Tea Powder: తేయాకులో పురుగుమందు అవశేషాలు.. సరుకు తిరిగి పంపిన దేశాలు..

|

Jun 04, 2022 | 6:48 AM

పురుగుమందుల వాడకం భారతీయ టీ పౌడర్‌ ప్రతిష్టను దెబ్బ తీసింది. చాలా దేశాలు భారతీయ టీ సరుకును తిరిగి ఇచ్చాయి. ఎందుకంటే అందులో పురుగుమందు గరిష్ట అవశేష స్థాయి (MRL-గరిష్ట అవశేషాల పరిమితి) సూచించిన మొత్తం కంటే ఎక్కువగా ఉంది...

Tea Powder: తేయాకులో పురుగుమందు అవశేషాలు.. సరుకు తిరిగి పంపిన దేశాలు..
Tea Powder
Follow us on

పురుగుమందుల వాడకం భారతీయ టీ పౌడర్‌ ప్రతిష్టను దెబ్బ తీసింది. చాలా దేశాలు భారతీయ టీ సరుకును తిరిగి ఇచ్చాయి. ఎందుకంటే అందులో పురుగుమందు గరిష్ట అవశేష స్థాయి (MRL-గరిష్ట అవశేషాల పరిమితి) సూచించిన మొత్తం కంటే ఎక్కువగా ఉంది. భారత టీ ఎగుమతిదారుల సంఘం (ఐటీఈఏ) అధ్యక్షుడు అన్షుమన్ కనోరియా పీటీఐతో జరిగిన సంభాషణలో ఈ విషయాన్ని వెల్లడించారు. అంతకుముందు యూరప్‌లో భారతీయ బాస్మతి రైస్ వ్యాపారం కూడా ఎక్కువ పురుగుమందుల వాడకంతో దెబ్బతింది. అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం బాసుమతి వరి సాగు చేస్తున్న రైతులకు పురుగుమందుల వాడకం అంతంత మాత్రంగానే ఉండేందుకు ఏం చేయాలో అవగాహన కల్పిస్తోంది. వాస్తవానికి చాలా దేశాల్లో ఆహార పదార్థాలలో పురుగుమందుల స్థాయికి సంబంధించి కఠినమైన నియమాలు ఉన్నాయి.

టీ ఎగుమతిదారుల సంఘం అధ్యక్షుడు అన్షుమన్ కనోరియా మాట్లాడుతూ, శ్రీలంకలో సంక్షోభం కారణంగా అంతర్జాతీయ స్థాయిలో తేయాకు కొరతను తీర్చడానికి గ్లోబల్ మార్కెట్‌లో టీ ఎగుమతులను పెంచడం ద్వారా అంతర్జాతీయ మార్కెట్‌లో భారతదేశం ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు. అయితే కెమికల్స్ అధికంగా ఉండటం వల్ల ఎగుమతి అవుతున్న టీకి ఎదురుదెబ్బ తగలవచ్చు. టీ కోసం చాలా దేశాలు కఠినమైన నిబంధనలు పాటిస్తున్నాయని తెలిపారు.
చాలా దేశాలు యూరోపియన్ యూనియన్ ప్రమాణాలను అనుసరిస్తాయి. ఇవి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కంటే చాలా కఠినమైనవి. భారతదేశం 2021 సంవత్సరంలో 195.9 మిలియన్ కిలోల టీని ఎగుమతి చేసింది. దీని వల్ల రూ.5,246 కోట్లు వచ్చాయి. ఈ ఏడాది 300 మిలియన్ కిలోల టీ ఎగుమతి చేయాలని టీ బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది.