XUV 3XO: 60 నిమిషాల్లోనే 50 వేల కార్లు బుకింగ్స్‌.. దుమ్మురేపుతోన్న మహీంద్ర కొత్త కారు

|

May 17, 2024 | 6:48 AM

మహీంద్రా కంపెనీ గత నెల చివరల్లో మహీంద్రా XUV 3XO పేరుతో భారత ఆటోమొబైల్‌ మార్కెట్లోకి కొత్త కారును లాంచ్‌ చేసింది. కాగా తాజాగా ఈ నెల 15వ తేదీ నుంచి ఈ కారు బుకింగ్స్‌ను కంపెనీ ప్రారంభించింది. బుకింగ్స్‌ మొదలైన కేవలం 10 నిమిషాల్లోనే ఈ కారును ఏకంగా 27000 మంది బుక్‌ చేసుకున్నారంటేనే ఈ కారు క్రేజ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు...

XUV 3XO: 60 నిమిషాల్లోనే 50 వేల కార్లు బుకింగ్స్‌.. దుమ్మురేపుతోన్న మహీంద్ర కొత్త కారు
Xuv 3xo
Follow us on

మహీంద్రా వాహనాలకు దేశీ ఆటో మొబైల్ రంగంలో ఎలాంటి క్రేజ్‌ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహీంద్ర కంపెనీ నుంచి కొత్త వెహికిల్‌ వస్తుందంటే చాలు వినియోగదారులు ఆసక్తితో చూస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా మహీంద్ర నుంచి వచ్చిన కొత్త కారు రికార్డులు సృష్టిస్తోంది. ప్రీ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డును నెలకొల్పింది.

మహీంద్రా కంపెనీ గత నెల చివరల్లో మహీంద్రా XUV 3XO పేరుతో భారత ఆటోమొబైల్‌ మార్కెట్లోకి కొత్త కారును లాంచ్‌ చేసింది. కాగా తాజాగా ఈ నెల 15వ తేదీ నుంచి ఈ కారు బుకింగ్స్‌ను కంపెనీ ప్రారంభించింది. బుకింగ్స్‌ మొదలైన కేవలం 10 నిమిషాల్లోనే ఈ కారును ఏకంగా 27000 మంది బుక్‌ చేసుకున్నారంటేనే ఈ కారు క్రేజ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అలాగే కేవలం గంటలో ఏకంగా 50 వేల మార్కును దాటేయడం విశేషం. దీంతో ఈ కారు పట్ల వినియోగదారుల్లో ఉన్న క్రేజ్‌కు అద్ధం పడుతోంది.

ఇదిలా ఉంటే మహీంద్ర ఇప్పటికే 10000 కార్లను ఉత్పత్తి చేసినట్లు సమాచారం. దీంతో ఈ నెల 26వ తేదీ నుంచి డెలివరీలు అందించేందుకు కంపెనీలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మహీంద్రా XUV 3XO కారు విషయానికొస్తే దీనిని మొత్తం 9 వేరియంట్లలో తీసుకొచ్చారు. ఈ కారు ప్రారంభ వేరియంట్‌ ధర ఎక్స్‌ షోరూమ్‌ ప్రైజ్‌ రూ. 7.49 లక్షలుగా ఉంది.

ఇక ఈ కొత్త కారును మూడు ఇంజిన్ ఆప్షన్స్‌లో తీసుకొచ్చారు. ఫ్రంట్ అండ్ రియర్ బంపర్‌లు, లెవల్ 2 ఏడీఏఎస్, పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, 65W టైప్-సి ఛార్జింగ్ పోర్ట్, ఆటో హోల్డ్ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి అధునాతన ఫీచర్లను అందించారు. డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌, పవర్డ్ డ్రైవర్‌ సీట్‌, సన్‌రూఫ్‌, ఇంజన్‌ స్టార్ట్‌/స్టాప్‌ బటన్‌, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లను అందించారు. ఈ కారు లిటర్‌కు 18.2 కిలోమీటర్లు ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

అలాగే ఈ కారులో యాంటీ లాక్‌ బ్రేకింగ్ సిస్టమ్‌, ఫ్రంట్‌ పవర్‌ విండోస్‌, ఆటోమెకిట్ క్లైమెట్ కంట్రోల్‌, అలౌ వీల్స్‌, మల్టీ ఫంక్షన్‌ స్టీరింగ్ వీల్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. 42 లీటర్ల ఫ్యూయల్‌ ట్యాంక్‌ కెసాపిటీ ఈ కారు సొంతం. 364 లీటర్ల బూట్ స్పేస్‌ను అందించారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..