
మీ ఆధార్ నంబర్ ఎవరికీ బహిర్గతం కాకూడదని భావిస్తున్నారా? మీ ప్రైవసీని కాపాడుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకోసమే ఈ కథనం మీ కోసమే. యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) ఓ ప్రత్యేకమైన ఫీచర్ ను తీసుకొచ్చింది. అదే మాస్క్‌డ్ ఆధార్. దీనిలో ఆధార్ నంబర్ బహిర్గతం కాకుండా ఉంటుంది. అవసరమైన కొన్ని నంబర్లు మాత్రమే కనిపిస్తాయి. మిగిలిన నంబర్లు మాస్క్ చేసి ఉంటాయి. అయితే దీనిలో మీ పేరు, ఫొటోగ్రాఫ్, క్యూఆర్ కోడ్ వంటి వివరాలు అందులో కనిపిస్తాయి. మరి దీనిని ఎలా పొందాలి? దీని కోసం యూఐడీఏఐ ప్రత్యేక విధానాన్ని తీసుకొచ్చింది. ఆన్ లైన్ లోనే దీనిని డౌన్ లోడ్ చేసుకొనే వెసులుబాటును కల్పించింది.
ఆధార్ అనేది వ్యక్తుల బయోమెట్రిక్, డెమోగ్రాఫిక్ డేటా ఆధారంగా యూఐడీఏఐ జారీ చేసిన 12-అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య.దీని ఆధారంగా దేశంలో పౌరుడిగా గుర్తింపు ఉంటుంది. ప్రభుత్వ పథకాలు దీని ద్వారానే అందుతాయి. బ్యాంకు ఖాతాకు ప్రారంభానికి, రిజిస్ట్రేషన్, సిమ్ కార్డు ఇలా ఏ పనికైనా ఈ ఆధార్ కార్డు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. అటువంటి సమయంలో ఒకవేళ మీరు మీ ఆధార్ నంబర్ అందరికీ బహిర్గతం కాకూడదని భావిస్తే, భద్రత ఉండాలని తలస్తే అప్పుడు మీరు ఈ మాస్క్‌డ్ ఆధార్ ను వినియోగించొచ్చు. మాస్క్‌డ్ ఆధార్ అనేది మీ ఆధార్ నంబర్‌లోని మొదటి 8 అంకెలను ‘X’తో భర్తీ చేస్తుంది. చివరి నాలుగు సంఖ్యలను మాత్రమే కనిపించేలా చేస్తుంది. మీ గోప్యతను రక్షించడానికి, మీ ఆధార్ నంబర్ దుర్వినియోగం కాకుండా నిరోధించడానికి ఇది ఉపకరిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..