Stock Market Today: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం ప్రారంభ ట్రేడింగ్‌లో బీఎస్ఈ సెన్సెక్స్ 600 పాయింట్లు, నిఫ్టీ 200 పాయింట్ల మేర లాభపడింది. ఉదయం 10 గం.లకు సెన్సెక్స్ 653 పాయింట్ల లాభంతో 57,511 పాయింట్ల వద్ద ట్రేడింగ్ అవుతుండగా.. అటు నిఫ్టీ 207 పాయింట్ల లాభంతో 17,136 పాయింట్ల దగ్గర ట్రేడింగ్ అవుతోంది. 2092 షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా.. 667 షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. 111 షేర్లు యధాతథ స్థితిలో ఉన్నాయి.
ఫార్మా మినహా మిగిలిన అన్ని సెక్టార్‌లకు సంబంధించిన షేర్లు లాభాలు స్వీకరిస్తున్నాయి. ఐటీ, ఆటోమొబైల్ రంగ షేర్లు 2 శాతానికి పైగా లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫినాన్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్య్సూరెన్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, టాటా స్టీల్, టెక్ మహీంద్ర, టైటాన్ కంపెనీ, ఇన్ఫోసిస్ తదితర షేర్లు లాభాల్లో ట్రేడింగ్ అవుతున్నాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా, సన్ ఫార్మా, ఎస్బీఐ, ఐటీసీ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
బలపడిన రూపాయి విలువ..
అటు ఫోరెక్స్‌లో రూపాయి మారకం విలువ అమెరికా డాలర్‌తో పోలిస్తే బలపడింది. గురువారంనాడు రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే 79.75 వద్ద ముగిసింది. శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌లో రూపాయి మారకం విలువ 21 పైసలు లాభపడి 79.54 వద్ద ట్రేడింగ్ అవుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తలు చదవండి