
ఆధార్ కార్డు వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వ అలర్ట్ జారీ చేసింది. ఎంఆధార్ యాప్ సేవలను నిలిపివేసినట్లు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) స్పష్టం చేసింది. పునఃరూపకల్పన చేసిన కొత్త ఆధార్ యాప్‌ను ఇక నుంచి ఉపయోగించాలని తెలిపింది. ప్రజలు ఆధార్ సేవలను మొబైల్ ద్వారా పొందేందుకు గతంలో ఎంఆధార్ యాప్‌ను యూఐడీఏఐ తీసుకొచ్చింది. ప్రజలు తమ ఆధార్ వివరాలను చూసుకునేందుకు, ఈ-ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి, ప్రాథమిక సమాచారాన్ని డిజిటల్‌గా పంచుకోవడానికి ఈ యాప్ ఉపయోగపడేది. ఎంఆధార్ యాప్ సేవలను పూర్తిగా నిలిపివేసిన యూఐడీఏఐ.. దాని స్థానంలో కొత్త ఆధార్ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఇక నుంచి కొత్త యాప్ వాడాలంటూ ప్రజలను కోరింది.
కొత్త ఆధార్ యాప్ ప్రజల గోప్యత, వ్యక్తిగత డేటా భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. ఇది ఫేస్ అథెంటికేషన్ ద్వారా గుర్తింపును ధృవీకరించుకోవడానికి, క్యూఆర్ కోడ్‌ల ద్వారా ఆధార్ వివరాలను పంచుకునేందుకు సహాయపడుతుంది. మీ ఆధార్ కార్డుకు సంబంధించి అవసరమైన సమాచారాన్ని మాత్రమే ఇతరులతో పంచుకోవచ్చు. పేరు, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ లాంటి వివరాల్లో ఏది అవసరమైతే అది మాత్రమే సెలక్ట్ చేసుకుని ఇతరులతో పంచుకోవచ్చు. దీంతో వ్యక్తిగత వివరాలను భద్రత కల్పిస్తోంది. ఇక ఈ యాప్‌లో బయోమెట్రిక్ లాక్, అన్‌లాక్ ఒకే ఒక్క క్లిక్‌తో చేసుకోవచ్చు. ఆధార్ డేటా దుర్వినియోగం కాకుండా దీని ద్వారా రక్షించుకోవచ్చు. ఇక ఈ కొత్త యాప్‌లో మీ కుటుంబసభ్యుల ఆధార్ కార్డులను కూడా ఒకేచోట నిర్వహించుకోవచ్చు. అనేక ప్రాంతీయ భాషల్లో యాప్‌ను ఉపయోగించుకోవచ్చు.
– గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్‌లోకి వెళ్లండి
– కొత్త ఆధార్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
– ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అవ్వండి
-ఆ తర్వాత బయోమెట్రిక్ ఉపయోగించి యాప్‌లోకి లాగిన్ అవ్వండి
-యాప్‌లోకి లాగిన్ అయ్యేందుకు 4 అంకెల పిన్‌ను సెట్ చేయండి
-సెటప్ పూర్తయిన తర్వాత వినియోగదారులు యాప్ ద్వారా అన్ని ఆధార్ సేవలను యాక్సె్స్ చేయవచ్చు
కొత్త ఆధార్ యాప్‌ను ఎక్కుమంది డౌన్ లోడ్ చేసుకుని ఉపయోగించేలా చేసేందుకు యూఐడీఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ యాప్ ద్వారా ఆధార్‌తో లింక్ అయిన ఈమెయిల్ ఐడీని ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. సాధారణంగా ఇందుకోసం రూ.75 రుసుం వసూలు చేసేవారు. కానీ జులై 1 నుంచి యాప్ ద్వారా ఉచితంగా మెయిల్ ఐడీ మార్చుకోవచ్చు.