Kotak Bank FD Interest Rate: ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం అయిన కోటక్ మహీంద్రా బ్యాంక్ తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పావు శాతం పెంచినట్లు ప్రకటించింది. ఆర్ బీఐ రెపో రేటును 25శాతం పెంచిన 24గంటల్లోనే కోటక్ బ్యాంక్ ఫిక్సిడ్ డిపాజిట్ రేట్లను సవరించింది. రుణరేట్లు డిపాజిట్ రేట్లతో అనుసంధానమైన ఉంటాయన్న విషయం తెలిసిందే. సవరించిన ఎఫ్‌డి వడ్డీ రేట్లు ఫిబ్రవరి 10వ తేదీ నుంచి వర్తిసాయని బ్యాంక్ ప్రకటించింది.
రూ. 2కోట్ల వరకు డిపాజిట్లపై వడ్డీరేటు 7.10శాతానికి చేరింది. రూ. 2-5కోట్ల డిపాజిట్లపై రేటు 7.25శాతానికి చేరింది. రూ. 2కోట్ల వరకు ఉన్న మొత్తాలపై సీనియర్ సిటిజన్స్ కు 7.60శాతం ఫిక్స్ డ్ డిపాజిట్ వడ్డీరేటు అందిస్తుది. దీంతో ఈ ప్రయోజనాన్ని తమ కస్టమర్లకు బదిలీ చేయాలని..వారి పొదుపు నిధులపై అధిక రాబుడులను ఆఫర్ చేయాలని నిర్ణయించినట్లు కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రకటించింది.
సాధారణ ప్రజలకు రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తంపై ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు 6 నెలల నుండి ఏడాది కాలానికి 60శాతంగా నిర్ణయించింది. ప్రైవేట్ రుణదాతలు అయితే 364 రోజుల వ్యవధి కోసం సెట్ చేసిన ఎఫ్‌డి మొత్తం సాధారణ ప్రజలకు 6.25శాతం. అదే సీనియర్ సిటిజన్‌లకు రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తంలో 6.75శాతం.
అదే మొత్తానికి పదవీ కాలాన్ని 365నుంచి 389 రోజులకు పెంచినట్లయితే, సాధారణ ప్రజలకు ఎఫ్‌డి రేట్లు 6.90శాతానికి పెరుగుతాయి. సీనియర్ సిటిజన్‌లకు 365నంచి 389 రోజుల వ్యవధిలో అదే మొత్తానికి ఎఫ్‌డి రేటు 7.40శాతంగా నిర్ణయించింది. అదే డిపాజిట్ మొత్తానికి, 12 నెలల 25 రోజుల నుండి 2 సంవత్సరాల వరకు సాధారణ ప్రజలకు వడ్డీ రేటు 7.10శాతం కాగా సీనియర్ సిటిజన్లకు 7.60శాతం.
రూ.2 కోట్ల కంటే ఎక్కువ రూ. 5 కోట్ల కంటే తక్కువ ఎఫ్‌డి డిపాజిట్ చేసే సాధారణ ప్రజల కోసం , 180-270 రోజుల కాలవ్యవధికి రేటు 6.50శాతం నిర్ణయించింది. 280 రోజుల నుండి 364 రోజుల వరకు ఎఫ్‌డి రేట్లు 6.75శాతానికి పెరుగుతాయి. 36 రోజుల నుండి 15 నెలల వరకు డిపాజిట్ చేయడానికి ఎఫ్‌డి రేట్లను 7.20%కి పెంచింది. పదవీ కాలాన్ని 15 నెలల నుండి గరిష్టంగా 2 సంవత్సరాలకు పెంచినట్లయితే, ఎఫ్‌డి రేట్లు 7.25శాతంగా ఉంటాయని బ్యాంక్ తెలిపింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి