Profitable Companies: 2022లో టాప్-10 లాభదాయకమైన కంపెనీలు ఇవే.. పూర్తి వివరాలు..

|

May 22, 2022 | 3:52 PM

Profitable Companies: 2022 సంవత్సరంలో దేశంలో అత్యధిక లాభదాయకమైన టాప్-10 కంపెనీల వివరాలు తెలుసుకుందాం. వీటిలో ముందుగా..

Profitable Companies: 2022లో టాప్-10 లాభదాయకమైన కంపెనీలు ఇవే.. పూర్తి వివరాలు..
Earnings
Follow us on

Profitable Companies: 2022 సంవత్సరంలో దేశంలో అత్యధిక లాభదాయకమైన టాప్-10 కంపెనీల వివరాలు తెలుసుకుందాం. వీటిలో ముందుగా.. ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ 2022 ఆర్థిక సంవత్సరంలో అత్యంత లాభదాయకమైన భారతీయ కంపెనీగా అవతరించింది. FY22లో సదరు కంపెనీ రూ. 67,565 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. టెలికాం నుంచి రిటైల్ వ్యాపారం వరకు రిలయన్స్ నిర్వహిస్తున్న వివిధ వ్యాపారాల పూర్తి లాభాలను కలిపితే ఈ విలువ వస్తుంది. గత సంవత్సరంలో ఇదే కాలంతో పోల్చితే 27 శాతం ఎక్కువ లాభం వచ్చినట్లు చెప్పుకోవాలి. ఏడాది కాలంలో కంపెనీ అమ్మకాలు ఏకంగా 48 శాతం మేర పెరిగాయి.

ఇక ఈ జాబితాలో రెండవ స్థానంలో టాటా గ్రూప్ కు సంబంధించిన టాటా స్టీల్ నిలిచింది. FY22లో కంపెనీ ఏకంగా రూ. 41,749.16 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. ఇది అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 425% ఎక్కువగా చెప్పుకోవాలి. టాటా గ్రూప్ లో అత్యంత లాభదాయకమైన కంపెనీగా ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)ని టాటా స్టీల్స్ వెనక్కు నెట్టింది. దీంతో TCS కంపెనీ దేశంలో అత్యధిక లాభదాయకమైన కంపెనీల్లో మూడవ స్థానానికి చేరుకుంది. కంపెనీ  రూ.38,449 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. లాభం 18 శాతం పెరగగా.. కంపెనీ అమ్మకాలు ఈ కాలంలో 17 శాతం మేర పెరిగాయి.

భారతదేశపు అత్యంత విలువైన బ్యాంకుగా ఉన్న HDFC రూ. 38,150.90 కోట్ల నికర లాభంతో దేశంలో నాల్గవ అత్యంత లాభదాయకమైన కంపెనీగా నిలిచింది. దీని తరువాతి స్థానంలో దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.36,356.17 కోట్ల లాభాన్ని ఆర్జించింది. కంపెనీ ఏడాది ప్రాతిపదికన 50 శాతం వృద్ధిని నమోదు చేసింది.

మరో బ్యాంకింగ్ దిగ్గజం ICICI బ్యాంక్ FY22లో రూ. 25,783.83 కోట్ల నికర లాభంతో జాబితాలో ఆరవ స్థానంలో ఉంది. ఇండియన్ ఆయిల్ రూ. 24, 491.04 కోట్లు, వేదాంత రూ. 23,709 కోట్లు, ఇన్ఫోసిస్ రూ. 23,709 కోట్లు, ITC రూ. 15,585.65 కోట్ల లాభంతో టాప్ పది లాభదాయకమైన కంపెనీల జాబితాలో చోటు దక్కించుకున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి