LIC: రూ. 121 పొదుపు చేస్తే చాలు.. రూ. 27 లక్షలు పొందొచ్చు. ఎల్‌ఐసీ నుంచి మంచి స్కీమ్‌..

ఆడబిడ్డ వివాహాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఇందులో అమ్మాయి పేరు మీద పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ పథకంలో భాగంగా ప్రతీ రోజూ రూ. 121 పెట్టుబడి పెడితే ఏకంగా రూ. 27 లక్షలు సొంతం చేసుకోవచ్చు. రోజుకు రూ. 121 చొప్పున నెలకు రూ. 3600 25 ఏళ్లు పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ సమయానికి రూ. 27 లక్షల మొత్తాన్ని పొందుతారు...

LIC: రూ. 121 పొదుపు చేస్తే చాలు.. రూ. 27 లక్షలు పొందొచ్చు. ఎల్‌ఐసీ నుంచి మంచి స్కీమ్‌..
LIC

Updated on: Mar 27, 2024 | 7:14 PM

సంపాదించిన దాంట్లో ఎంతో కొంత పొదుపు చేసుకోవాలని ప్రతీ ఒక్కరూ ఆశిస్తుంటారు. ఆ దిశగానే అడుగులు వేస్తుంటారు. ఇలా ఆదా చేసుకోవడం కోసం ఎన్నో రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఆడబిడ్డల భవిష్యత్తు కోసం పొదుపు చేసే వారు చాలా మంది ఉంటారు. అలాంటి వారి కోసమే దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ ఎల్‌ఐసీ ఓ మంచి పథకాన్ని తీసుకొచ్చింది. ఎల్‌ఐసీ కన్యాదాన్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఆడబిడ్డ వివాహాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఇందులో అమ్మాయి పేరు మీద పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ పథకంలో భాగంగా ప్రతీ రోజూ రూ. 121 పెట్టుబడి పెడితే ఏకంగా రూ. 27 లక్షలు సొంతం చేసుకోవచ్చు. రోజుకు రూ. 121 చొప్పున నెలకు రూ. 3600 25 ఏళ్లు పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ సమయానికి రూ. 27 లక్షల మొత్తాన్ని పొందుతారు. అయితే ఈ పాలసీని 13 నుంచి 25 ఏళ్ల మెచ్యూరిటీ కాలాని తీసుకోవచ్చు. ఒక వేళ మీరు పథకంలో రోజుకు రూ. 74 చొప్పున నెలకు రూ. 2250 చొప్పున పెట్టుబడి పెడుతూ పోతే మెచ్యూరిటీ సమయానికి రూ. 14 లక్షలు పొందొచ్చు.

ఈ పథకంలో చేరాలంటే చిన్నారి వయసు కనీసం ఏడాది ఉండాలి. అలాగే తండ్రి వయసు కనీసం 30 ఏళ్లు నిండాలి. ఇక ఈ పథకం ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్‌ 80సీ పరిధలోకి వస్తుంది కాబట్టి ప్రీమియం డిపాజిటరల్ఉ రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. అంతేకాకుండా ఒకవేళ పాలసీదారుడు మెచ్యూరిటీ సమయంలో అకాల మరణం పొందితే కుటుంబానికి రూ. 10 లక్షల ప్రీమియం లభిస్తుంది. ఈ పథకంలో చేరాలంటే ఆధార్‌ కార్డుతో పాటు ఇన్‌కమ్‌ సర్టిఫికేట్‌, పాస్‌ పోర్ట్ సైజ్‌ ఫొటో, ఆడబిడ్డ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..