Today Gold Price: పసిడి ప్రియులకు శుభవార్త.. తగ్గుతున్న బంగారం ధరలు.. 7 నెలల్లో రూ.13,200 తగ్గింపు

|

Mar 04, 2021 | 6:10 AM

Gold Price: దేశీయంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశీయంగా చోటు చేసుకుంటున్న వివిధ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరల్లో మార్పు, చేర్పులు చోటు చేసుకుంటున్నాయి...

Today Gold Price: పసిడి ప్రియులకు శుభవార్త.. తగ్గుతున్న బంగారం ధరలు.. 7 నెలల్లో రూ.13,200 తగ్గింపు
Follow us on

Today Gold Price: దేశీయంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశీయంగా చోటు చేసుకుంటున్న వివిధ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరల్లో మార్పు, చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా పసిడి ధరలు దిగి వస్తున్నాయి. దేశీయంగా పది గ్రాముల బంగారం ధరపై స్స్వల్పంగా దిగి వచ్చింది. అయితే తాజా ధరలు పరిస్థితులను బట్టి ధరల్లో మార్పు చేర్పులు ఉంటాయి.

దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.44,600., 24 క్యారెట్ల 10గ్రాముల ధర రూ.48,650 ఉంది. ఇక దేశ ఆర్థిక నగరం ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,670 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,370. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ42,640, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 46,520 వద్ద కొనసాగుతోంది. అలాగే బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 42,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,300 ఉంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.42,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,300వద్ద ఉంది. విజయవడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,300 ఉంది. విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.42,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,300 ఉంది. కాగా, కాగా, దేశంలోని బంగారం ధరలపై ప్రభావం చూపే కారణాలు చాలా ఉంటున్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్‌ మార్కెట్‌ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్‌, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్దాలు వంటి పలు అంశాలపై పసిడి ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. కాగా, ఇటీవల నుంచే బంగారం ధరల్లో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని రోజులు ధరలు పెరుగుతుంటే.. మరి కొన్ని రోజులు తగ్గుముఖం పడుతున్నాయి.

7 నెలల్లో రూ.13 వేల వరకుతగ్గింపు

అయితే బంగారం కొనుగోలు చేసే వారికి ఇది సరైన సమయమని బులియన్‌ మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. ఇంకా తగ్గదా… ఇంతేనా అనే ప్రశ్నకు సమాధానం లేదంటున్నారు. ఇంకా తగ్గవచ్చనే అంచనా ఉంది కానీ ఎంత వరకూ తగ్గుతుందో చెప్పలేం అంటున్నారు. అయితే.. వచ్చే 2 నెలల తర్వాత నుంచి బంగారం ధరలు పెరుగుతాయనే అంచనాతో ఉన్నారు. మళ్లీ 22 క్యారెట్ల నగల బంగారం 10 గ్రాములు రూ.50,000 చేరే అవకాశం కూడా ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. గతేడాది ఆగస్టు 7న నగల బంగారం ధర 10 గ్రాములు అత్యధికంగా రూ.54,200 ఉంది. మరి ఇప్పుడో రూ.42 వేలకుపైగా ఉంది. అంటే… ఈ 7 నెలల్లో బంగారం ధర రూ.12,100 తగ్గింది. అదే 24 క్యారెట్ల బంగారమైతే 7 నెలల్లో రూ.13,200 తగ్గింది.

ఇవి కూడా చదవండి :

Good News: అమెరికా వెళ్లే విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఉచిత సేవా కేంద్రం.. తొలిసారిగా హైదరాబాద్‌లో ఏర్పాటు

Post Office: పోస్టాఫీసుల్లో నగదు ఉపసంహరణలు, డిపాజిట్లలపై చార్జీల వసూలు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

ఫ్లిప్‌కార్ట్‌ కీలక నిర్ణయం.. టైర్–2 నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాలకు గ్రోసరీ సేవలను విస్తరించేందుకు నిర్ణయం