Kiyosaki: వెన్నులో వణుకు పుట్టించే విషయం బయటపెట్టిన రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌ రచయిత! రాబోయే రోజుల్లో..

రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి ప్రపంచ ఆర్థిక పతనం, తీవ్ర నిరుద్యోగంపై హెచ్చరించారు. జపాన్ క్యారీ ట్రేడ్ సృష్టించిన 30 ఏళ్ల బుడగ పగిలిందని, చరిత్రలో అతిపెద్ద పతనం ప్రారంభమైందని ఆయన అన్నారు. ఈ సంక్షోభం ఆస్తులను కరిగిస్తుందని, అయితే దీని నుంచి బయటపడే మార్గం కూడా ఆయన వెల్లడించారు.

Kiyosaki: వెన్నులో వణుకు పుట్టించే విషయం బయటపెట్టిన రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌ రచయిత! రాబోయే రోజుల్లో..
Robert Kiyosaki

Updated on: Dec 01, 2025 | 9:00 AM

రిచ్‌ డాచ్‌ పూర్‌ డాడ్‌ అనే ప్రపంచ ప్రఖ్యాత పుస్తకాన్ని రచించిన అమెరికన్ పెట్టుబడిదారుడు రాబర్ట్ కియోసాకి సంచలన ప్రకటన చేశారు. రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఆస్తి కరిగిపోతుందని, నిరుద్యోగం తీవ్రంగా పెరగవచ్చని అన్నారు. చరిత్రలో అతిపెద్ద పతనం థాంక్స్ గివింగ్ ప్రారంభమైందని హెచ్చరించారు. ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టమని తన అనుచరులకు సలహా ఇచ్చాడు. మరింత ధనవంతులు కావడానికి తన వ్యూహాన్ని పంచుకున్నాడు.

ఎక్స్‌లో ఒక పోస్ట్ చేస్తూ.. గత 30 సంవత్సరాలుగా జపాన్ ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో పెట్టుబడిదారులకు బిలియన్ల రూపాయలు అప్పుగా ఇస్తోందని, ఈ డబ్బు రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్లు, బాండ్లు, వస్తువులు, వ్యాపారాలలోకి పోయిందని ఆయన పేర్కొన్నారు. జపాన్ లో ఈ క్యారీ ట్రేడ్ ప్రపంచ ఆస్తులను గణనీయంగా పెంచి, భారీ బుడగ(బలహీనమైన పెట్టుబడి విధానం లేదా ఆస్తి)ను సృష్టించింది. జపాన్ ఈ బుడగను పగులగొట్టిందని, థాంక్స్ గివింగ్ చరిత్రలో అతిపెద్ద పతనానికి దారితీసిందని కియోసాకి పేర్కొన్నారు. 30 ఏళ్ల ఈ బుడగ పగిలిపోవడం వల్ల చాలా మంది తీవ్ర ఇబ్బందుల్లో పడతారని కియోసాకి హెచ్చరించారు. లక్షలాది మంది నిరుద్యోగులు, పేదలు వారి ఇళ్లను కూడా కోల్పోవచ్చు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పటికీ ప్రస్తుత పరిస్థితి ప్రజలు ధనవంతులు కావడానికి అవకాశాన్ని కల్పిస్తోందని కియోసాకి అన్నారు. చరిత్రలో అతిపెద్ద నష్టాల నుండి మిమ్మల్ని రక్షించగల 10 చిట్కాలను రాబోయే కొద్ది రోజుల్లో పంచుకుంటానని కియోసాకి ఒక సుదీర్ఘ పోస్ట్‌లో పేర్కొన్నారు. AI లక్షలాది ఉద్యోగాలను తొలగిస్తుందని మనందరికీ తెలుసు అని కియోసాకి పేర్కొన్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి