Mahindra Veero LCV: కార్లలో ఉండే ఫీచర్లతో కమర్షియల్ వాహనం.. వావ్ అనేలా మహీంద్రా వీరో..

|

Sep 18, 2024 | 2:54 PM

కారులో ఉండేటటువంటి అత్యాధునిక ఫీచర్లను పరిచయం చేసింది. కొత్త తరహాలో ఒక కమర్షియల్ వాహనాన్ని తీసుకొచ్చింది. దీనికి మహీంద్రా వీరో ఎల్‌సీవీ అని పేరు పెట్టింది. దీని ధర రూ. 7.9లక్షలు(ఎక్స్ షోరూం)అని పేర్కొంది. ఇది మల్టీ ఎనర్జీ మాడ్యూలర్ ప్లాట్ ఫారం ఆధారంగా తయారైంది. ప్రస్తుతం డీజిల్, సీఎన్జీ వెర్షన్లలో అందుబాటులోకి తీసుకొచ్చారు.

Mahindra Veero LCV: కార్లలో ఉండే ఫీచర్లతో కమర్షియల్ వాహనం.. వావ్ అనేలా మహీంద్రా వీరో..
Mahindra Veero Lcv
Follow us on

మహీంద్రా అండ్ మహీంద్రా(ఎం అండ్ ఎం) కంపెనీ వాహనాలకు భారతీయ మార్కెట్లో చాలా మంచి వాల్యూ ఉంది. ప్రీమియం లుక్ ఇవ్వడంతో పాటు అత్యధిక పనితీరును ఈ కార్లు కలిగి ఉంటాయి. కార్ల నుంచి కమర్షియల్ వెహికల్స్ వరకూ అనేక రకాల ఉత్పత్తులు మహీంద్రా నుంచి అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మరో కొత్త వాహనంతో మార్కెట్లోకి అడుగుపెట్టింది. తేలికపాటి వాణిజ్య వాహనం( లైట్ కమర్షియల్ వెహికల్(ఎల్‌సీవీ))ను లాంచ్ చేసింది. దీనిలో కారులో ఉండేటటువంటి అత్యాధునిక ఫీచర్లను పరిచయం చేసింది. కొత్త తరహాలో ఒక కమర్షియల్ వాహనాన్ని తీసుకొచ్చింది. దీనికి మహీంద్రా వీరో ఎల్‌సీవీ అని పేరు పెట్టింది. దీని ధర రూ. 7.9లక్షలు(ఎక్స్ షోరూం)అని పేర్కొంది. ఇది మల్టీ ఎనర్జీ మాడ్యూలర్ ప్లాట్ ఫారం ఆధారంగా తయారైంది. ప్రస్తుతం డీజిల్, సీఎన్జీ వెర్షన్లలో అందుబాటులోకి తీసుకొచ్చారు. త్వరలో ఎలక్ట్రిక్ వేరియంట్ కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

మహీంద్రా వీరో ఎల్‌సీవీ..

మహీంద్రా తీసుకొచ్చిన ఈ కొత్త తేలికపాటి వాణిజ్య వాహనం వీరో 3.5 టన్నుల కేపాసిటీని కలిగి ఉంటుందని ఎం అండ్ ఎం ఆటోమోటివ్ డివిజన్ ప్రెసిడెంట్ విజయ్ నక్రా వెల్లడించారు. ఇది వాణిజ్య వాహనాల్లో సరికొత్త ప్రమాణాలు నెలకొల్పుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దీనిని మహీంద్రా కొత్తగా అభివృద్ధి చేసిన అర్బన్ ప్రాస్పర్ ప్లాట్ ఫామ్(యూపీపీ)పై డిజైన్ చేశామన్నారు. 16,00 కేజీల పేలోడ్ సామర్థ్యం దీని సొంతమన్నారు. ఇది లీటర్ డీజిల్ పై 18.4 కిలోమీటర్ల మైలేజీ వస్తుందని, కేజీ సీఎన్జీపై 19.2 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని విజయ్ వివరించారు. దీనిలో ఫీచర్లు, టెక్నాలజీ.. మారుతున్న కాలం, వినియోగదారులకు అభిరుచికి అనుగుణంగా ఇప్పటి వరకూ ఎల్‌సీవీల్లో ఎవరూ అందించని విధంగా ఈ వీరోని డిజైన్ చేసినట్లు ఆయన చెబుతున్నారు. ఈ విభాగంలో తొలిసారిగా డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్, రివర్స్ పార్కింగ్ కెమెరా, 10 అంగుళాల టచ్ స్క్రీన్, పవర్ విండోస్ ఈ కొత్త ఎల్‌సీవీ వీరో ఉన్నయని వివరించారు.

ఎలక్ట్రిక్ వెర్షన్ వీరో త్వరలో..

మహీంద్రా వీరో ప్రస్తుతం డీజిల్, సీఎన్జీ వేరియంట్లలో లాంచ్ కాగా.. త్వరలోనే ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్ సీఈఓ నళినికాంత్ పేర్కొన్నారు. మన దేశంలోనే మొట్టమొదటి సారిగా మల్టీ ఎనర్జీ మాడ్యూల్(యూపీపీ)ని కమర్షియల్ వాహన ప్లాట్ ఫామ్ ను మహీంద్రా అభివృద్ధి చేసినట్లు చెప్పారు. దీని సాయంతో వాహనం రెండు టన్నులకు పైబడి పేలోడ్స్ సునాయాసంగా తీసుకెళ్లే వీలుంటుందని వివరించారు. దీని కోసం ఏకంగా రూ. 900కోట్ల పెట్టుబడి పెట్టినట్లు ఆయన చెప్పకొచ్చారు.

ధరలు ఇలా..

మహీంద్రా కొత్త తేలికపాటి వాణిజ్య వాహనం వీరో ప్రారంభ ధర రూ. 7.9లక్షలు. కాగా ఇది మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. వీ2, వీ4, వీ6 వీటి పేర్లు. వీటి ధరల్లో కూడా వ్యత్యాసం ఉంది. వీ2 ధర రూ. 7.99లక్షలు, వీ4 ధర రూ. 8.99లక్షలు, వీ6 ధర రూ. 9.56లక్షలు. ఇవన్నీ ఎక్స్ షోరూం ధరలు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..