భారతదేశంలో చాలా మంది పెట్టుబడి స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడితో రిస్క్‌తో కూడినవని పరిగణిస్తూ ఉంటారు. అయితే వయస్సులో ఉన్నప్పుడు రిస్క్ ఫేస్ చేయకపోతే ఏం లాభమని స్టాక్ మార్కెట్ వైపు అడుగులు వేస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో ఆటో అనుబంధ కంపెనీ షేర్లు కేవలం 15 ఏళ్లలో పెట్టుబడిదారులను కోటీశ్వరులను చేశాయి. దీని షేర్ల ధర మార్చి 13, 2009న కేవలం రూ. 3.28గా ఉంటే ఇప్పుడు, అవి రూ. 336.70 వద్ద ఉన్నాయి. అంటే రూ.1,00,000 పెట్టుబడి పెడితే కేవలం 15 ఏళ్లలో రూ.కోటిగా మారింది. ఆటో అనుబంధ కంపెనీల్లో పెట్టుబడితో దీర్ఘకాలిక రాబడి మాత్రమే కాకుండా స్వల్పకాలిక లాభాలు కూడా ఆకట్టుకుంటున్నాయి. గత సంవత్సరం, మార్చి 28, 2023న రూ.129.50 వద్ద ఉంది. ఈ స్థాయి నుంచి డిసెంబర్ 6, 2023న స్టాక్ కేవలం తొమ్మిది నెలల్లో దాదాపు 243 శాతం పెరిగి రికార్డు స్థాయిలో రూ.443.95కి చేరుకుంది. గాబ్రియేల్ ఇండియా షాక్ అబ్జార్బర్స్ తయారు చేస్తారు. ఈ కంపెనీ 1961లో స్థాపించారు. ఈ కంపెనీ మెక్‌ఫెర్సన్ స్ట్రట్స్, బైమెటల్ స్ట్రిప్స్, బైమెటల్ బేరింగ్‌లు, ఫ్రంట్ ఫోర్క్‌లను కూడా తయారు చేస్తుంది. కంపెనీ ఉత్పత్తులను టూ వీలర్ స్కూటర్లు, మోటార్ సైకిళ్లు, కార్లు, తేలికపాటి వాణిజ్య వాహనాలు, ట్రక్కుల తయారీదారులకు విక్రయిస్తారు. ఈ స్టాక్స్‌లో పెట్టుబడితో ఏ స్థాయిలో లాభం వస్తుందో? ఓ సారి తెలుసుకుందాం.
గాబ్రియేల్ ఇండియా ఫిబ్రవరి 2008లో మొదటి డివిడెండ్ డిక్లరేషన్ నుంచి కంపెనీ మొత్తం 32 డివిడెండ్‌లను ప్రకటించింది. 2023లో ఇది రెండుసార్లు డివిడెండ్‌లను ప్రకటించింది. నవంబర్‌లో రూ. 1.5, ఆగస్టులో రూ. 1.65. అలాగే 2022లో ఇది రెండుసార్లు డివిడెండ్‌లను ప్రకటించింది. నవంబర్‌లో రూ. 0.90, జూలైలో రూ. అదేవిధంగా 2021లో, నవంబర్, జూలైలో ఒక్కో షేరుకు వరుసగా రూ.0.55 మరియు రూ.0.70 డివిడెండ్‌లు ప్రకటించారు.
ప్రస్తుతం, గాబ్రియేల్ ఇండియా షేర్లు దాని 50 రోజుల నుంచి 100 రోజుల ఎక్స్‌పోనెన్షియల్ వెయిటెడ్ మూవింగ్ యావరేజెస్ (ఈడబ్ల్యూఎంఏ) కంటే తక్కువగా వర్తకం చేస్తున్నాయి, అయినప్పటికీ ఇది దాని 200 రోజుల ఈడబ్ల్యూఎంఏ కంటే సౌకర్యవంతంగా ఉంది. రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ (ఆర్ఎస్ఐ) రూ.49.76 వద్ద ఉంది. సాధారణంగా ఆర్ఎస్ఐ 70 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఓవర్‌బాట్, 30 కంటే తక్కువ ఉన్నప్పుడు ఓవర్‌సోల్డ్‌గా పరిగణిస్తారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..