Kotak Mahindra Bank: ‘కొటాక్’ కస్టమర్లకు శుభవార్త.. ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను భారీగా పెంచిన బ్యాంక్..

Kotak Mahindra Bank Hikes FD Interest Rates: ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థ కోటక్ మహీంద్రా బ్యాంక్ వివిధ కాలాల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (ఎఫ్‌డి) వడ్డీ రేట్లను మరోసారి పెంచింది.

Kotak Mahindra Bank: ‘కొటాక్’ కస్టమర్లకు శుభవార్త.. ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను భారీగా పెంచిన బ్యాంక్..
Kotak

Updated on: Apr 14, 2022 | 6:11 AM

Kotak Mahindra Bank Hikes FD Interest Rates: ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థ కోటక్ మహీంద్రా బ్యాంక్ వివిధ కాలాల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (ఎఫ్‌డి) వడ్డీ రేట్లను మరోసారి పెంచింది. తాజా ఎఫ్‌డీ రేట్ పెంపు రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాలపై మాత్రమే వర్తిస్తుందని కోటక్ మహీంద్రా బ్యాంక్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. కొత్త రేట్లు డొమెస్టిక్ / NRO / NRE ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాలకు వర్తిస్తాయంది. అయితే, NRO/NRE డిపాజిట్లపై సీనియర్ సిటిజన్ రేట్లు వర్తించవని కోటక్ మహీంద్రా బ్యాంక్ తెలిపింది. కొత్త రేట్లు ఏప్రిల్ 12, గురువారం నుంచి అమల్లోకి వచ్చాయి.

బ్యాంక్ తన ప్రకటనలో.. 121 రోజుల నుండి 179 రోజుల మధ్య కాల వ్యవధికి, 364 రోజులకు వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచినట్లు తెలిపింది. ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వరుసగా 4.50 శాతం, 4.75 శాతం వడ్డీని నిర్ణయించారు. నాలుగు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం కానీ ఐదేళ్లలోపు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు 5.45 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.

కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో (సంవత్సరానికి) రూ. 2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సవరించిన వడ్డీ రేట్ల వివరాలు..

1. 7 రోజుల నుండి 14 రోజుల వరకు – సాధారణ ప్రజలకు: 2.50 శాతం; సీనియర్ సిటిజన్లకు: 3.00 శాతం
2. 15 రోజుల నుండి 30 రోజుల వరకు – సాధారణ ప్రజలకు: 2.50 శాతం; సీనియర్ సిటిజన్లకు: 3.00 శాతం
3. 31 రోజుల నుండి 45 రోజుల వరకు – సాధారణ ప్రజలకు: 2.75 శాతం; సీనియర్ సిటిజన్లకు: 3.25 శాతం
4. 46 రోజుల నుండి 90 రోజుల వరకు – సాధారణ ప్రజలకు: 2.75 శాతం; సీనియర్ సిటిజన్లకు: 3.25 శాతం
5. 91 రోజుల నుండి 120 రోజుల వరకు – సాధారణ ప్రజలకు: 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు: 3.50 శాతం
6. 121 రోజుల నుండి 179 రోజుల వరకు – సాధారణ ప్రజలకు: 3.50 శాతం; సీనియర్ సిటిజన్లకు: 4 శాతం
7. 180 రోజులు – సాధారణ ప్రజలకు: 4.50 శాతం; సీనియర్ సిటిజన్లకు: 5 శాతం
8. 181 రోజుల నుండి 269 రోజుల వరకు – సాధారణ ప్రజలకు: 4.50 శాతం; సీనియర్ సిటిజన్లకు: 5 శాతం
9. 270 రోజులు – సాధారణ ప్రజలకు: 4.50 శాతం; సీనియర్ సిటిజన్లకు: 5 శాతం
10. 271 రోజుల నుండి 363 రోజుల వరకు – సాధారణ ప్రజలకు: 4.50 శాతం; సీనియర్ సిటిజన్లకు: 5 శాతం
11. 364 రోజులు – సాధారణ ప్రజలకు: 4.75 శాతం; సీనియర్ సిటిజన్లకు: 5.25 శాతం
12. 365 రోజుల నుండి 389 రోజుల వరకు – సాధారణ ప్రజలకు: 5.10 శాతం; సీనియర్ సిటిజన్లకు: 5.60 శాతం
13. 390 రోజులు (12 నెలల 25 రోజులు)- సాధారణ ప్రజలకు: 5.20 శాతం; సీనియర్ సిటిజన్లకు: 5.70 శాతం
14. 391 రోజుల నుండి 23 నెలల కంటే తక్కువ – సాధారణ ప్రజలకు: 5.20 శాతం; సీనియర్ సిటిజన్లకు: 5.70 శాతం
15. 23 నెలలు – సాధారణ ప్రజలకు: 5.25 శాతం; సీనియర్ సిటిజన్లకు: 5.75 శాతం
16. 23 నెలల 1 రోజు నుండి 2 సంవత్సరాల కంటే తక్కువ – సాధారణ ప్రజలకు: 5.25 శాతం; సీనియర్ సిటిజన్లకు: 5.75 శాతం
17. 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల కంటే తక్కువ – సాధారణ ప్రజలకు: 5.30 శాతం; సీనియర్ సిటిజన్లకు: 5.80 శాతం
18. 3 సంవత్సరాలు, 4 సంవత్సరాల కంటే తక్కువ – సాధారణ ప్రజలకు: 5.45 శాతం; సీనియర్ సిటిజన్లకు: 5.95 శాతం
19. 4 సంవత్సరాలు, 5 సంవత్సరాల కంటే తక్కువ – సాధారణ ప్రజలకు: 5.50 శాతం; సీనియర్ సిటిజన్లకు: 6 శాతం
20. 5 సంవత్సరాలు, 10 సంవత్సరాల వరకు కలుపుకొని – పబ్లిక్ కోసం: 5.60 శాతం; సీనియర్ సిటిజన్లకు: 6.10 శాతం

Also read:

G7 Summit – India: G7 సమ్మిట్‌కు భారత్‌కు ఆహ్వానం.. ఒక్క ప్రకటనతో ఆ ప్రచారానికి చెక్ పెట్టి జర్మనీ..!

Telangana Congress: రాజ్‌భవన్‌లో ఆసక్తికర దృశ్యం.. ఇది ప్రస్తుతానికేనా? ఎప్పటికీ ఉంటుందా?

Andhra Pradesh: కర్నూలు జిల్లాలో క్షుద్రపూజల కలకలం.. ఏకంగా సీఈవో పైనే దాడికి దిగిన సిబ్బంది..!