CNG Price Hike: సహజ వాయువు ధరల పెరుగుదల కారణంగా దేశంలో CNG ధరలను పెంచే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇప్పుడు ముంబై, పరిసర ప్రాంతాల్లో ప్రజలు CNG కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ మహానగర్ గ్యాస్ లిమిటెడ్ (MGL) శుక్రవారం సిఎన్‌జి ధరలను కిలోకు రూ.4 పెంచుతున్నట్లు ప్రకటించింది. సహజ వాయువు ధరలు 110 శాతం పెరగడం వల్ల CNG ధరలు పెరిగాయి. ఏప్రిల్ 6 నుంచి సీఎన్‌జీ ధరలు పెరగడం ఇది మూడోసారి. MGL ప్రకారం.. ఈ అర్ధరాత్రి నుండి ముంబై, దాని పరిసర ప్రాంతాలలో CNG ధర కిలో రూ. 76 కి పెరుగుతుంది. MGL ముంబై, థానే, మీరా-భయాందర్, నవీ ముంబై, పరిసర ప్రాంతాలకు CNG సరఫరా చేస్తుంది.
ఒఎన్‌జిసి, ఆయిల్ ఇండియా సరఫరా చేసే గ్యాస్ ధరలను ఏప్రిల్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వం 110 శాతం పెంచింది. సహజ వాయువును కంప్రెస్ చేసినప్పుడు అది వాహనాలను నడపడానికి ఉపయోగించే CNGగా మారుతుంది. అదే సమయంలో ఇది వంట గ్యాస్‌లో కూడా ఉపయోగించబడుతుంది. ఎంజీఎల్ కొనుగోలు చేసిన గ్యాస్ ధరలు గణనీయంగా పెరిగాయని తన ప్రకటనలో పేర్కొంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా సీఎన్‌జీ రేట్లు పెంచుతున్నారు. అయితే, ధరలు పెరిగిన తర్వాత కూడా పెట్రోల్‌తో పోలిస్తే సీఎన్‌జీ 57 శాతం, డీజిల్‌తో పోలిస్తే 27 శాతం చౌకగా ఉందని ఎంజీఎల్ తెలిపింది.
మహారాష్ట్రలోని పూణెలో ఈరోజే సీఎన్‌జీ గ్యాస్ ధర రూ.2.20 పెరిగింది. పెరిగిన సీఎన్‌జీ ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు పూణేలో సీఎన్‌జీ గ్యాస్ ధర రూ.77.20. ఏప్రిల్ నెలలో సహజ వాయువు ధరలో చాలా అస్థిరత ఉంది. గతంలో ప్రభుత్వం సహజవాయువుపై వ్యాట్‌ను 13 శాతం నుంచి 3 శాతానికి తగ్గించింది. కొత్త వ్యాట్ రేటు 1 ఏప్రిల్ 2022 నుండి అమలు చేయబడింది. వ్యాట్ మినహాయించడంతో పూణెలో సీఎన్‌జీ గ్యాస్ ధర కిలో రూ.62కి తగ్గింది. కేవలం వారం రోజుల్లోనే ధరల పెంపు ప్రారంభించగా, ఇప్పటివరకు ఏప్రిల్‌లో రూ.15కు పైగా ధర పెరిగింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి: