ఇల్లు కొనాలనుకుంటున్న వారికి షాకింగ్‌ న్యూస్‌! ఈ నగరాల్లో 3BHK కొనాలంటే ఎంత కావాలంటే..

నగరాల్లో సొంత ఇల్లు అనే మధ్యతరగతి కల కష్టంగా మారుతోంది. ప్రాప్‌టెక్ నివేదిక ప్రకారం, దేశంలోని టాప్ 5 మెట్రోలలో 3BHK ఫ్లాట్ సగటు ధర రూ. 2.7 కోట్లకు చేరింది. 12 సంవత్సరాల సంపాదన కూడా సరిపోని పరిస్థితి. కేవలం 11 శాతం కొత్త గృహాలు మాత్రమే అందుబాటు ధరలో ఉన్నాయి.

ఇల్లు కొనాలనుకుంటున్న వారికి షాకింగ్‌ న్యూస్‌! ఈ నగరాల్లో 3BHK కొనాలంటే ఎంత కావాలంటే..
Housing Affordability India

Updated on: Jan 23, 2026 | 8:00 AM

నగరాల్లో ఉద్యోగాలు చేస్తూ ఎప్పటికైనా ఒక సొంత ఇల్లు నిర్మించుకోవాలని లేదా కొనుగోలు చేయాలని చాలా మంది ఆశపడుతూ ఉంటారు. అందుకే తగ్గట్లు తమ ఖర్చులు తగ్గించుకుంటూ రూపాయి రూపాయి పొదుపు చేసుకుంటూ ఉంటారు. అయితే ప్రస్తుతం పెరుగుతున్న ధరలకు వారి పొదుపుకు ఏ మాత్రం సంబంధం లేకుండా పోతుంది. తాజా నివేదికల ప్రకారం కొన్ని నగరాల్లో ఇల్లు కొనడం అనేది మధ్యతరగతి వారికి ఒక కలలానే మిగిలిపోయే అవకాశం ఉందనే షాకింగ్‌ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.

మన దేశంలోని ప్రధాన నగరాల్లో ఇల్లు కొనడం అంతకంతకూ ఖరీదైనదిగా మారుతోంది. ప్రాప్‌టెక్ కంపెనీ స్క్వేర్ యార్డ్స్ కొత్త నివేదిక ప్రకారం.. దేశంలోని టాప్ ఐదు మెట్రోలలో కొత్త 3BHK ఫ్లాట్ సగటు ధర ఇప్పుడు దాదాపు రూ.2.7 కోట్లకు చేరుకుంది. నివేదిక ప్రకారం ఒక వ్యక్తి వార్షిక ఆదాయం దాదాపు రూ.20.3 లక్షలు ఉంటే 3BHK కొనడానికి వారి మొత్తం ఆదాయంలో దాదాపు 12 సంవత్సరాలు పడుతుంది. ఆశ్చర్యకరంగా భారతదేశంలోని అగ్రశ్రేణి 1 శాతం సంపాదకుల సగటు ఆదాయం (సంవత్సరానికి దాదాపు రూ.20.2 మిలియన్లు) కూడా అదే స్థాయిలో ఉంది. దీని అర్థం ధనవంతులు కూడా పెద్ద ఇంటిని కొనడం కష్టమని నివేదిక చెబుతోంది. వారి పరిస్థితే అలా ఉంటే ఇక సాధారణ ఉద్యోగులు, మధ్యతరగతి వారి పరిస్థితి ఏంటో ఆలోచించుకోవచ్చు.

గత కొన్ని సంవత్సరాలుగా ఇళ్లకు డిమాండ్ పెరిగింది. ఇంటి నుండి పని చేసే ధోరణి, మారుతున్న కుటుంబ అవసరాలు, ఎక్కువ స్థలం, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్మించడం దీనికి కారణం. అయితే పెరుగుతున్న భూమి ధరలు, నిర్మాణ వ్యయాలు, పెరుగుతున్న ప్రీమియం ప్రాజెక్టుల సంఖ్య సగటు వ్యక్తికి అందనంత దూరంలో ధరలను పెంచాయి.

11 శాతం ఇళ్లు మాత్రమే అందుబాటులో

కొత్త గృహ ప్రారంభాల్లో కేవలం 11 శాతం మాత్రమే సరసమైన విభాగంలోకి వస్తాయని నివేదిక పేర్కొంది. మిగిలిన 89 శాతం EMI భారాలు ప్రజల ఆదాయాల కంటే చాలా ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఉన్నాయి. దాదాపు 41 శాతం మార్కెట్లు కొనుగోలుదారులపై తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి