Michelin Tires: ఈ టైర్లు పంక్చర్‌ కావట.. 3డీ ప్రింటింగ్‌తో తయారు.. పూర్తి వివరాలు..!

|

Sep 19, 2021 | 5:12 PM

Michelin Tires: వాహనాలను మరింత వేగాన్ని అందించడంలో టైర్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయనే విషయం అందరికి తెలిసిందే. టైర్లు బాగుంటేనే ప్రయాణం సాఫీగా..

Michelin Tires: ఈ టైర్లు పంక్చర్‌ కావట.. 3డీ ప్రింటింగ్‌తో తయారు.. పూర్తి వివరాలు..!
Michelin Tires
Follow us on

Michelin Tires: వాహనాలను మరింత వేగాన్ని అందించడంలో టైర్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయనే విషయం అందరికి తెలిసిందే. టైర్లు బాగుంటేనే ప్రయాణం సాఫీగా సాగుతుంది. సరైన మోతాదులో టైర్లలో గాలి ఉంటే వాహనం ఎక్కువ పికప్‌ను అందుకుని వేగంగా వెళ్తుంది. సంప్రాదాయక టైర్లు ఎక్కువగా పంక్చర్‌ కావడం చూసే ఉంటాము. వాటి స్థానంలో ట్యూబ్‌లెస్‌ టైర్లు మార్కెట్లలోకి వచ్చాయి. ట్యూబ్‌లెస్‌ టైర్లతో కాస్త ఉపశమనం కలిగిన అది కొంత సేపు వరకే మాత్రమే. ట్యూబ్‌లెస్‌ టైర్లు పంక్చర్‌ అయితే కొంత దూరం మేర వెళ్లవచ్చు. ఈ టైర్లు కచ్చితంగా పంక్చర్‌ ప్రూఫ్‌ మాత్రం కాదు. తిరిగి వాటికి పంక్చర్‌ తప్పకుడా చేయాల్సిందే. పంక్చర్‌ ప్రూఫ్‌ టైర్ల కోసం అనేక కంపెనీలు చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నాయి. పంక్చర్‌ ప్రూఫ్‌ టైర్లను అందించడంలో మిచెలిన్‌ సంస్థ ముందుందనే చెప్పాలి. తాజాగా మిచెలిన్‌ పంక్చర్‌ ప్రూఫ్‌ టైర్లను టెస్ట్‌ చేసింది.

3డీ ప్రింటింగ్‌తో!

2005 నుంచి ప్రముఖ టైర్ల తయారీదారు మిచెలిన్‌ పంక్చర్‌ ప్రూఫ్‌ టైర్లపై పనిచేస్తోంది. ఒక దశాబ్దకాలం పాటు చేసిన పరిశోధనల ఫలితంగా మిచెలిన్‌ పంక్చర్‌ ఫ్రూఫ్‌ టైర్లను రియాల్టీలోకి తీసుకువచ్చింది. భవిష్యత్తులో రానున్న ఎలక్ట్రిక్‌ వాహనాలకు పంక్చర్‌ ప్రూఫ్‌ టైర్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. మిచెలిన్‌ భవిష్యత్తులో పర్యావరణానికి అనుకూలంగా ఉండే గ్రీన్‌ టైర్లను అందుబాటులోకి తీసుకురానుందని సమాచారం. యూనిక్‌ పంక్చర్‌ప్రూఫ్ టైర్ సిస్టమ్ ద్వారా ఎయిర్‌లెస్ టైర్, పంక్చర్‌ ప్రూఫ్‌ టైర్లను అందించనుంది. 3 డీ ప్రింటింగ్‌తో తయారుచేసిన టైర్లను మిచెలిన్‌ అందుబాటులోకి తీసుకురానుంది.

ఈ టైర్లను 2024లోపు తీసుకువచ్చే ప్రయత్నం

మిచెలిన్‌ 2017లో పంక్చర్‌ ప్రూఫ్‌ టైర్ల వీడియోను టీజ్‌ చేసింది. కంపెనీ డెవలప్‌ చేసిన టైర్లు గ్లాస్ ఫైబర్ రీఈన్‌ఫోర్స్‌డ్‌ ప్లాస్టిక్ తయారు చేయబడిన సౌకర్యవంతమైన లోడ్-బేరింగ్ నిర్మాణాన్ని కలిగి ఉంది. ఇలాంటి టైర్లను మార్స్‌పైకి పంపిన రోవర్‌, క్యూరియాసిటీలో నాసా ఉపయోగించింది. ఈ టైర్లను 2024లోపు మార్కెట్లలోకి తీసురావాలని మిచెలిన్‌ ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా రీసైకిలింగ్‌ చేయబడిన టైర్లనుపయోగించి పంక్చర్‌ ప్రూఫ్‌ టైర్లను తయారు చేయనుంది.

కాగా, ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మూడు బిలియన్లకు పైగా టైర్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ టైర్ల జీవితకాలం దాటిన తర్వాత, ఈ టైర్లను నిర్వీర్యం చేస్తారు. అందులో కొన్ని టైర్లను రీసైకిలింగ్‌ చేయగా, మిగతావి వ్యర్థాలుగా మిగిలిపోనున్నాయి. కొన్ని సందర్భాల్లో వాడి పడేసిన టైర్లు అగ్నిప్రమాదాలకు గురై.. వాతావరణంలో విషపూరిత వాయువులను వెదజల్లే అవకాశం ఉంది.

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

బాలాపూర్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Live AP MPTC ZPTC Elections Counting Live: పరిషత్‌ పంచాయతీ.. ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ..