MG Motor India: ఎంజి కోమెట్ ఎలక్ట్రిక్‌ వాహనానికి బుకింగ్‌ ప్రారంభం.. ‘ట్రాక్ అండ్ ట్రేస్’ ఫీచర్‌తో సరికొత్త యాప్‌

|

May 15, 2023 | 5:27 PM

ఎంజి మోటర్ ఇండియా పట్టణ ప్రాంత మొబిలిటీ కోసం స్మార్ట్ కోమెట్ ఎలక్ట్రిక్‌ వాహనాన్ని అందుబాటులోకి తీసుకువస్తోంది. దీని కోసం బుక్‌లను ప్రారంభించింది. కస్టమర్లు ఇప్పుడు ఎంజి మోటర్ ఇండియా వెబ్‌సైట్..

MG Motor India: ఎంజి కోమెట్ ఎలక్ట్రిక్‌ వాహనానికి బుకింగ్‌ ప్రారంభం.. ‘ట్రాక్ అండ్ ట్రేస్’ ఫీచర్‌తో సరికొత్త యాప్‌
Mg Motor India
Follow us on

ఎంజి మోటర్ ఇండియా పట్టణ ప్రాంత మొబిలిటీ కోసం స్మార్ట్ కోమెట్ ఎలక్ట్రిక్‌ వాహనాన్ని అందుబాటులోకి తీసుకువస్తోంది. దీని కోసం బుక్‌లను ప్రారంభించింది. కస్టమర్లు ఇప్పుడు ఎంజి మోటర్ ఇండియా వెబ్‌సైట్  పైన ఆన్‌లైన్ ద్వారా కానీ లేదా ఎంజి డీలర్‌షిప్‌ల వద్ద రు. 11,000/లు మాత్రమే చెల్లించి కోమెట్ ఎలెక్ట్ఱిక్ వాహనాన్ని బుక్ చేసుకోవచ్చు. అయితే బుక్‌ చేసుకున్న తర్వాత డెలివరీ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండేలా చూసుకోవడానికి గాను ఎంజి, ‘MyMG’ యాప్ ఏర్పాటు చేసింది. ‘ట్రాక్ అండ్ ట్రేస్’ ఫీచర్‌ని ప్రవేశపెడుతోంది. ఈ ఫీచర్ కస్టమర్లకు తమ ఫోన్ల నుండే తమ కారు బుకింగుల స్థితిని తెలుసుకునేందుకు వీలవుతుంది. ఎంజి కోమెట్ ఇవి బుకింగ్‌ల ప్రకటనపై ఎంజీ మోటార్‌ ఇండియా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ.. భారతీయ పట్టణప్రాంత వినియోగదారుల నిర్దిష్ట అవసరాలను తీర్చే ఉద్దేశ్యముతో ఎంజి కోమెట్ ఎలక్ట్రిక్‌ వాహనాన్ని తీసుకువచ్చినట్లు చెప్పారు. ఎంజి కంపెనీలో మొదటిదైన ‘ట్రాక్ అండ్ ట్రేస్’ ఫీచర్‌తో, కార్ బుకింగ్ స్థితిని తెలుసుకోవడానికి ఎంతగానో ఉపయోగ పడనుందన్నారు. కస్టమర్లు అతి త్వరలోనే తమ స్వంత ఎంజి కోమెట్ ని అనుభూతి పొందుతారని అన్నారు.

కోమెట్ ఎలక్ట్రిక్‌ వాహనం పేస్ వేరియంట్ ప్రారంభ ధర, రు.7.98 లక్షలతో, అదే ప్లే, ప్లష్ వేరియంట్ల ధరలు వరుసగా రూ.9.28 లక్షలు, రూ.9.98 లక్షలు (ఎక్స్-షోరూమ్ ధర) ఉన్నట్లు తెలిపారు. అయితే ఈ ఆఫర్ మొదటి 5,000 బుకింగ్‌ల వరకూ పరిమితమై ఉంటుంది. కంపెనీ మే నెల నుంచి దశల వారీగా కోమెట్ వాహన డెలివరీలను మొదలుపెడుతుంది. కోమెట్ ఎలక్ట్రిక్‌ వాహనం మరమ్మత్తులు, సర్వీస్ ఛార్జీలను కవర్ చేస్తూ ప్యాకేజీ అయిన ఒక ప్రత్యేకమైన ఎంజి ఇ-షీల్డుతో వస్తుంది. ఈ స్పెషల్ 3-3-3-8 ప్యాకేజ్ వీటిని అందజేస్తుందని అన్నారు.

కస్టమర్లు తమ తదుపరి ఎంజి కి సులభంగా అప్‌గ్రేడ్ చేసుకోవడానికి వీలుగా ఒక బై-బ్యాక్ ప్రోగ్రామును ఎంజి అందజేస్తోంది. కస్టమర్లు ఈ ప్రత్యేకమైన ప్యాకేజీని కొనుగోలు చేసినప్పుడు 3 సంవత్సరాల ఆఖరులో వారు ఒరిజినల్ ఎక్స్-షోరూమ్ విలువతో కూడిన 60% బై-బ్యాక్ పొందుతారు. కోమెట్ విద్యుత్ వాహన వేరియంట్లు ప్రతి ఒక్కటీ సులభమైన అనేక సర్వీస్ ఆప్షన్లను అందిస్తాయి. ఇందులో My MG యాప్ ద్వారా DIY, కాల్ మీదట సర్వీస్, ఇంటివద్దనే సర్వీస్, కారును వర్క్‌షాపుకు తీసుకువెళ్ళాల్సిన అవసరం ఏర్పడిన సమయాలలో పికప్/డ్రాప్ సర్వీసు కూడా ఉంటుందన్నారు.

ఇవి కూడా చదవండి

Mg Motor India Ev

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి