Maruti Suzuki Offers: ఆ కార్లపై భారీ తగ్గింపు.. ఈ నెలాఖరు వరకూ అవకాశం.. త్వరపడండి
మారుతి సుజుకీ కార్లకు మన దేశీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 10 కార్లను పరిశీలస్తే దాదాపు సగానికి పైగా ఇవే ఉంటాయనడంలో సందేహం లేదు. ఈ మార్కెట్‌ను మరింత పెంచుకునేందుకు ఇప్పుడు మారుతి సుజుకీ నెక్సా డీలర్లు ప్రత్యేకమైన ఆఫర్లను ప్రకటించాయి. 2024 జూన్ ఆఫర్లుగా దాదాపు అన్ని మోడళ్లపైనా ఈ ఆఫర్లు ఉన్నాయి. నగదు తగ్గింపులు, ఎక్స్‌చేంజ్ బోనస్ వంటి ఇతర ప్రయోజనాలు కూడా డీలర్లు అందిస్తున్నారు.
మారుతి సుజుకీ కార్లకు మన దేశీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 10 కార్లను పరిశీలస్తే దాదాపు సగానికి పైగా ఇవే ఉంటాయనడంలో సందేహం లేదు. ఈ మార్కెట్‌ను మరింత పెంచుకునేందుకు ఇప్పుడు మారుతి సుజుకీ నెక్సా డీలర్లు ప్రత్యేకమైన ఆఫర్లను ప్రకటించాయి. 2024 జూన్ ఆఫర్లుగా దాదాపు అన్ని మోడళ్లపైనా ఈ ఆఫర్లు ఉన్నాయి. నగదు తగ్గింపులు, ఎక్స్‌చేంజ్ బోనస్ వంటి ఇతర ప్రయోజనాలు కూడా డీలర్లు అందిస్తున్నారు. అయితే ఈ ఆఫర్లు నగరం నుంచి నగరానికి మారుతూ ఉంటాయి. అలాగే అక్కడి స్టాక్ లభ్యతను బట్టి కూడా ఆధారపడి ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. ఇప్పుడు ఆయా కార్లపై ఉన్న నగదు తగ్గింపులు, ఎక్స్ చేంజ్ ఆఫర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
మారుతి గ్రాండ్ విటారా..
గ్రాండ్ విటారా హైబ్రిడ్ ప్రస్తుతం రూ. 74,000 విలువైన ప్రయోజనాలతో అందుబాటులో ఉంది. ఇందులో రూ. 20,000 నగదు తగ్గింపు, రూ. 50,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 4,000 వరకు కార్పొరేట్ ప్రయోజనాలు ఉన్నాయి. అదనంగా హైబ్రిడ్ వేరియంట్‌లపై మూడు సంవత్సరాల ఎక్స్‌టెండెడ్ వారంటీని పొందొచ్చు. పెట్రోల్ వేరియంట్‌లు రూ. 14,000-64,000 తగ్గింపుతో లభిస్తుండగా, సీఎన్‌జీ వెర్షన్ రూ. 4,000 విలువైన కార్పొరేట్ ప్రయోజనాలతో మాత్రమే అందుబాటులో ఉంది.
మారుతీ ఫ్రాంక్స్..
మారుతి ఫ్రాంక్స్ టర్బో-పెట్రోల్ వేరియంట్‌లు రూ. 57,000 వరకు తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. ఇందులో రూ. 15,000 నగదు తగ్గింపు, రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 2,000 వరకు కార్పొరేట్ ప్రయోజనాలు, రూ. 30,00 విలువైన వెలాసిటీ ఎడిషన్ యాక్సెసరీ కిట్ ఉన్నాయి. ఫ్రాంక్స్ ఎన్‌ఏ పెట్రోల్ వేరియంట్‌లపై ఈ నెల రూ. 27,000 తగ్గింపు, సీఎన్‌జీ వెర్షన్‌లపై రూ. 12,000 వరకు తగ్గింపుతో లభిస్తాయి.
మారుతీ జిమ్నీ..
జిమ్నీపై డిస్కౌంట్లు గత నెలల కంటే తగ్గాయి. లైఫ్ స్టైల్ ఎస్‌యూ ఇప్పుడు అన్ని వేరియంట్లపై రూ. 50,000 వరకు నగదు తగ్గింపుతో అందుబాటులో ఉంది. జిమ్నీ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 105హెచ్‌పీ, 134ఎన్‌ఎం, ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా ఐచ్ఛిక 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోతో జత చేసి ఉంటుంది.
మారుతీ బాలెనో..
మారుతి బాలెనో ఏఎంటీ వేరియంట్‌పై రూ. 57,100 వరకు విలువైన ప్రయోజనాలను వినియోగదారులు పొందుకోవచ్చు. ఇందులో రూ. 35,000 వరకు నగదు ప్రయోజనాలు, రూ. 15,000 ఎక్స్చేంజ్ బోనస్, రూ. 2,000 కార్పొరేట్ బోనస్ ఉన్నాయి. మారుతి ఇటీవల తన మొత్తం ఏఎంటీ శ్రేణి ధరను తగ్గించింది. మాన్యువల్ వేరియంట్‌లపై తగ్గింపులు రూ. 52,100 వరకు, సీఎన్‌జీ వెర్షన్‌పై రూ. 32,100 వరకు తగ్గింపు లభిస్తుంది.
మారుతి ఇగ్నిస్..
ఇగ్నిస్ 5-స్పీడ్ ఏఎంటీ వేరియంట్‌లు రూ. 58,100 వరకు విలువైన ప్రయోజనాలతో అందుబాటులో ఉన్నాయి. అయితే 5-స్పీడ్ మాన్యువల్ వేరియంట్‌లు తక్కువ నగదు ప్రయోజనం కారణంగా రూ. 53,100 వరకు తగ్గింపును పొందుతాయి. ఇగ్నిస్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో 83హెచ్‌పీ, 113ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
మారుతి సియాజ్..
గత నెల మాదిరిగానే, మారుతి సియాజ్ అన్ని వేరియంట్‌లు రూ. 48,000 వరకు తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. ఇందులో రూ. 20,000 నగదు తగ్గింపు, రూ. 25,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 3,000 విలువైన కార్పొరేట్ ప్రయోజనాలు ఉంటాయి. సియాజ్ ధర రూ. 9.40-12.29 లక్షల మధ్య ఉంది.
మారుతీ ఎక్స్‌ఎల్6..
పెట్రోల్ వేరియంట్‌లపై ఈ నెలలో రూ. 30,000 వరకు తగ్గింపుతో వస్తుంది. ఈ ఆఫర్‌లో రూ. 10,000 నగదు తగ్గింపు, రూ. 20,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి. ఎక్స్‌ఎల్6 సీఎన్‌జీ కేవలం రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ను పొందుతుంది. కియా కారెన్స్, మహీంద్రా మరాజో ప్రత్యర్థి ధర రూ. 11.61 లక్షల నుంచి రూ. 14.77 లక్షల వరకు ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..