Maruti Suzuki Ertiga 2022: మారుతి సుజుకి నుంచి మరో కొత్త ఎర్టిగా కారు.. ధర, ఫీచర్స్‌ వివరాలు!

|

Apr 15, 2022 | 12:17 PM

Maruti Suzuki Ertiga 2022: ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి తన ప్రసిద్ధ MUV సుజుకి ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను శుక్రవారం భారతదేశంలో విడుదల..

Maruti Suzuki Ertiga 2022: మారుతి సుజుకి నుంచి మరో కొత్త ఎర్టిగా కారు.. ధర, ఫీచర్స్‌ వివరాలు!
Follow us on

Maruti Suzuki Ertiga 2022: ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి తన ప్రసిద్ధ MUV సుజుకి ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను శుక్రవారం భారతదేశంలో విడుదల చేయనుంది. థర్డ్ జనరేషన్‌లో మూడు వరుసల ఏడు-సీట్ల MPV కొత్త అధునాతన ఫీచర్లతో వస్తుంది. అలాగే హ్యుందాయ్ అల్కాజర్ మార్కెట్లో కియా కేరెన్స్‌తో పోటీపడుతుంది. 2022 ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్ కాకుండా మారుతి ప్రీమియం ఫీచర్లతో 2022 XL6 సిక్స్-సీటర్ MPVని కూడా అందిస్తుంది. 2012లో తొలిసారిగా ప్రారంభించిన మారుతీ సుజుకి గత దశాబ్ద కాలంలో దేశంలో ఏడు లక్షల యూనిట్లకు పైగా ఎర్టిగాను విక్రయించింది. కంపెనీ అమర్చిన సిఎన్‌జిని ప్రారంభించడంతో ఎర్టిగాకు డిమాండ్ గణనీయంగా పెరిగింది.

మారుతి సుజుకి కొత్త ఎర్టిగాను నాలుగు ట్రిమ్‌లలో అందిస్తుంది. ఇందులో LXI, VXI, ZXI, ZXI+ వేరియంట్‌లు ఉన్నాయి. కొత్త ఎర్టిగా పెరల్ ఆర్కిటిక్ వైట్, స్ప్లెండిడ్ సిల్వర్, పెరల్ డిగ్నిటీ బ్రౌన్, మాగ్మా గ్రే, ఆబర్న్ రెడ్, ప్రైమ్ ఆక్స్‌ఫర్డ్ బ్లూ, మిడ్‌నైట్ బ్లాక్ వంటి ఏడు రంగులలో అందుబాటులోకి రానుంది.

కొత్త మారుతి ఎర్టిగా ఈ కార్లతో పోటీపడనుంది:

టయోటా ఇన్నోవా క్రిస్టాకు ఆదరణ ఉన్నప్పటికీ, మారుతి ఎర్టిగా, XL6 ఈ విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతున్న వాటిలో ఒకటిగా ఉన్నాయి. అయితే, ఇది హ్యుందాయ్ అల్కాజార్, కియా కారెన్స్ వంటి కొత్త మూడు-వరుసల కార్లతో మాత్రమే పోటీపడుతుంది. ఎర్టిగా ధర రూ. 9.29 లక్షల నుండి రూ. 12.68 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. ఇది ఈ ధర విభాగంలో మహీంద్రా మరాజో, రెనాల్ట్ ట్రైబర్ MPV లకు పోటీగా ఉంది. కియా ఈ సంవత్సరం క్యారెన్స్‌ను రూ. 8.99 లక్షలకు (ఎక్స్-షోరూమ్) విడుదల చేసింది.

మారుతి ఎర్టిగా అంచనా ధర:

మారుతి ఎర్టిగా MPV ప్రస్తుతం భారతీయ మార్కెట్లలో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే విక్రయించబడుతోంది. ఇది CNG వెర్షన్‌తో కూడా వస్తుంది. ఎర్టిగా ధర ప్రస్తుతం రూ. 9.29 లక్షలు (ఎక్స్-షోరూమ్) – రూ. 12.68 లక్షలు (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. మారుతి కొత్త ఎర్టిగాకు కొత్త ఇంజన్, కొత్త ట్రాన్స్‌మిషన్, అనేక కొత్త టెక్నాలజీని జోడించింది. అందుకే MPV ధర పాత మోడళ్ల కంటే కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కొత్త తరం ఎర్టిగా ధర రూ. 9.50 లక్షల నుండి Rs 13 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చని అంచనా.

ఇవి కూడా చదవండి:

LIC Premium: UPI ద్వారా LIC ప్రీమియం చెల్లించాలనుకుంటున్నారా..? ఈ దశలను అనుసరించండి!

Aadhaar History: మీరు ఆధార్‌ ఎక్కడెక్కడ ఉపయోగించారో తెలుసుకోవాలనుకుంటున్నారా..? ఇలా చేయండి