Credit Card: క్రెడిట్ కార్డుతో లోన్‌ తీసుకుంటున్నారా.? ముందు ఈ విషయాలు తెలుసుకోండి

|

Oct 26, 2024 | 7:11 AM

ప్రస్తుతం క్రెడిట్ కార్డుల వినియోగం భారీగా పెరిగింది. ప్రతీ ఒక్కరి చేతిలో ఒకటికి మించి క్రెడిట్ కార్డులు ఉన్నాయి. అయితే క్రెడిట్ కార్డుతో రుణాలు తీసుకునే వారి సంఖ్య కూడా ఇటీవల పెరుగుతోంది. అయితే కార్డులతో రుణాలు తీసుకునే ముందు కొన్ని విషయాలను గుర్తు పెట్టుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Credit Card: క్రెడిట్ కార్డుతో లోన్‌ తీసుకుంటున్నారా.? ముందు ఈ విషయాలు తెలుసుకోండి
Credit Card
Follow us on

ఒకప్పుడు కేవలం కొందిరికి మాత్రమే పరిమితమైన క్రెడిట్‌ కార్డు ప్రస్తుతం అందరికీ అందుబాటులోకి వచ్చింది. బ్యాంకుల మధ్య పెరిగిన పోటీ, ప్రైవేట్ బ్యాంకులు, ఈ కామర్స్‌ సంస్థల విస్తృతి పెరిగిన నేపథ్యంలో చాలా సింపుల్‌గా క్రెడిట్‌ కార్డులను ఇస్తున్నారు. ఇక మనం చేచే లావాదేవీల ఆధారంగా లిమిట్ పెంచడంతో పాటు క్రెడిట్ కార్డుపై రుణాలు కూడా అందిస్తున్నారు. అయితే క్రెడిట్ కార్డుతో లోన్‌ తీసుకునే విషయంలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ ఆ జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా పర్సనల్‌ లోన్‌, గోల్డ్‌ లోన్‌తో పోల్చితే క్రెడిట్‌ కార్డులో లోన్‌ తీసుకుంటే వడ్డీ ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే త్వరగా రుణం పొందాలనుకునే వారికి క్రెడిట్‌ కార్డ్‌ బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఇక మీ లిమిట్ ఎంత ఉందో అంత రుణ రూపంలో ఇస్తుంటారు. అయితే సిబిల్‌ స్కోర్‌ బాగుంటే లిమిట్ కంటే ఎక్కువ లోన్‌ కూడా పొందే అవకాశం ఉంటుంది. అలా అని కార్డులున్న వారందరికీ బ్యాంకులు లోన్స్ ఇవ్వకపోవచ్చు.

మీ సిబిల్‌ స్కోర్‌, గత లావాదేవీలను అంచనా వేసే బ్యాంకులు లోన్స్‌ ఇస్తాయి. ప్రతీ క్రెడిట్ కార్డుకు ఒక యాప్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్స్‌లో మీ లోన్‌కు సంబంధించిన వివరాలు ఉంటాయి. ఒక సింగిల్‌ క్లిక్‌తో రుణం మీ సేవింగ్‌ ఖాతాలోకి వచ్చేస్తుంది. ఇక క్రెడిట్ కార్డుతో లోన్‌ తీసుకున్న వారికి గరిష్టంగా 36 నెలల్లో తిరిగి తెల్లించే అవకాశం ఉంటుంది. సాధారణంగా మనం క్రెడిట్‌ కార్డులో ట్రాన్సాక్షన్‌ చేస్తే మన లిమిట్‌ తగ్గుతుంది. అయితే లోన్‌ విషయంలో అలా ఉండదు. మీ లిమిట్‌పై ఎలాంటి ప్రభావం ఉండదు.

లోన్‌ తీసుకున్న తర్వాత కూడా మీ క్రెడిట్‌ కార్డును ఎప్పటిలాగే ఉపయోగించుకోవచ్చు. క్రెడిట్‌ కార్డు లోన్‌ను ప్రత్యేకంగా ఎలాంటి డాక్యుమెంట్స్‌ ఇవ్వాల్సిన పనిలేదు. క్రెడిట్‌ కార్డు పొందే సమయంలో ఇచ్చిన డాక్యూమెంట్స్‌ సరిపోతుంది. ప్రతీ నెల మీరు ఎంత ఈఎంఐ ఎంచుకుంటారో అంత మొత్తం క్రెడిట్ కార్డులో బిల్లు రూపంలో వస్తుంది. నెలనెలా చెల్లించుకుంటే సరిపోతుంది. ఇన్‌స్టాల్‌ మెంట్‌ పే చేయడంలో విఫలమైతే కచ్చితంగా అది సిబిల్‌ స్కోర్‌పై ప్రభావం పడుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. పూర్తి వివరాల కోసం మీ క్రెడిట్‌ కార్డు యాప్‌లో లేదా బ్యాంకును సంప్రదించండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..