Maruti suzuki: మీరు తక్కువ ధరల్లో కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? షోరూమ్‌కు వెళ్లి కొత్త కారు కొనుగోలు చేయాలంటే లక్షల్లో డబ్బులు పెట్టాల్సి ఉంటుంది. కొందరు లోన్ కింద తక్కువ అమోంట్ కట్టి ఈఎంఐలో కారును కొనుగోలు చేస్తుంటారు. కానీ ప్రతి నెల ఈఎంఐ కట్టడం అంటే ఇబ్బందులే. అయితే తక్కువ ధరకే కారు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది శుభవార్తే అని చెప్పాలి. అయితే తక్కువలో కారు కొనుగోలు చేయాలనుకునేవారికి ఓ ఆప్షన్ ఉంది. అదే సెకండ్ హ్యాండ్ కొనుగోలు చేయడం.
సెకండ్ హ్యాండ్ కార్లు ఇప్పుడు తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. మీరు ఆన్‌లైన్‌లోనే మీకు నచ్చిన కారును ఎంపిక చేసుకొని కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు అక్కడకు వెళ్లి కారు టెస్ట్ డ్రైవ్ పూర్తి చేసి, మీకు నచ్చిత తర్వాతనే డబ్బులు చెల్లించి కొనొచ్చు.
మారుతి సుజుకీ ట్రూవ్యాల్యూ అనే వెబ్‌సైట్ అందుబాటులో ఉంది. ఇందులో మారుతి సుజుకీ కార్లు తక్కువ ధరకే లభిస్తాయి. అయితే అన్ని సెకండ్ హ్యాండ్ కార్లే ఉంటాయి. మీరు మీకు నచ్చిన బడ్జెట్‌లో కారు కొనుగోలు చేయవచ్చు.
మారుతి సుజుకీ ట్రూవ్యాల్యూ పోర్టల్‌లో మారుతీ స్విఫ్ట్ ఎల్‌డీఐ కారు ఒకటి తక్కువ ధరలో లభిస్తోంది. కేవలం లక్షా 90 వేలకే వస్తుంది. ఇది 2008 మోడల్ కారు. 75 వేల కిలోమీటర్లు తిరిగింది. డీజిల్ వేరియంట్. హైదరాబాద్ లొకేషన్‌లో ఈ కారు అందుబాటులో ఉంది. ఈ కారు కావాలనుకుంటే ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి వివరాలు తెలుసుకుని తీసుకోవచ్చు.
ఇవీ కూడా చదవండి: SBI Account Holders: ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త.. ఇక ఆ పనుల కోసం బ్రాంచ్‌లకు వెళ్లాల్సిన అవసరం లేదు
Amazing Facts: పుదుచ్చేరి గురించి ఆసక్తికరమైన విషయాలు.. ఇక్కడ ఆగస్టు 16న స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకొంటారు..ఎందుకో తెలుసా..?