
ప్రతి నెల కార్ల తయారీదారులు తమ కొన్ని మోడళ్లపై బంపర్ డిస్కౌంట్లు, ఆఫర్స్ ప్రకటిస్తుంటాయి. ఫిబ్రవరి 2023లో మహీంద్రా & మహీంద్రా తమ వినియోగదారుల కోసం అద్దిరిపోయే ఆఫర్స్ ప్రకటించింది. మహీంద్రా బొలెరో, మహీంద్రా XUV300, మహీంద్రా బొలెరో నియో, మహీంద్రా మరాజో వంటి మోడళ్లపై 70 వేల రూపాయల వరకు తగ్గింపును ఇస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మహీంద్రా బొలెరోపై కంపెనీ 70 వేల రూపాయల ప్రయోజనాలను అందిస్తోంది. బొలెరో B6 (O) వేరియంట్‌పై గరిష్టంగా 70 వేల రూపాయలు తగ్గింపు ఇస్తుంది. బి4, బి6 మోడళ్లపై వరుసగా రూ.47 వేలు, రూ.50 వేలు తగ్గింపు లభిస్తోంది. మహీంద్రా బొలెరో ధర రూ. 9.53 లక్షలు(ఎక్స్-షోరూమ్) నుండి రూ. 10.48 లక్షలు(ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
ఈ కారుపై రూ. 59,000 వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ కారు N10, N10 (O) మోడళ్లకు ఆఫర్ వర్తిస్తుంది. అదే సమయంలో.. N4, N8 మోడళ్లపై వరుసగా రూ.32 వేలు, రూ.34 వేల వరకు తగ్గింపు ఇస్తున్నారు.
ఈ కారు ధర రూ. 9.47 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి రూ.11.99 లక్షలు(ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది దీనిపై దాదాపు 60 వేల వరకు తగ్గింపు ఇస్తోంది.
ఈ కారు M2, M4+ మోడళ్లపై రూ. 37,000 వరకు తగ్గింపు ఇస్తోంది. అలాగే M6+ వేరియంట్‌పై రూ. 30,000 వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ కారు ధర రూ. 13.70 లక్షలు(ఎక్స్-షోరూమ్) నుంచి రూ. 16.3 లక్షలు(ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
మహీంద్రా XUV 300 W8 (O) మోడల్‌పై రూ. 35,000 వరకు తగ్గింపు ఇస్తుంది. W6 వేరియంట్‌పై రూ. 30,000, XUV300 టర్బోస్పోర్ట్ మోడల్‌పై రూ. 30,000 వరకు తగ్గింపు ఇస్తున్నారు. XUV300 AMT మోడల్‌పై రూ. 35 వేలు తగ్గింపు ఇస్తున్నారు.
గమనిక: మహీంద్రా వాహనాలపై లభించే తగ్గింపులు ఆయా నగరాల్లో వేరు వేరుగా ఉంటాయి. అలాగే ఈ ఆఫర్ స్టాక్‌పై ఆధారపడి ఉంటుంది. ఆఫర్‌ల పూర్తి వివరాలను తెలుసుకోవడానికి సమీప డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..