
బంగారం కేవలం రూ.60 అనగానే చాలా మంది షాక్ అయి ఉంటారు. అయితే ఇది నిజమైన బంగారం కాదు. అంతకంటే విలువైనది. అదే మేడారంలో అమ్మవార్లకు చెల్లించే నిలువెత్తు బంగారం బెల్లం. ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన జాతర అయిన మేడారం జాతరలో భాగంగా భక్తులు సమ్మక్క సారలమ్మకు మొక్కులు చెల్లించే క్రమంలో బంగారం (బెల్లం)తో పాటు కోళ్లు, మేకలను బలివ్వడం ఆనవాయితీ.
ఇప్పటికే కొన్ని కోట్ల మంది ఆ వన దేవతలను దర్శనం చేసుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం సమ్మక్క, సారలమ్మ వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది. అయినా కూడా భక్తల రద్దీ వెంటనే తగ్గిపోతుంది. కాగా ఈ జాతరలో మేకపోతు లైవ్ కిలో రూ.900 నుంచి 1000 వరకు అమ్ముతున్నారు. మటన్ ఏకంగా రూ.1500 చెబుతున్నారు. కిలో కోడిని రూ.300 నుంచి 350 వరకు విక్రయిస్తున్నారు. రూ.350 నుంచి రూ. 400 మధ్య ఉండే కిలో నాటుకోడిని రూ.700లకు అమ్ముతున్నారు. ఇక బంగారంగా పిలిచే బెల్లం కిలో రూ.50 నుంచి రూ.60కి అమ్ముతున్నారు.
తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా భక్తులు వచ్చారు. వచ్చినవారిలో ఎక్కువమంది నిలువెత్తు బెల్లంతో అమ్మవారికి మొక్కులు చెల్లిస్తారు. దీన్నే బంగారపు మొక్కులు అని పిలుస్తారు. ఎప్పటినుంచో ఈ అనవాయితీ కొనసాగుతూ వస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి