LIC Housing Finance: ఎల్‌ఐసీ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. తక్కువ వడ్డీకే రూ.2 కోట్ల వరకు రుణాలు..!

|

Sep 24, 2021 | 4:27 PM

LIC Housing Finance: రాబోయే పండగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులతో పాటు ఎల్‌ఐసీ హౌజింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ కూడా తన కస్టమర్లకు..

LIC Housing Finance: ఎల్‌ఐసీ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. తక్కువ వడ్డీకే రూ.2 కోట్ల వరకు రుణాలు..!
Follow us on

LIC Housing Finance: రాబోయే పండగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులతో పాటు ఎల్‌ఐసీ హౌజింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ కూడా తన కస్టమర్లకు ఆఫర్లను ప్రకటిస్తోంది. రూ. 2 కోట్ల వరకు తీసుకునే గృహ రుణాలను కేవలం 6.66 శాతం వడ్డీకే అందిస్తామని వెల్లడించింది. అయితే ఈ ఆఫర్​ సిబిల్​ స్కోర్ 700 అంతకంటే ఎక్కువ ఉన్న రుణదాతలకు మాత్రమే వర్తిస్తుందని, కస్టమర్ల వృత్తితో సంబంధం లేకుండా రుణాలు మంజూరు చేయనున్నట్లు తెలిపింది. సెప్టెంబర్​22 నుంచి నవంబర్​ 30 మధ్య మంజూరు చేసిన గృహ రుణాలకు మాత్రమే ఆఫర్​ వర్తిస్తుందని స్పష్టం చేసింది. జులైలోనే ఈ ఆఫర్‌ను ప్రకటించినప్పటికీ అప్పుడు కేవలం రూ. 50 లక్షల రుణాలకు మాత్రమే ఆఫర్‌ను పరిమితం చేయగా, ఇప్పుడు ఈ రుణ పరిమితిని రూ. 2 కోట్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా పెద్ద మొత్తంలో రుణాలు తీసుకునే వారికి లబ్ది చేకూరనుంది.

సిబిల్​స్కోర్ 700, అంతకంటే ఎక్కువ ఉన్న కస్టమర్లకు వారి ఉపాధితో సంబంధం లేకుండా తక్కువ వడ్డీకే గృహ రుణాలు మంజూరు చేయాలని నిర్ణయించినట్లు ఎల్‌ఐసీ సంస్థ తెలిపింది. అర్హులైన వినియోగదారులకు కేవలం 6.66 శాతానికే గృహరుణాలు మంజూరు చేస్తామని, ఇది మార్కెట్​లోనే అతి తక్కువ వడ్డీ రేటు అని తెలిపింది. వినియోగదారులు దీనిని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నట్లు పేర్కొంది. తక్కువ వడ్డీ రేట్లకే గృహ రుణాలు మంజూరు చేస్తూ కస్టమర్ల సొంతింటి కల నెరవేర్చాలన్నదే మా లక్ష్యమని ఎల్‌ఐసీ తెలిపింది.

ప్రాసెసింగ్​ఫీజులో డిస్కౌంట్:​

మరోవైపు, ప్రాసెసింగ్​ఫీజును కూడా ఈ సంస్థ తగ్గించింది. రూ.2 కోట్ల గృహ రుణాలపై గరిష్టంగా రూ.10 వేలు లేదా రుణ మొత్తంలో 0.25 ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే వసూలు చేస్తామని వెల్లడించింది. ఎల్‌ఐసీ హౌజింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ డిజిటల్ విధానంలో గృహ రుణాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి, ఆన్‌లైన్‌లోనే అప్రూవల్​పొందడానికి ఇటీవలే HomY యాప్‌ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్​ద్వారా గృహ రుణానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

కాగా, పండుగ సీజన్​ సమీపిస్తుండటంతో బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు గృహరుణ వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. తాజాగా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్​ కేవలం 6.70 శాతం గృహ రుణాలను అందిస్తామని ప్రకటించింది. ఈ ఆఫర్ 2021 సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 31 వరకు అమల్లో ఉంటుంది. ప్రముఖ ప్రభుత్వ రంగ రుణదాత ఎస్​బీఐ కూడా కేవలం 6.70 శాతం వద్ద గృహరుణాలను అందిస్తామని తెలిపింది. అలాగే కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ ఇటీవల తన హోమ్ లోన్ వడ్డీ రేట్లను 15 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో హోమ్​లోన్​వడ్డీరేటు 6.65 శాతం నుండి 6.50 శాతంకు చేరింది. ఇక, బ్యాంక్ ఆఫ్ బరోడా హోమ్ లోన్ రేట్లు 6.75 శాతం నుంచి ప్రారంభమవుతాయి. ఇలా వినియోగదారులను మరింతగా ఆకట్టుకునేందుకు లోన్స్‌పై వడ్డీ శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంటున్నాయి.

ఇవీ కూడా చదవండి:

WhatsApp Cashback: వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు.. ఒక్కసారి పేమెంట్‌ చేస్తే..!

Festive Season: పండగ సీజన్‌లో సామాన్యులకు షాక్‌.. వీటి ధరలు భారీగా పెరగనున్నాయ్‌..!