LIC IPO : అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా సంస్థ LIC IPO ప్రారంభమయ్యే తేదీలు ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రైస్ బ్యాండ్ కూడా బయటకు వచ్చింది. దీంతో పాటు LIC IPO గ్రే మార్కెట్‌లో ప్రీమియంతో ట్రేడవుతోంది. IPO తెరవడానికి ముందే, LIC స్టాక్ రూ. 45 నుంచి రూ. 55 వరకు ప్రీమియం రేటుతో ట్రేడవుతోంది. ఇది ఇష్యూ ధర కంటే 5 నుంచి 7 శాతం ఎక్కువ. LIC ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ. 902 నుంచి 949 వరకు నిర్ణయించారని తెలిసిందే. మే 4 నుంచి మే 9 వరకు పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టడానికి LIC IPO అందుబాటులో ఉంటుంది. యాంకర్ ఇన్వెస్టర్లు మే 2న ప్రీ-ఐపీవో ప్లేస్‌మెంట్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. ఐపీవో ద్వారా రూ.20,557 కోట్లు సమీకరించే యోచనలో ప్రభుత్వం ఉంది. అయితే ఇంతకుముందు ప్రభుత్వం ఐపీఓ ద్వారా రూ.60,000 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ IPO పరిమాణం తగ్గించడంతో ఈ లక్ష్యం కూడా తగ్గింది. IPO ధర బ్యాండ్ రూ. 902 నుంచి 949 వరకు నిర్ణయించారు. ఎల్‌ఐసీ ఐపీఓ పరిమాణం తగ్గిన తర్వాత కూడా ఇదే అతిపెద్ద ఐపీఓ అని డీపీఏఎం సెక్రటరీ తుహిన్ కాంత్ పాండే తెలిపారు.
ధరలో తగ్గింపుతో LIC తన IPOలో పెట్టుబడి పెట్టే పాలసీదారులకు తగ్గింపును అందిస్తోంది. పాలసీదారులకు ఒక్కో షేరుపై రూ.60 తగ్గింపు అందిస్తోంది. ఆపై రిటైల్ ఇన్వెస్టర్లు, కంపెనీ ఉద్యోగులకు ఒక్కో షేరుపై రూ.40 తగ్గింపు లభిస్తుంది.
దీర్ఘకాలంలో లాభదాయకం..
DIPAM సెక్రటరీ తుహిన్ కాంత్ పాండే మాట్లాడుతూ.. దీర్ఘకాలికంగా, LIC IPO పెట్టుబడిదారులకు మెరుగైన పెట్టుబడిగా నిరూపిస్తుంది. LIC IPO వాల్యుయేషన్ ప్రస్తుత పరిస్థితి, లిస్టింగ్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మార్కెట్‌లోకి వస్తుందని LIC చైర్మన్ MR కుమార్ తెలిపారు. మరిన్ని వాటాల విక్రయంపై ఇంకా చర్చలు జరగలేదు.
మే 17న స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో..
ప్రీ-ఐపీవో ప్లేస్‌మెంట్ ద్వారా రూ. 5630 కోట్లు సమీకరించడం లక్ష్యంగా ఎల్‌ఐసీ ఐపీవో రానుంది. IPOలో 221.37 మిలియన్ షేర్లు విక్రయించనున్నారు. వీటిలో 59.29 మిలియన్ షేర్లు యాంకర్ ఇన్వెస్టర్ల కోసం రిజర్వ్‌లో ఉంచారు. ఉద్యోగుల కోసం 1.58 మిలియన్ షేర్లు, పాలసీ హోల్డర్ల కోసం 22.14 మిలియన్లు, సంస్థాగత పెట్టుబడిదారుల కోసం 98.83 మిలియన్ల షేర్లు రిజర్వ్ చేశారు. మే 12వ తేదీన షేర్లను కేటాయించి, మే 16వ తేదీ నాటికి ఇన్వెస్టర్ల డీమ్యాట్ ఖాతాలో షేర్లు జమ చేయనున్నారు. ఎల్‌ఐసీ ఐపీఓ మే 17న స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ అవుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Infosys News: ఇన్ఫోసిస్ కు తిప్పలు తెచ్చిన కొత్త నిబంధనలు.. మరోపక్క వేలల్లో ఉద్యోగుల రాజీనామాలు..