Business Idea: జస్ట్‌ అక్కడి నుంచి కొని.. మన దగ్గర అమ్మితే చాలు లక్షల్లో లాభం! కాసులు కురిపించే బిజినెస్‌

బిజినెస్‌ అంటే భారీ పెట్టుబడి అవసరం లేదు. కేరళలోని ఇడుక్కి ప్రాంతంలో ఎగుమతులకు తిరస్కరించబడిన (సెకండ్ గ్రేడ్) యాలకులు, మిరియాలు, లవంగాలను కొనుగోలు చేసి, ప్యాకింగ్ చేసి దేశీయంగా విక్రయించడం ద్వారా లక్షలు సంపాదించవచ్చు. తక్కువ రిస్క్‌తో అధిక లాభాలు పొందే అద్భుత అవకాశం ఇది.

Business Idea: జస్ట్‌ అక్కడి నుంచి కొని.. మన దగ్గర అమ్మితే చాలు లక్షల్లో లాభం! కాసులు కురిపించే బిజినెస్‌
Indian Currency 6

Updated on: Jan 16, 2026 | 10:07 PM

బిజినెస్‌ అంటే చాలా మంది పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టాలి. ఒక ఆఫీస్‌, ఫ్యాక్టరీ, వర్కర్లు, వస్తువుల తయారీ అబ్బో చాలానే అనుకుంటారు. కానీ, నిజానికి సరైన బిజినెస్‌ చేస్తే అవేవి లేకుండానే లక్షలు సంపాదించుకోవచ్చు. అలాంటి ఓ బిజినెస్‌ గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

యాలకులు, మిరియాలు, లవంగాలు వంటి పంటలు కేవలం మన దేశంలోని కేరళ రాష్ట్రం ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోనే పండిస్తారు. వీటికి ప్రపంచంలో ఎక్కడైనా భారీ డిమాండ్‌ ఉంటుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం కేరళలోని ఇడుక్కి ప్రాంతంలోనే స్పైసెస్ బోర్డును ఏర్పాటు చేసింది. ఇక్కడ ముఖ్యంగా యాలకులను విదేశాలకు ఎగుమతి చేసేందుకు గ్రేడింగ్ నిర్వహిస్తారు. వాటి సైజును బట్టి ఈ గ్రేడింగ్ జరుగుతుంది. ఎక్కువ పొడవు ఉన్నటువంటి యాలకులను విదేశాలకు పంపుతారు. అయితే విదేశాలకు ఎగుమతికి రిజెక్ట్ అయినటువంటి సరుకును దేశీయంగా విక్రయించుకోవచ్చు.

వీటిని కొనుగోలు చేసి రిటైల్ మార్కెట్లో ప్యాకింగ్ చేసి విక్రయించుకున్నట్లయితే మంచి లాభం పొందవచ్చు. సాధారణంగా కేరళలో ఎక్స్‌పోర్ట్‌కు రిజెక్ట్ అయిన (సెకండ్ గ్రేడ్) యాలకులు, మిరియాలు, లవంగాలను స్థానిక మార్కెట్లలో కొనుగోలు చేయవచ్చు. మీరు ఎగుమతికి రిజక్ట్ అయినటువంటి యాలకులను కొనుగోలు చేయాలి అనుకున్నట్లయితే కేరళలోని ఇడుక్కి జిల్లాలో వీటిని ఎక్కువగా విక్రయిస్తుంటారు. ఈ రిజెక్ట్ సెకండ్ గ్రేడ్ యాలకులను వందన్మేడు, పుట్టడి, కుమిలి, సంతన్పారా, నెడుంకండం మార్కెట్లో ఎక్కువగా విక్రయిస్తుంటారు.

వాటి బల్క్‌లో కొని తెచ్చుకొని, మన రాష్ట్రంలో హోల్‌సేల్‌గా లేదా రిటైల్‌గా కూడా అమ్ముకోవచ్చు. పెద్దగా రిస్క్‌ ఉండదు. ఎందుకంటే అవి త్వరగా చెడిపోయే సరుకు కాదు. ఒక్కసారిగా ధర తగ్గిపోయేది అసలే కాదు. సాధారణంగా సెకండ్ గ్రేడ్ యాలకుల ధర ఒక కేజీ రూ.1800 నుంచి రూ.2000 రూపాయల వరకు ఉంటుంది. అంటే క్వింటా రెండు లక్షల రూపాయల వరకు పలకవచ్చు. ఇక తక్కువ వాసనా లైట్ కలర్ ఉన్నవి ఒక కేజీ రూ.1600 రూపాయల రూ.1800 రూపాయల వరకు ధర పలుకుతుంది. బ్రోకెన్, స్క్రాచ్ ఉన్న యాలకులు కేజీ రూ.1300 నుంచి రూ.1600 పలుకుతాయి. అలాగే సెకండ్ గ్రేడ్ లవంగాలు, మిరియాలు సైతం ఈ మార్కెట్లలో లభిస్తాయి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి