5G Mobile: మొదటి దేశీయ 5జీ మొబైల్ వచ్చేసింది.. ధర ఎంతంటే.. ఎలా బుక్ చేసుకోవాలంటే..

|

Nov 09, 2021 | 9:16 PM

మన మార్కెట్‎లో 5జీ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయని మనకు తెలుసు.. కానీ వాటిలో దేశీయ కంపెనీ తయారు చేసిన 5జీ ఫోన్ ఒక్కటి కూడా లేదు. అయితే ఇప్పుడు ఆ లోటును ఓ కంపెనీ భర్తీ చేసింది...

5G Mobile: మొదటి దేశీయ 5జీ మొబైల్ వచ్చేసింది.. ధర ఎంతంటే.. ఎలా బుక్ చేసుకోవాలంటే..
Lava
Follow us on

మన మార్కెట్‎లో 5జీ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయని మనకు తెలుసు.. కానీ వాటిలో దేశీయ కంపెనీ తయారు చేసిన 5జీ ఫోన్ ఒక్కటి కూడా లేదు. అయితే ఇప్పుడు ఆ లోటును ఓ కంపెనీ భర్తీ చేసింది. భారత మార్కెట్‎లోకి 5జీ స్మార్ట్​ఫోన్​ తీసుకొచ్చిన తొలి స్వదేశీ సంస్థగా లావా ఇంటర్నేషనల్ అరుదైన ఘనత సాధించింది. అగ్ని 5జీ పేరుతో కొత్త ఫోన్‎ను మార్కెట్‎లోకి తీసుకొచ్చింది.

ప్రపంచంలో ‘మీడియాటెక్‌ డైమెన్సిటీ 810 చిప్‌సెట్‌’పై 5జీ స్మార్ట్‌ఫోన్‌ తీసుకొచ్చిన రెండో కంపెనీ లావాయేనని సంస్థ అధ్యక్షుడు, బిజినెస్‌ హెడ్‌ సునీల్‌ రైనా చెప్పారు. ఉత్తర్‎​ప్రదేశ్ నొయిడాలోని సంస్థ ప్లాంట్‎​లో దీన్ని తయారు చేశారు. భారత వినియోగదారులకు స్వదేశంలో రూపొందించిన 5జీ మొబైల్‎​ను అందుబాటులోకి తీసుకురావాలనే అగ్నిని లాంచ్ చేసినట్లు తెలిపారు.

నవంబరు 18 నుంచి రిటైల్‌ ఔట్‌లెట్లతో పాటు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లో లావా అగ్ని ఫోన్‌ అందుబాటులో ఉండనుంది. ఆలోపు లావా ఈ-స్టోర్‌లో ముందస్తు బుకింగ్‌ చేసుకోవచ్చు. అమెజాన్‌లోనైతే రూ.500 చెల్లించి ప్రీ బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. నవంబరు 9-17 మధ్య ప్రీ బుకింగ్స్‌ అందుబాటులో ఉన్నాయి.

అగ్ని ధర రూ.19,999గా నిర్ణయించినట్లు లావా పేర్కొంది. ప్రస్తుతం భారత మార్కెట్‎​ను శాసిస్తున్న చైనా మొబైల్ సంస్థలకు దీటుగా ఉండాలనే ఇంత తక్కువకు 5జీ స్మార్ట్​ఫోన్ తీసుకొచ్చినట్లు చెప్పింది. ప్రీబుకింగ్ చేసుకునేవారికి ధర.. రూ.17,999లకే ఈ మొబైల్‎ను అందించనున్నారు.

ఫోన్ ఫీచర్స్:

  • గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్​తో 6.78 అంగుళాల డిస్​ప్లే
  • మీడియాటెక్​ డైమెన్సిటీ 810 చిప్​సెట్
  • 8జీబీ రామ్​, 128 జీబీ మెమొరీ
  • 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపీ డెప్త్ కెమెరా, 2ఎంపీ మాక్రో కెమెరా
  • 16మెగాపిక్సెల్ ఫ్రంట్​(సెల్ఫీ) కెమెరా5000mAh బ్యాటరీ30W సూపర్ ఫాస్ట్ ఛార్జర్​

Read also.. Stock Markets: జోరులో స్టాక్ మార్కెట్లు.. పెట్టుబడి పెట్టేముందు స్టాక్స్ గురించి పూర్తిగా తెలుసుకోండి!