Maruti Suzuki: లీటరుకు 35 కిలోమీటర్ల మైలేజ్? మారుతీ నుంచి అత్యంత చౌకైన ‘హైబ్రిడ్’ కారు.. ఇక పెట్రోల్ టెన్షన్ ఉండదు!

Maruti Suzuki: ప్రస్తుతం మార్కెట్లో ఉన్న స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్ల ధరలు రూ.20 లక్షల నుండి మొదలవుతున్నాయి. కానీ మారుతీ తన సొంత టెక్నాలజీతో వీటిని సామాన్యులకు చేరువ చేయాలని చూస్తోంది. సాధారణ పెట్రోల్ కారు కంటే హైబ్రిడ్ వెర్షన్ ధర..

Maruti Suzuki: లీటరుకు 35 కిలోమీటర్ల మైలేజ్? మారుతీ నుంచి అత్యంత చౌకైన హైబ్రిడ్ కారు.. ఇక పెట్రోల్ టెన్షన్ ఉండదు!
Maruti Suzuki Baleno Series

Updated on: Apr 27, 2026 | 9:08 AM

Maruti Suzuki: భారతీయ కార్ల మార్కెట్‌లో ‘మైలేజ్’ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు మారుతీ సుజుకి. ఇప్పుడు తన రికార్డును తనే తిరగరాసేందుకు మారుతీ సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు మనం చూసిన దానికంటే అత్యంత ఎక్కువ ఇంధన సామర్థ్యం (Fuel Efficiency) కలిగిన కార్లను కంపెనీ తయారు చేస్తోంది. ముఖ్యంగా తన పాపులర్ మోడల్ ‘బాలెనో’ (Baleno) లో సరికొత్త హైబ్రిడ్ టెక్నాలజీని ప్రవేశపెట్టబోతోంది.

ఏమిటీ ‘సిరీస్ హైబ్రిడ్’ టెక్నాలజీ?

ప్రస్తుతం గ్రాండ్ విటారా వంటి కార్లలో మారుతీ టొయోటా కంపెనీకి చెందిన హైబ్రిడ్ టెక్నాలజీని వాడుతోంది. కానీ ఇప్పుడు మారుతీ స్వయంగా తన సొంత ‘సిరీస్ హైబ్రిడ్’ (Series Hybrid) టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది. సాధారణ భాషలో చెప్పాలంటే.. ఇందులో ఇంజిన్ కేవలం ఒక ‘జనరేటర్’ లాగా పనిచేసి బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. ఆ బ్యాటరీ ద్వారా ఎలక్ట్రిక్ మోటార్ రన్ అయ్యి కారు చక్రాలు తిరుగుతాయి. దీనివల్ల మెకానికల్ లింకేజీ తక్కువగా ఉండి, మైలేజ్ అద్భుతంగా పెరుగుతుంది.

ఇది కూడా చదవండి: Gold Jewellery: హైదరాబాద్‌లో బంగారం కొనాలా? తక్కువ ధరకే లభించే టాప్-3 ఏరియాలు ఇవే.. ఇక్కడ కొంటే భారీగా ఆదా!

ఇవి కూడా చదవండి

బాలెనో హైబ్రిడ్: ఫీచర్లు, ప్రత్యేకతలు

మైలేజ్: ప్రస్తుతం బాలెనో లీటరుకు 22-23 కి.మీ మైలేజీ ఇస్తుండగా, కొత్త హైబ్రిడ్ వెర్షన్ 30 నుండి 35 కి.మీ పైగా మైలేజీ ఇచ్చే అవకాశం ఉంది.

ఫీచర్లు: ఇందులో వైర్‌లెస్ ఛార్జింగ్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా, హెడ్స్-అప్ డిస్‌ప్లే వంటి ఆధునిక ఫీచర్లు ఉంటాయి. అదనంగా ఫ్రంట్ సీట్ వెంటిలేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది.

సేఫ్టీ: భారత్ NCAP రేటింగ్‌లో భద్రత విషయంలో రాజీ పడకుండా ఈ కారును తీర్చిదిద్దుతున్నారు.

ధర సామాన్యులకు అందుబాటులో ఉంటుందా?

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్ల ధరలు రూ.20 లక్షల నుండి మొదలవుతున్నాయి. కానీ మారుతీ తన సొంత టెక్నాలజీతో వీటిని సామాన్యులకు చేరువ చేయాలని చూస్తోంది. సాధారణ పెట్రోల్ కారు కంటే హైబ్రిడ్ వెర్షన్ ధర రూ.1 లక్ష వరకు ఎక్కువగా ఉండవచ్చని తెలుస్తోంది. అంచనా ప్రకారం బాలెనో హైబ్రిడ్ ధర రూ.8 లక్షల నుండి రూ.13 లక్షల (ఆన్-రోడ్) మధ్య ఉండే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: Ceiling Fan: సీలింగ్ ఫ్యాన్ గంటకు ఎంత కరెంట్ వాడుతుందో తెలుసా? కళ్లు చెదిరే విద్యుత్ లెక్కలు!

పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, మారుతీ మొదట ‘ఫ్రాంక్స్’ (Fronx) లో ఈ టెక్నాలజీని పరిచయం చేసి, ఆ తర్వాత 2027 మధ్యలో బాలెనో హైబ్రిడ్‌ను లాంచ్ చేసే ప్లాన్‌లో ఉంది. ప్రభుత్వ పన్ను నిబంధనలు కూడా అనుకూలిస్తే, భారత రోడ్లపై మారుతీ హైబ్రిడ్ కార్ల హవా మొదలవ్వడం ఖాయం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us