LIC Policy: మీకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC)లో పాలసీ ఉందా..? అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాల్సిందే. నిబంధనలు బ్యాంకుల్లో మారినట్లుగానే ఇతర సంస్థలతో పాటు ఎల్‌ఐసీలో కూడా మారుతున్నాయి. పాలసీ వినియోగదారులు తమ పాన్ నెంబర్లను పాలసీకి లింక్ చేయాలని కోరుతోంది. ఆన్‌లైన్‌లోనే ఎల్ఐసీ పాలసీకి పాన్ నెంబర్ లింక్ చేయవచ్చు. ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్‌లో పాలసీకి పాన్ నెంబర్ లింక్ చేయాలి. మీ పాన్ నెంబర్ ఎల్ఐసీ పాలసీకి లింక్ చేయడానికి ముందు పాలసీ నెంబర్, పాన్ నెంబర్ లాంటి వివరాలన్నీ సిద్ధం చేసుకోవాలి. మీ ఎల్ఐసీ పాలసీకి లింక్ ఉన్న రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ మీ దగ్గర ఉండాలి. ఈ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
ఎల్ఐసీ పాలసీకి పాన్ నెంబర్ లింక్ చేస్తే పాలసీ క్లెయిమ్ చేసే సమస్యలు రాకుండా ఉంటాయి. లేకపోతే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ చేయాలని ఆదాయపు పన్ను శాఖ సెప్టెంబర్ 30 వరకు డెడ్‌లైన్ విధించిన విషయం తెలిసిందే. పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ చేయకపోతే చాలా సమస్యలు తలెత్తుతాయి.
► ఎల్ఐసీ పాలసీ హోల్డర్లు ముందుగా వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
► Online Services సెక్షన్‌లో Online PAN Registration పైన క్లిక్ చేయాలి.కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
► ఆ తర్వాత Proceed పైన క్లిక్ చేయాలి.
► ఆ తర్వాత పుట్టిన తేదీ నమోదు చేయాలి.
► జెండర్ సెలెక్ట్ చేయాలి.
► ఇమెయిల్ ఐడీ ఎంటర్ చేయాలి.
► మీ పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి.
► పాన్ కార్డుపై ఉన్నట్టుగా పూర్తి పేరును ఎంటర్ చేయాలి.
► మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.
► మీ పాలసీ నెంబర్ ఎంటర్ చేయాలి.
► ఆ తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి Get OTP పైన క్లిక్ చేయాలి.
► మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
► వివరాలన్నీ సరిచూసుకొని ఓటీపీ ఎంటర్ చేయాలి.
►మీ ఎల్ఐసీ పాలసీకి పాన్ నెంబర్ లింక్ అయిన తర్వాత కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.
Link your PAN to your LIC policies now!
Log on to https://t.co/fA1vgvFfeK pic.twitter.com/4DUp0xSRdc— LIC India Forever (@LICIndiaForever) September 7, 2021