లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(LIC) IPOపై పలు అప్‌డేట్స్ వస్తున్నాయి. IPO తీసుకురావడానికి ముందు.. ప్రభుత్వం 50-60 మంది యాంకర్ పెట్టుబడిదారుల(Anchor Investers)ను షార్ట్‌లిస్ట్ చేసింది. వీటిలో బ్లాక్‌రాక్, సాండ్స్ క్యాపిటల్స్, ఫిడెల్టీ ఇన్వెస్ట్‌మెంట్స్, స్టాండర్డ్ లైఫ్, జెపి మోర్గాన్ వంటి వెటరన్ ఇన్వెస్టర్లు ఉన్నారు. యాంకర్ ఇన్వెస్టర్లు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వాల్యుయేషన్‌లో రూ. 7 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు. ఈ ఐపీఓకు సంబంధించి ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి వాల్యుయేషన్‌కు సంబంధించిన సమాచారాన్ని తీసుకుంది.
ఈ కమిటీలో ప్రభుత్వ ఉన్నతాధికారులు ఉన్నారు. ఈ వాల్యుయేషన్‌కు సంబంధించి మర్చంట్ బ్యాంకర్‌తో చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వం 50-60 మంది యాంకర్ పెట్టుబడిదారులను షార్ట్‌లిస్ట్ చేసినప్పటికీ, వారిలో 25 శాతం మందిని తీసుకోవచ్చని సంబంధిత అధికారి తెలిపారు. ఇందుకు సంబంధించి బిజినెస్ స్టాండర్డ్ తరపున బ్లాక్‌స్టోన్, సాండ్స్ క్యాపిటల్, ఫిడిలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్, స్టాండర్డ్ లైఫ్, JP మోర్గాన్‌లకు ఇమెయిల్‌లు పంపారు. DIPAM ప్రకారం, LIC IPO కోసం, RHPని సమర్పించడానికి ప్రభుత్వానికి 10 రోజులు అవసరం. పెట్టుబడిదారుల భాగస్వామ్యాన్ని పెంచడానికి.. ప్రభుత్వం 316 మిలియన్లు కంటే ఎక్కువ షేర్లను జారీ చేయొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ఎల్‌ఐసీలో 7.5 శాతం వరకు వాటాను విక్రయించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
LIC IPO కోసం ప్రభుత్వం RHPని అతి త్వరలో సమర్పించవచ్చు. మే 12 వరకు ప్రభుత్వానికి సమయం ఉంది. ఈ గడువు దాటితే మళ్లీ డీఆర్‌హెచ్‌పీని సెబీకి సమర్పించాల్సి ఉంటుంది. డిసెంబర్ త్రైమాసికంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పనితీరును పరిశీలిస్తే, కంపెనీ నికర లాభం 2349 కోట్లకు పెరిగింది. డిసెంబర్ 2020లో కంపెనీ నికర లాభం 90 లక్షలుగా ఉంది. ఏప్రిల్ చివరి వారంలో ఎల్ఐసీ ఐపీఓ వచ్చే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నాయి.