Stock Market: నాలుగు రోజుల్లో రూ.13.32 లక్షల కోట్ల నష్టం.. భారీగా పతనమవుతున్న షేర్లు..

|

May 12, 2022 | 7:03 AM

దేశంలో ద్రవ్యోల్బణం(Inflation) పెరుగుదల, ఆర్బీఐ(RBI), యూఎస్‌ ఫెడరల్‌ వడ్డీ రేట్ల పెంపు, విదేశీ పెట్టుబడిదారుల నగదు ఉపసంహరణ కారణంగా స్టాక్ మార్కెట్లు(Stock Market) భారీగా నష్టపోతున్నాయి..

Stock Market: నాలుగు రోజుల్లో రూ.13.32 లక్షల కోట్ల నష్టం.. భారీగా పతనమవుతున్న షేర్లు..
Stock Market
Follow us on

దేశంలో ద్రవ్యోల్బణం(Inflation) పెరుగుదల, ఆర్బీఐ(RBI), యూఎస్‌ ఫెడరల్‌ వడ్డీ రేట్ల పెంపు, విదేశీ పెట్టుబడిదారుల నగదు ఉపసంహరణ కారణంగా స్టాక్ మార్కెట్లు(Stock Market) భారీగా నష్టపోతున్నాయి. గత నాలుగు రోజుల్లో BSE-లిస్టెడ్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 13.32 లక్షల కోట్లకు పైగా తుడిచిపెట్టుకుపోయింది. తాజా సానుకూల సంకేతాలు లేకపోవడం వల్ల పెట్టుబడిదారులు ఈక్విటీల్లో కాకుండాబంగారం వంటి సురక్షితమైన పెట్టుబడి మార్గాలను ఎంచుకుంటున్నారు. మార్కెట్లు ఓవర్‌సోల్డ్ టెరిటరీలో ఉన్నందున మేము సమీప భవిష్యత్తులో పదునైన పుల్‌బ్యాక్ ర్యాలీని చూడగలమని కోటక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ ఈక్విటీ రీసెర్చ్ (రిటైల్) హెడ్ శ్రీకాంత్ చౌహాన్ అన్నారు.ఎల్‌&”టీ, బజాజ్‌ ఫిన్‌సెర్వ్, బజాజ్ ఫైనాన్స్, పవర్‌గ్రిడ్‌, ఇన్ఫోసిస్, మారుతీ బుధవారం భారీగా పతనమయ్యయి. యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్ లాభపడిన వాటిలో ఉన్నాయి.

అంతర్జాతీయ చమురు బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 3.05 శాతం పెరిగి USD 105.7కు చేరుకుంది. స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు మంగళవారం నికర రూ. 3,960.59 కోట్ల విలువైన షేర్లను ఆఫ్‌లోడ్ చేశారు. జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ మాట్లాడుతూ, “దేశీయ ఇన్వెస్టర్ల విశ్వాసం తగ్గడం, ఎఫ్‌ఐఐ అమ్మకాల కారణంగా గ్లోబల్ మార్కెట్లు గ్రీన్‌లో ట్రేడవుతున్నప్పటికీ ఇన్వెస్టర్లు అప్రమత్తంగానే కొనసాగుతున్నారు” అని అన్నారు. ఈక్విటీలలో బలహీనమైన ట్రెండ్‌ను ట్రాక్ చేస్తూ, BSE-లిస్టెడ్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ నాలుగు సెషన్లలో రూ.13,32,898.99 కోట్లు తగ్గి రూ.2,46,31,990.38 కోట్లకు చేరుకుంది.

Read also.. LIC IPO: ఎల్‌ఐసీ లిస్టింగ్‌పై పెట్టుబడిదారుల్లో ఆందోళన.. ఇష్యూ ధర కంటే తక్కువకు లిస్టయ్యే అవకాశం..!