జీవితమంతా బరువులు, బాధ్యతలు, టెన్షన్లతో గడిపేసే వేతన జీవులకు రిటైర్ మెంట్ అనేది సాంత్వన చేకూర్చే విషయం. రిటైర్ మెంట్ తర్వాత అన్ని బరువులు బాధ్యతలు పూర్తి చేసుకొని సుఖమయ జీవనం గడపాలనా చాలా మంది తాపత్రయపడుతుంటారు. అయితే అది ముందు నుంచి సరైన ప్లానింగ్లో వెళ్తేనే సాధ్యమవుతుంది. ఎందుకంటే మీరు ఉద్యోగ జీవితంలో ఉన్నప్పుడే రిటైర్ మెంట్ ప్లానింగ్ చేసుకోవాలి. మంచి రాబడినిచ్చే పథకాలలో పెట్టుబడులు పెట్టాలి. అలాంటి ఓ పథకమే మ్యూచువల్ ఫండ్స్. వాస్తవానికి మ్యూచువల్ ఫండ్స్ లో రిస్క్ ఎలిమెంట్ ఉంటుంది. ఎందుకంటే ఇవి మార్కెట్ ఒడిదొడుకులకు లోనవుతుంటాయి. అయితే లాంగ్ టెర్మ్ లో మంచి స్ట్రాటజీలతో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు పెడితే కచ్చితమైన రాబడులు, లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ నేపథ్యంలో అటువంటి స్ట్రాటజీలను కొన్నింటి గురించి ఇప్పడు తెలుసుకుందాం రండి..
తమ పెట్టుబడులను వైవిధ్యపరచాలని కోరుకునే సీనియర్ సిటిజన్లకు మ్యూచువల్ ఫండ్స్ అద్భుతమైన ఎంపిక. సీనియర్ సిటిజన్‌లకు ప్రయోజనకరంగా ఉండే కొన్ని మ్యూచువల్ ఫండ్‌లు ఎంటంటే.. బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్‌లు, హైబ్రిడ్ ఫండ్‌లు, ఈక్విటీ సేవింగ్స్ ఫండ్‌లు. ఇవి సంప్రదాయ పెట్టుబడిదారులకు సరిపోతాయి. పెట్టుబడి హోరిజోన్ మూడు నుండి ఐదు సంవత్సరాల వరకు ఉంటే, బ్యాలెన్స్ అడ్వాంటేజ్, హైబ్రిడ్, ఈక్విటీ సేవింగ్స్ ఫండ్ ను ఎంచుకోవాలి. ఈ నిధులు స్టాక్‌లు, బాండ్‌లు లేదా ఇతర సెక్యూరిటీల వంటి విభిన్న పోర్ట్‌ఫోలియోల్లో పెట్టుబడులు పెట్టాలి. అలా చేయడం వల్ల రిస్క్ డైవర్సిఫికేషన్ అవుతుంది. నష్టపోయే అవకాశాలు తగ్గుతాయి. రాబడిని పెంచే విధంగా ఈ డైవర్సిఫికేషన్ సాయపడుతుంది. అలాగే స్థిరమైన ఆదాయం కోసం చూస్తున్న సంప్రదాయిక పెట్టుబడిదారులకు, బాండ్ ఫండ్స్ సరైన ఎంపిక. మరోవైపు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అధిక రాబడిని అందిస్తాయి కానీ ఎక్కువ అస్థిరతతో ఉంటాయి. మీ ఆర్థిక అవసరాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..