Fuel Efficient Cars: కారు కొనాలనుకుంటున్నారా.? మైలేజ్‌ కూడా కావాలా.? అయితే మీకు ఇవే బెస్ట్‌ ఆప్షన్‌..

|

Mar 02, 2021 | 4:54 PM

Low Cost Fuel Efficient Petrol Cars: ఎంత పెద్ద కారైనా.. ఎన్ని అధునాతన ఫీచర్లు ఉన్నా.. సామాన్యంగా ఎక్కువ మంది వినియోగదారులు కోరుకునేది మైలేజ్‌. లీటర్‌ పెట్రోల్‌కు ఎన్ని కిలోమీటర్ల మైలేజ్‌ ఇస్తుందన్నదానిపైనే ఎక్కువగా...

Fuel Efficient Cars: కారు కొనాలనుకుంటున్నారా.? మైలేజ్‌ కూడా కావాలా.? అయితే మీకు ఇవే బెస్ట్‌ ఆప్షన్‌..
Follow us on

Low Cost Fuel Efficient Petrol Cars: ఎంత పెద్ద కారైనా.. ఎన్ని అధునాతన ఫీచర్లు ఉన్నా.. సామాన్యంగా ఎక్కువ మంది వినియోగదారులు కోరుకునేది మైలేజ్‌. లీటర్‌ పెట్రోల్‌కు ఎన్ని కిలోమీటర్ల మైలేజ్‌ ఇస్తుందన్నదానిపైనే ఎక్కువగా ఆసక్తిచూపిస్తుంటారు. మరీ ముఖ్యంగా పెట్రోల్‌ ధరలు విపరీతంగా పెరిగిపోతున్న నేటి రోజుల్లో మైలేజ్‌ ఎక్కువగా ఇచ్చే కార్లవైపే మొగ్గు చూపిస్తుంటారు. ఇది ఎవరు కాదనలేని సత్యం.. మరి మంచి ఫీచర్లతో పాటు మైలేజ్‌ కూడా ఇచ్చే కారు కొనుగోలు చేస్తే అటు మైలేజ్‌ కూడా కలిసొస్తుంది. కదూ.. మరి రూ.10 లక్షల లోపు ధరలో అందుబాటులో ఉండి, మంచి మైలేజ్‌ ఇచ్చే కార్లపై ఓ లుక్కేయండి..

మారుతి సుజుకీ డిజైర్‌..

భారతీయులు ఎక్కువగా విశ్వసించే కార్ల కంపెనీల్లో మారుతి సుజుకీ ఒకటి. ఈ కంపెనీ కారు ఎక్కువ రోజులు లైఫ్‌ ఇస్తుందని చాలా మంది భావిస్తుంటారు. లాక్‌డౌన్‌కు ముందు భారత ఆటో రంగంలో ఈ కారు ఎక్కువగా అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది. ఈ కారు లీటర్‌ పెట్రోల్‌కు అత్యధికంగా 24.12 కి.మీల మైలేజ్‌ ఇస్తుంది. ఇక ఈ కారు ధర విషయానికొస్తే ఆటోమెటిక్‌ వెర్షన్‌ ఎక్స్‌ షోరూమ్‌ ప్రైజ్‌.. రూ.7.41 లక్షల – రూ. 8.90 లక్షల వరకు అందుబాటులో ఉంది.

మారుతి సుజుకీ స్విఫ్ట్‌..

అత్యధికంగా మైలేజ్‌ ఇచ్చే కార్లలో మారుతీ కంపెనీకి చెందిన మరో కారు స్విఫ్ట్‌ తర్వాతి వరుసలో నిలవడం విశేషం. గతేడాది కరోనా, లాక్‌డౌన్‌లాంటి పరిణామ నేపథ్యంలోనూ ఈ కారు అత్యధికంగా అమ్ముడుపోయి సరికొత్త రికార్డుకు నాంది పలికింది. స్విఫ్ట్‌లోనూ డిజైర్‌ కారులోని ఇంజన్‌ ఉండగా మైలేజ్‌ విషయంలో మాత్రం ఈ కారు లీటర్‌ పెట్రోల్‌కు 23.76 కి.మీలు ఇస్తుంది. ఇక లుక్‌ విషయంలోనూ చూడముచ్చటగా కనిపించే స్విఫ్ట్‌ ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.6.86 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

డాట్సన్‌ రెడి-గో..

భారతదేశానికి చెందిన మోస్ట్‌ ఫ్యూయల్‌ ఎఫిషియెంట్‌ కార్లలో డాట్సన్‌ రెడి-గో ఒకటి. 1.0 లీటర్‌ ఇంజన్‌తో తయారు చేసిన డాట్సన్‌ రెడి-గో కారు లీటర్‌ పెట్రోల్‌కు 22 కి.మీల మైలేజ్‌ ఇస్తుంది. ఇక కారు ధర విషయానికొస్తే.. సుమారు రూ.4.92 లక్షల్లో (ఎక్స్‌ షో రూమ్‌) అందుబాటులో ఉంది.

రెనాల్ట్‌ క్విడ్‌..

చిన్న కార్ల మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంది రెనాల్ట్‌ క్విడ్‌ కారు. ఈ కంపెనీకి చెందిన బీఎస్‌4 మోడల్‌ కార్లు బాగా మైలేజ్ ఇచ్చేవి.. కానీ బీఎస్‌6 వచ్చే సరికి ఆ మైలేజ్‌ కాస్త తగ్గింది. ప్రస్తుతం రెనాల్ట్‌ క్విడ్‌ కారు 800CC లో అందుబాటులో ఉంది. ఈ కారు లీటర్‌కు 22 కి.మీల మైలేజ్‌ ఇస్తుంది. ఇక ధర విషయానికొస్తే రూ.4.72 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది.

మారుతీ సుజుకీ వ్యాగనార్‌..

రూ.10 లక్షల లోపు అందుబాటులో ఉండి మంచి మైలేజ్‌ ఇచ్చే కార్లలో మారుతీ సుజుకీ కంపెనీకి చెందిన వ్యాగనార్‌ ఒకటి. 1.0 లీటర్‌ ఇంజన్‌తో రూపొందించిన ఈ కారు లీటర్‌కు 21.79 కి.మీల మైలేజ్‌ ఇస్తుంది. ఇక ఈ కారు ధర విషయానికొస్తే రూ.5.48 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది.

మారుతీ సుజుకీ ఎస్‌-ప్రెస్సో..

ఇటీవల మార్కెట్లోకి వచ్చిన ఈ చిన్న కారు సంచలనం సృష్టించింది. 1.0 లీటర్‌ ఇంజన్‌తో రూపొందిన ఈ కారు లీటర్‌కు సుమారు 21.7 కి.మీల మైలేజ్‌ వస్తుంది. ఇక ఈ కారు ధర విషయానికొస్తే రూ.4.82 లక్షల (ఎక్స్‌ షోరూమ్‌) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది.

మారుతీ సుజుకీ సెలేరియో..

ఫ్యూయల్‌ ఎఫిషెన్సీ కార్లలో మారుతీ సుజుకీ కంపెనీకి చెందిన సెలేరియా ఒకటి. ఈ కారులోని ఇంజిన్‌ ఎస్‌-ప్రెస్సో, వేగనార్‌లను పోలి ఉంటుంది. ఇక ఈ కారు లీటర్‌కు 21.63 కి.మీల మైలేజ్ ఇస్తుంది. అయితే ఎస్‌-ప్రెస్సో, వేగనార్‌లతో పోలిస్తే.. సెలెరియా ధర కాస్త ఎక్కువేనని చెప్పాలి. దీని ధర రూ.5.42 లక్షల (ఎక్స్‌ షోరూమ్‌)తో ప్రారంభం కానుంది.

Also Read: IPhone13 Features: ఐఫోన్ 13లో ఉండనున్న ఫీచర్లు ఇవేనా..? స్టోరేజ్ గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Electric Bike: పెట్రోల్‌కు బదులుగా.. బ్యాటరీ ఇంజన్.. మారిస్తే ఎంతవుతుందంటే..? వివరాలు..