలను అందిస్తోంది. అందులో భాగంగానే ప్రధాన మంత్రి ముద్ర యోజన(పీఎంఏవై) ప్రవేశపెట్టింది. దీని ద్వారా పరిశ్రమాలు స్థాపించాలనుకునే వారికి ఆర్థిక సాయాన్ని రుణ రూపంలో అందిస్తోంది. అయితే దీనికో పరిమితి ఉంది. దానిని ఇప్పుడు డబుల్ చేస్తూ.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలకమైన ప్రకటన చేశారు. జూలై 23వ తేదీన ఆమె ప్రవేశపెట్టిన బడ్జెట్ 2024-25లో ముద్ర లోన్ లిమిట్ ను రెండింతలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న రూ. 10లక్షల పరిధిని.. రూ. 20లక్షలకు పెంచుతున్నట్లు వివరించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఇది ముద్ర లోన్..

ప్రధాన మంత్రి ముద్రా యోజన (పీఎంఏవై) ఏప్రిల్ 8, 2015న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. కార్పొరేట్, వ్యవసాయేతర చిన్న, సూక్ష్మ పారిశ్రామికవేత్తలకు 10 లక్షల రూపాయల వరకు సులువుగా ఎటువంటి పూచీకత్తు లేకుండా సూక్ష్మ-క్రెడిట్‌ను అందించడం దీని లక్ష్యం. ఈ పథకం కింద మెంబర్ లెండింగ్ ఇన్‌స్టిట్యూషన్స్ (ఎంఎల్ఐలు) ద్వారా అందించబడతాయి. అంటే బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీలు), మైక్రోఫైనాన్స్ సంస్థలు (ఎంఎఫ్ఐలు), ఇతర ఆర్థిక సంస్థలు అందిస్తాయి.

ప్రస్తుత ముద్ర లోన్ లో భాగంగా.. బ్యాంకులు శిశు లోన్ (రూ. 50,000 వరకు), కిషోర్ లోన్ (రూ. 50,000 నుంచి రూ. 5 లక్షల మధ్య), తరుణ్ లోన్ (రూ. 10 లక్షలు)లను ఎటువంటి పూచీకత్తు లేకుండా అందిస్తాయి.

కేంద్ర మంత్రి ప్రకటన ఇది..

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం చేస్తూ.. దేశంలో యువ పారిశ్రామిక వేత్తలను మరింత ప్రోత్సహించేందుకు ముద్ర లోన్ పరిధిని పెంచుతున్నట్లు చెప్పారు. తరుణ్ కేటగిరీ కింద గతంలో రుణాలను పొంది విజయవంతంగా తిరిగి చెల్లించిన వ్యాపారవేత్తలకు ముద్రా రుణాల పరిమితిని ప్రస్తుత రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచుతామని ఆమె తెలిపారు. అదే విధంగా రైతులు, యువత, మహిళలు, పేదల సర్వతోముఖాభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు. హస్తకళాకారులు, చేతివృత్తులు, స్వయం సహాయక సంఘాలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు మరియు మహిళా పారిశ్రామికవేత్తలు మరియు వీధి వ్యాపారులు ఆర్థిక కార్యకలాపాలకు మద్దతుగా పీఎం విశ్వకర్మ, పీఎం స్వనిధి, జాతీయ జీవనోపాధి మిషన్లు, స్టాండ్-అప్ ఇండియా వంటి పథకాల అమలు చేస్తున్నట్లు చెప్పారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..