LIC Jeevan Anand: నెలకు రూ.1358 పెట్టుబడి పెట్టండి.. రూ. 25 లక్షలు పొందండి

|

Dec 20, 2022 | 8:52 AM

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) భారతదేశంలో అతిపెద్ద బీమా ప్రొవైడర్. ఎల్‌ఐసీ పాలసీలలో పెట్టుబడి పెట్టడం వల్ల మీ పెట్టుబడికి రిటర్న్ లభిస్తుంది. జీవిత బీమా కూడా లభిస్తుంది..

LIC Jeevan Anand: నెలకు రూ.1358 పెట్టుబడి పెట్టండి.. రూ. 25 లక్షలు పొందండి
LIC Policy
Follow us on

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) భారతదేశంలో అతిపెద్ద బీమా ప్రొవైడర్. ఎల్‌ఐసీ పాలసీలలో పెట్టుబడి పెట్టడం వల్ల మీ పెట్టుబడికి రిటర్న్ లభిస్తుంది. జీవిత బీమా కూడా లభిస్తుంది. ఎల్‌ఐసీ కొత్త పాలసీలను విడుదల చేస్తూనే ఉంది. అత్యంత ప్రజాదరణ పొందిన పాలసీలలో ఒకటైన ఎల్‌ఐసీ జీవన్ ఆనంద్. ఈ పాలసీ వల్ల మంచి ప్రయోజనం ఉంది. ఈ పాలసీని ఉపయోగించి లక్షల రూపాయలు ఆదా చేసుకోవచ్చు. ఎల్‌ఐసీ జీవన్ ఆనంద్ తమ డబ్బును చాలా సంవత్సరాలు పెట్టుబడి పెట్టాలనుకునే వ్యక్తుల కోసం ఉపయోగకరంగా ఉంటుంది. ఇది దీర్ఘకాలిక పొదుపు పథకం. తమ రిటైర్‌మెంట్ ఫండ్‌ను రూపొందించాలనుకునే వారు తప్పనిసరిగా ఈ పాలసీని ఎంచుకోవాలి. వెంటనే డబ్బు వద్దనుకునే వారు ప్రయోజనం పొందుతారు. ఎక్కువ కాలం లాక్ ఇన్ పీరియడ్, పాలసీ ప్రయోజనాలు ఎక్కువ.

జీవన్‌ జీవన్ ఆనంద్ పాలసీ పెట్టుబడిదారులకు పెట్టుబడి బోనస్ లభిస్తుంది. ఒకవేళ పాలసీదారు మరణిస్తే అతని నామినీకి 125 శాతం మరణ ప్రయోజనం లభిస్తుంది. జీవన్ ఆనంద్‌లో కనీస హామీ మొత్తం రూ. లక్ష. గరిష్ట మొత్తానికి పరిమితి లేదు. రూ.25 లక్షల హామీ మొత్తాన్ని పొందడానికి ఎంత పెట్టుబడి పెట్టాలో ఇక్కడ ఉంది.

మీరు ప్రతిరోజూ రూ.45 పెట్టుబడి పెట్టాలి. అంటే నెలకు రూ.1358 అవుతుంది. మొత్తానికి అవసరమైన కాల పరిమితి 35 సంవత్సరాలు ఉండాలి. అంటే పాలసీని ఇన్ని సంవత్సరాల పాటు కొనసాగించాలి. మెచ్యూరిటీ తర్వాత అంటే 35 ఏళ్లు, పెట్టుబడిదారుడు రూ.25 లక్షలు పొందుతారు.

ఇవి కూడా చదవండి

మీకు వచ్చే రూ.25 లక్షల్లో బీమా మొత్తం రూ.5 లక్షలు, బోనస్ రూ.8.5 లక్షలు, ఎఫ్ఏబీ రూ.11.5 లక్షలు కలిసి ఉంటాయి. పాలసీ మెచ్యూరిటీ గడువు ముగిసిన తర్వాత కూడా మీకు లైఫ్ కవరేజ్ వర్తిస్తుంది. రూ.5 లక్షల వరకు బీమా కొనసాగుతూనే వస్తుంది. 18 నుంచి 50 ఏళ్లలోపు వయసు కలిగిన వారు ఈ పాలసీ తీసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి