Liquor Sales: మందుబాబుల మజాకా..! ఒక్కవారంలో ఎంత తాగారంటే.. చంద్రయాన్‌-3 ఖర్చు కూడా తక్కువేనట..!

|

Sep 03, 2023 | 6:10 PM

ఇస్రో చంద్రయాన్ -3 మిషన్ మొత్తం ఖర్చుకంటే.. ఒక రాష్ట్రంలో 9రోజుల్లో వినియోగించిన మద్యం ఖర్చు ఎక్కువగా ఉందంటే నమ్ముతారా..? అవును చంద్రయాన్‌-3 ఖర్చు కంటే.. ఎక్కువ మద్యం వారంలో తాగారంటే ముక్కున వేలేసుకోవాల్సిందే. దేశంలోని ఈ రాష్ట్రంలో అలాంటి ఓ పండుగ సందర్భంగా మద్యం అమ్మకాలు రికార్డ్‌ సృష్టించాయి. వివరాల్లోకి వెళితే..

Liquor Sales: మందుబాబుల మజాకా..! ఒక్కవారంలో ఎంత తాగారంటే.. చంద్రయాన్‌-3 ఖర్చు కూడా తక్కువేనట..!
Liquor Sale
Follow us on

చాలా వరకు అన్ని ప్రభుత్వాలకు అతి ముఖ్యమైన ఆదాయ వనరు మద్యం. ఇది సాంప్రదాయకంగా అతిపెద్ద ఆదాయ వనరులలో ఒకటిగా చెప్పకతప్పదు. ఈ మాట చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు వెల్లడైన తాజా మద్యం అమ్మకాల డేటా ద్వారా ఇది మరోసారి రుజువైంది. ఇస్రో చంద్రయాన్ -3 మిషన్ మొత్తం ఖర్చుకంటే.. ఒక రాష్ట్రంలో 9రోజుల్లో వినియోగించిన మద్యం ఖర్చు ఎక్కువగా ఉందంటే నమ్ముతారా..? అవును చంద్రయాన్‌-3 ఖర్చు కంటే.. ఎక్కువ మద్యం వారంలో తాగారంటే ముక్కున వేలేసుకోవాల్సిందే. దేశంలోని ఈ రాష్ట్రంలో అలాంటి ఓ పండుగ సందర్భంగా మద్యం అమ్మకాలు రికార్డ్‌ సృష్టించాయి. వివరాల్లోకి వెళితే..

కేరళలో అతి ముఖ్యమైన పండుగ..

ఇది కేరళ నుండి వచ్చిన వార్త. కేరళలో ఓనం ప్రధాన పండుగ. ఈ సంవత్సరం ఆగస్టు 20 నుండి ఆగస్టు 31 వరకు ఓనం పండుగ అట్టహాసంగా జరుపుకున్నారు. కేరళలో ఓనమ్‌ను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలు పండుగ వాతావరణాన్ని ఎంజాయ్‌ చేస్తారు. ఈ పండుగను పురస్కరించుకుని చాలా మంది మద్యం సేవిస్తారు. ఓనం సందర్భంగా రాష్ట్రంలో జరిగిన మద్యం అమ్మకాలు తెలిస్తే షాక్‌ అవుతారు.

ఓనం సందర్భంగా జరిగిన మద్యం అమ్మకాలు..

నివేదిక ప్రకారం, ఈ ఏడాది ఓనం సందర్భంగా కేరళ ప్రజలు తొలి 9 రోజుల్లో రూ.665 కోట్ల మద్యం సేవించారు. ఈసారి ఓనం సందర్భంగా రాష్ట్ర ప్రజలు రూ.759 కోట్ల విలువైన మద్యాన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం. ఓనం పండుగ కారణంగా బుధ, గురువారాల్లో రెండు రోజుల పాటు కేరళలో మద్యం దుకాణాలు మూసివేయడం ఆసక్తికరం. అంటే, ఈ విక్రయం కేవలం వారం రోజుల వ్యవధిలోనే జరిగిపోయింది. ఇది మన ఇస్త్రో సాధించిన చంద్రయాన్-3 ఖర్చు కంటే ఎక్కువని తెలిసింది.

ఇవి కూడా చదవండి

చంద్రయాన్-3 ఖర్చు కంటే ఎక్కువ..

గతేడాది ఓనం సందర్భంగా కేరళ ప్రజలు రూ.624 కోట్ల మద్యం సేవించారు. ఈ సంఖ్య ఇస్రో ఇటీవలి చంద్రుని మిషన్ ఖర్చు కంటే ఎక్కువ. దాదాపు రూ.600 కోట్లతో చంద్రయాన్-3 మిషన్‌ను ఇస్రో పూర్తి చేసింది. అంటే కేరళ ప్రజలు ఓనం పండుగను పురస్కరించుకుని ఇస్రో చేపట్టిన చంద్రయాన్ మిషన్ మొత్తం ఖర్చు కంటే రూ.160 కోట్ల విలువైన మద్యం సేవించారు.

ఒక్కరోజులో రూ. 116 కోట్లకు పైగా అమ్మకాలు జరిగాయి..

ఈ ఏడాది కేరళలో అత్యంత ముఖ్యమైన ఓనం రోజున రూ.116 కోట్లకు పైగా మద్యం విక్రయించగా, ఏడాది క్రితం రూ.112 కోట్లకు పెరిగింది. రాష్ట్రంలోని పలు ఔట్‌లెట్లలో ఒక్కరోజులోనే కోటి రూపాయలకు పైగా మద్యం విక్రయించారు. వీటిలో ఇరింజల్‌కుడలోని బెవ్‌కో అవుట్‌లెట్, ఆశ్రమంలోని బెవ్‌కో ఔట్‌లెట్, ఒక రోజులో వరుసగా రూ. 1.06 కోట్లు, రూ. 1.01 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..