Microsoft: ‘వార్టన్ ఫ్యూచర్ ఆఫ్ వర్క్ కాన్ఫరెన్స్’లో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల(Satya Nadella) పాల్గొన్నారు. ‘మైక్రోసాఫ్ట్ టీమ్స్’పై రిమోట్ వర్క్ ఎలాంటి ప్రభావం చూపిందో గుర్తించినట్లు ఈ సందర్బంగా ఆయన వెల్లడించారు. తమ రీసెర్చ్ ను ఉదహరిస్తూ.. వైట్ కాలర్ ఉద్యోగుల్లో 3వ వంతు మంది అర్ధరాత్రి వరకు వర్క్(Work Till Midnight) చేస్తున్నట్లు పేర్కొన్నారు. సాధారణంగా ప్రొడక్టివిటీ భోజనానికి ముందు, తర్వాత పెరుగుతుందని ఆయన తెలిపారు. కానీ.. అంటే అర్ధరాత్రి వరకు పనిచేయడం వల్ల వ్యక్తుల కుటుంబ జీవితాలు విచ్చిన్నమవుతున్నాయో తెలుస్తోందని ఆయన అన్నారు. అందుకే కంపెనీలు ఉద్యోగులకు సమయ పాలన పాటించే విషయంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని సత్యనాదెళ్ల అన్నారు. అలా చేస్తే ఉద్యోగులు మెయిల్స్ విషయంలో ఒత్తిడికి గురికారని అన్నారు.
“మేం వర్క్ ప్రొడక్టివిటీని కొలాబరేషన్, అవుట్‌పుట్ ఆధారంగా పరిగణలోకి తీసుకుంటాం. అయితే ప్రొడక్టివిటీలో అత్యంత ముఖ్యమైన భాగాలలో ఉద్యోగుల శ్రేయస్సు కూడా ప్రధానమైన అంశం ” అని సత్యనాదెళ్ల పేర్కొన్నారు. ఒత్తిడి ఉద్యోగులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసు. అందుకే ఆ ఒత్తిడిని జయించేందుకు సాఫ్ట్ స్కిల్స్, ఓల్డ్ ఫ్యాషనేడ్ స్కిల్స్ ను నేర్చుకోవాలని ఆయన సూచించారు. ఇక పని మన వ్యక్తిగత ఆరోగ్యంపై ప్రభావితం చూడకుండా ఉండాలంటే తగిన జాగ్రత్త పాటిస్తూ వర్క్ లైఫ్ ను బ్యాలెన్స్ చేసుకోవాలని ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల సూచించారు.
Microsoft CEO Satya Nadella warns that employee well-being could suffer from an ever-expanding workday that often now creeps well into the night https://t.co/JC7rCZWInI
— Bloomberg (@business) April 7, 2022
ఇవీ చదవండి..
Stock Market: RBI ప్రకటనతో లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. రూ.247 కోట్లకు చేరిన ఇన్వెస్టర్ల సంపద..